ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆవేదననే 4 లెటర్స్ కథ.. కష్టాలు తెలుసుకొని.. రఘురాజ్
వెండితెరపై సరికొత్త ప్రేమ కథాచిత్రం '4 లెటర్స్' త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉదయ్ కుమార్, దర్శకుడు రఘురాజ్ సంయుక్తంగా ఈ రోజు ఉదయం పాత్రికేయులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. 4 లెటర్స్ మూవీ గురించి చిత్ర దర్శకుడు ఆర్. రఘురాజ్ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

ఎయిర్‌పోర్టు నుంచి వస్తుంటే
4 లెటర్స్ మూవీ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది..ఈ సినిమా ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కి అంకితం ఇస్తున్నాము,అసలు ఈ స్టొరీ ఎలా పుట్టిందో చెపుతాను నేనొక రోజు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి క్యాబ్‌లో వస్తుంటే నేను ప్రయాణించే కారులో "Scinese is about Knowing, Engineering is about doing.. But all Engineers are Dyeing" అన్న కొటేషన్ ఒకటి కనిపించింది. దాని గురించి డ్రైవర్ని అడిగా ఏంటిదని.? సార్ నేనొక B.tech స్టూడెంట్ ని మా అందరికి జాబ్స్ దొరక్క పదివేల రూపాయలకు చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నారు అని అన్నారు.

ఇంజినీరింగ్ డిగ్రీకి వాల్యూస్ లేదని చెప్పడంతో
ఇంజినీరింగ్ డిగ్రీకి వాల్యూ లేదని చెప్పగానే నేను ఆశ్చర్యపోయి కొన్నిరోజులు అతనితో ట్రావెల్ చేసి ఇంజినీరింగ్ చేసిన వారి కష్టాలు తెలుసుకున్నాను. అలా ఈ స్టొరీ పుట్టింది..ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కి మా సినిమాలో ఒక మెసేజ్ కూడా ఉంటుంది.
"Love at First Sight" అని చెపుతూ ఉంటారు. కానీ అవన్నీ బ్రేకప్ అవుతున్నాయి.. "Love at Second Look" అనే కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తున్నాము..మీ అందరికి నచ్చుతుంది.

ఎవరూ చేయని సాహసం చేస్తున్నాం
మా 4 లెటర్స్ ఒక్క యూత్ కే కాదు పెద్దవాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది.వంద సంవత్సరాల సినిమా చరిత్రలో ఎవరు చేయని సాహసం మేము మా సినిమాలో చేశాం. అది మీరు థియేటర్‌లో చూసినప్పుడు మీకు అర్ధమవుతుంది. ఈ సినిమాలో హీరో ఫాదర్ కి POOR అనే ఫోర్ లెటర్స్ నచ్చవు..మరోవైపు హీరోయిన్ మదర్ కి RICH అనే ఫోర్ లెటర్స్ నచ్చవు..హీరోయిన్ LOVE అనే ఫోర్ లెటర్స్ తో సతమతమవుతుంది..హీరోయిన్ ఫాదర్ జీవితంలో FAIL అనే ఫోర్ లెటర్స్ తప్ప ఏం అనుభవించడు..హీరో ఫ్రెండ్స్ PASS అనే ఫోర్ లెటర్స్ గురించి ఆలోచించరు..

75 రోజుల్లోనే కంప్లీట్ చేశాం
4 లెటర్స్ చిత్రాన్ని రిచ్ లోకేషన్స్ లో చిత్రికరించాం.. థాయిలాండ్ లోని ప్రత్వేకమైన ప్రదేశాల్లో పాటలు షూట్ చేశాం..ప్రీ-ప్రొడక్షన్,షూటింగ్,పోస్ట్-ప్రొడక్షన్ తో కలిపి మొత్తం 75 రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ చేశాం. మేము చేసుకున్న ప్లానింగ్ షెడ్యుల్‌కి సహకరించిన దొమ్మరాజు భాస్కర్ రాజు గారికి థాంక్స్ చెప్పుకుంటున్నాను. మా సినిమాలో హీరో ఈశ్వర్, హీరోయిన్స్ తువా చక్రబోర్తి, అంకిత మహారాణాకు మొదటి సినిమా అయినప్పటికీ చాలా చక్కగా నటించారు.

మ్యూజిక్ హైలెట్ అవుతుందని
షూటింగ్‌కు రెండు నెలలు ముందు వర్క్ షాప్ పెట్టడం వలన త్వరగా షూటింగ్ పూర్తి చేయగలిగినాం. మార్కెట్‌లోకి వచ్చిన మా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో, అతనిచ్చిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అవుతుంది. సినిమాటోగ్రఫర్ చిట్టిబాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా
4 లెటర్స్ చిత్రంలోని పాటలను షూట్ చేసిన విధానం మరియు సన్నివేశానికి తగ్గట్టు లైటింగ్ చేసి మా చిత్రాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో అతని తోడ్పాటు మరవలేనిది..మా నిర్మాత అన్ని రకాలుగా సహకారం అందించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మమ్మల్ని ముందుకు నడిపిచ్చిన మా నిర్మాతలు దొమ్మరాజు ఉదయ కుమార్ దొమ్మరాజు హేమలత గార్లకు ప్రత్వేకంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను అని దర్శకుడు ఆర్. రఘురాజ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











