సందీప్ రెడ్డి వంగ డ్రీమ్ ప్రాజెక్ట్.. మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్!

టాలీవుడ్ సెన్సేషనల్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫిల్మ్ మేకింగ్ లో ఉన్న అన్ని హద్దులను దాటేసి అర్జున్ రెడ్డి అనే సంచలనాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దాంతో టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారారు. ఆ తర్వాత అదే చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసి నార్త్ ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక చివరిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో యానిమల్ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మరింత సెన్సేషన్ గా మారారు.

ఇలా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. ప్రస్తుతం అగ్ర దర్శకుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఏకంగా స్టార్ హీరోలే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించాలని తహతహలాడుతుండటం విశేషం. ఆ స్థాయిలో సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్ మేకింగ్ ఉండటం గమనార్హం. ఇక సందీప్ రెడ్డి వంగ నుంచి నెక్ట్స్ రాబోతున్న చిత్రం స్పిరిట్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులను సందీప్ రెడ్డి పూర్తి చేస్తున్నారు.

Director Sandeep Reddy Vanga Dream Project

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రూపిందించబోయే స్పిరిట్ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది. ఇక విలన్ గా ఇంటర్నేషనల్ యాక్టర్ డాన్లీ ఎంపికైనట్టు టాక్. భారీ స్కేల్లో చిత్రాన్ని నిర్మించబోతుండటం విశేషం. ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఎప్పటికైనా ఆయన ఆ ప్రత్యేకమైన చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నారంట.

ఇంతకీ సందీప్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ మరేదో కాదు. అమెరికన్ సింగర్, ది లెజెండ్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ ను తీయాలని ఉందని చెప్పారు. కానీ ఆ పాత్రలో జీవించగల నటులు ఇంత వరకు ఆయన కంట పడలేదని అభిప్రాయపడ్డారు. ఆయనను మ్యాచ్ చేసే నటుడు దొరికే మాత్రం మొదలు పెడతానని చెప్పుకొచ్చారు. మైఖేల్ జాక్సన్ జీవిత కథకు ఇండియాలోనూ బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ వస్తుంది.

ఆ బయోపిక్ లో మైఖేల్ జాక్సన్ చైల్డ్ హుడ్ లైఫ్, ఆయన స్కూళ్లలో పాటలు పాడటం, ప్రైమరీ స్కూల్, హైస్కూల్ లో ఆయన జీవితం. అలాగే మైఖేల్ జాక్సన్ స్కిన్ కలర్, దాంతో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, ఇలా ప్రతి విషయంలో మైఖేల్ జాక్సన్ లైఫ్ గొప్పగానే ఉంటుంది. మరో జీవితం రెండో కోణం చాలా టఫ్ గా ఉంటుంది. కానీ ఆ పొటెన్షియల్ ఉన్న యాక్టర్ దొరకడం కష్టం. ఆ ప్రాజెక్ట్ చేయాలనేది నా డ్రీమ్. ఒక వేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే మాత్రం ఇండియాలో ప్రతి ఒక్కరి చేత టికెట్ కొనిపిస్తా.. అంటూ సందీప్ రెడ్డి వంగ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X