twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Major మూవీ బాధ్యత పెంచింది.. గొప్ప చిత్రాలు రూపొందిస్తా.. దర్శకుడు శశికిరణ్ తిక్క (ఇంటర్వ్యూ)

    |

    గూఢచారి సినిమాతో స‌క్సెస్ పుల్ ద‌ర్శ‌కుడిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టిన శ‌శికిర‌ణ్ తిక్క మేజ‌ర్ మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవితం తెర‌మీద ఆవిష్క‌రించ‌డంతో అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌తోపాటు సినీ వర్గాల నుంచి ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ద‌ర్శ‌కుడిగా మ‌లి ప్ర‌య‌త్నంతోనే అరుదైన గౌర‌వం పొందిన ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్క. మేజర్ ఘన విజయం సాధించిన సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా దర్శకుడు శశికిరణ్ తిక్క మాట్లాడుతూ..

    మేజర్ సినిమాకు వస్తున్న స్పందన ఎంతో సంతృప్తిని ఇస్తున్నది. గౌరవాన్ని తెచ్చి పెట్టి గర్వంగా ఫీలయ్యే సినిమా చేశాం. తెలుగులో అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. బాలీవుడ్ లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. విక్రమ్, పృథ్వీరాజ్ చిత్రాలతో చూస్తే మాది చిన్న చిత్రం. అయినా వాటితో పాటే ఆదరణ పొందుతోంది. మంచి సినిమా చేస్తామని మేజర్ సందీప్ తల్లిదండ్రులకు మేమిచ్చిన మాటను నిలబెట్టుకున్నామనే సంతోషం మిగిలింది. బాలీవుడ్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా అప్రిసియేషన్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్, రానా వంటి హీరోలు ఫోన్స్ చేసి సినిమా చాలా బాగా చేశారు అని మెచ్చుకుంటున్నారు. ఇవన్నీ నేను మర్చిపోలేని జ్ఞాపకాలు. మేజర్ సినిమా ప్రివ్యూ చూశాక సందీప్ తల్లిదండ్రులు నన్ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. మేము ఎంత నిజాయితీగా పనిచేశామో ఆమె స్పందన ద్వారా తెలిసింది.

     Director Shashi Kiran Tikka says, Major increased more responsibility on movie making

    మేజర్ సినిమాకు వచ్చిన పేరు, ఈ సినిమా నాకు తీసుకొచ్చిన గుర్తింపుతో ఇక నేను చేయబోయే సినిమాలు కూడా ఇంతే జాగ్రత్తగా, భాధ్యతతో చేయాలనుకుంటున్నా. ఈ పేరును కాపాడుకుంటూనే సినిమాలు రూపొందిస్తా. ఏ సినిమా చేసినా ఏదో ఒక మంచి కథను చెప్పాలని ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఓ సినిమాకు ఒప్పందం కుదిరింది. ఈ సినిమా ఏ హీరోతో చేస్తాననేది ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే నేను ముందు కథను సిద్ధం చేసుకుంటా. కనీసం ఆరేడు నెలలు కథ మీద వెచ్చించాల్సి వస్తుంది. కథ పూర్తయ్యాక హీరోను సెలెక్ట్ చేసుకుంటా అని శశికిరణ్ తిక్క చెప్పాడు.

     Director Shashi Kiran Tikka says, Major increased more responsibility on movie making

    కొత్త దర్శకులకు ఇండస్ట్రీలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. సినిమా మీద ప్యాషన్ ఉండి, ఏదైనా మంచి కథ ఉంటే ఓటీటీల నుంచి, ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. మీ దగ్గరకు అవకాశాలు రావు మీరే సృష్టించుకోవాలి. యంగ్ ఫిలింమేకర్స్‌కు నేను ఇదే చెప్పాలనకుంటున్నా. మా టైమ్‌లో ఇంత టెక్నాలజీ లేదు, ఓటీటీ వేదికలు లేవు, స్క్రిప్టు పట్టుకుని తిరగాల్సి వచ్చేది. ఇప్పటి వారికి ఎన్నో వేదికలు వస్తున్నాయి అని శశికిరణ్ తెలిపాడు.

    బ్రిటీష్ కాలపు నేపథ్యంతో ఓ సినిమా రూపొందించాలని ఉంది. మరికొన్ని కథలు ఐడియాల రూపంలో, చిన్న డ్రాఫ్ట్‌లుగా ఉన్నాయి. నేను సినిమాల ఎంపికలో తొందరపడటం లేదు. కనీసం ఏడాదికి ఒకటైనా చేసుకుంటూ వెళ్లాలని అనుకుంటున్నాను అని శశికిరణ్ తిక్క తన భవిష్యత్ ప్లాన్స్‌ను వెల్లడించారు.

    English summary
    Major Sandeep Unnikrishnan's biopic Major doing well in india. In this occassion, He spoke to filmibeat Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X