Just In
Don't Miss!
- Sports
యువరాజ్ సింగ్ ట్వీట్‌పై దుమారం.. ఈ లెక్కన కోహ్లీ 200 సెంచరీలు చేసేవాడా?
- News
చంద్రబాబు చచ్చిన పాముతో సమానం..ఎక్కడికెళ్ళినా పీకేదేం లేదు: విజయసాయి రెడ్డి ధ్వజం
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘మణిరత్నం సినిమాను ఒప్పుకోలేదు.. కానీ నా మూవీకి ఒకే చెప్పారు.. త్రివిక్రమ్ సలహాతోనే’
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శిష్యుడిగా వెంకీ కుడుముల ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. తన దర్శకత్వంలో ద్వితీయ చిత్రంగా ప్రస్తుతం భీష్మ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యువ హీరో హీరోయిన్లు నితిన్, రష్మిక మందన్న జంటగా రూపొందిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు అనంత్ నాగ్ కూడా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 21వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు వెంకీ కుడుముల మీడియాతో మాట్లాడారు.. ఆయన పంచుకొన్న ముచ్చట్లు మీ కోసం..

నితిన్ బాడీ లాగ్వేంజ్‌కు తగినట్టుగా
ఛలో తర్వాత హీరో నితిన్‌తో సినిమా చేయాలని అనుకొన్నాను. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టే సినిమా చేయాలని అనుకొని లైన్ చెప్పాను. తనకు ఆ లైన్ నచ్చడంతో పూర్తి స్థాయి స్క్రిప్టు ఉంటే చేద్దామని అన్నాడు. దాంతో కథ రాసుకోవడం మొదలుపెట్టాను. నితిన్‌ది పెళ్లికాని ప్రసాద్ లాంటి క్యారెక్టర్. భీష్మ అనే పేరు పెట్టుకోవడం వల్ల అమ్మాయిలు ప్రేమించడం లేదనే సందేహంతో ఉంటారు. నితిన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది అని దర్శకుడు వెంకీ కుడుముల అన్నారు.

వినోద ప్రధానమైన కథలో సందేశం
తెలుగు సినిమా పరిశ్రమలో ఎలాంటి జోనర్ కథైనా.. ప్రధానంగా లవ్ అనేది ఉంటుంది. లవ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను బేస్ చేసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ కథను సిద్ధం చేసుకొన్నాను. వ్యవసాయం ప్రాధాన్యతను చెప్పాలని భావించాను. కథకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పాయింట్‌ను జొప్పించాను. సందేశం ఉంటుంది కానీ.. ఉపన్యాసాలు ఉండవు అని వెంకీ కడుముల పేర్కొన్నారు.

వ్యవసాయ ప్రధానమైన కుటుంబం
బేసిక్‌గా నేను అగ్రికల్చర్ బీఎస్సీ చదివాను. మా కుటుంబం కూడా వ్యవసాయ ప్రధానమైనది. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అలాంటి క్రమంలో నేను ఆహారం కల్తీ చేసే వీడియో ఒకటి చూశాను. అప్పుడు నేను ఆర్గానిక్ ఫామింగ్‌పై సినిమా చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని అనుకొన్నాను. ఇంజెక్షన్లు ఇచ్చి ఫలాలను కృత్రిమంగా పండిస్తున్నారు. దీంతో వినియోగదారుల ఆరోగ్యంపై ప్రభావం పడుతున్నది. అందుకే ఓ క్లారిటీ కోసం ఈ కథను ఎంచుకొన్నాం అని వెంకీ కుడుముల వెల్లడించారు.

రాయల్ లుక్ ఉన్న క్యారెక్టర్‌తో
భీష్మ సినిమా కథలో రాయల్ లుక్ ఉన్న క్యారెక్టర్ కోసం మంచి యాక్టర్‌ను తీసుకోవాలనుకొన్నాను. ఆ క్రమంలో ఓ కన్నడ సినిమా చూసినప్పుడు నా క్యారెక్టర్‌కు సరిగ్గా సరిపోతాడనిపించింది. వెంటనే వెళ్లి కథ చెప్పి.. ఆయన క్యారెక్టర్‌ను డిటేయిల్‌గా నెరేషన్ ఇచ్చాను. దాంతో ఆయన నా సినిమాకు ఒప్పుకొన్నాడు. అంతకుముందు మణిరత్నం ఆఫర్ ఇచ్చిన ఒప్పుకోలేదని ఆయన చెప్పడంతో నా కథపై, అనంత్ నాగ్ క్యారెక్టర్‌పై మరింత నమ్మకం కలిగింది అని వెంకీ కుడుముల తెలిపారు.


నితిన్‌తో చేసే ముందు
నితిన్‌తో చేసే ముందు బిజినెస్ వ్యవహారాలు ఆలోచించలేదు. ఆయన మార్కెట్‌ను అంచనా వేయలేదు. కానీ ఓ మంచి సినిమా తీస్తే ప్రేక్షకులకు థియేటర్లకు వస్తారని మాత్రం నమ్మకం ఉంది. అందుకే మంచి కథతో మాత్రమే సినిమా తీయాలని అనుకొన్నాను. నేను ఊహించినట్టే కథ తెర మీద సంతృప్తికరంగా వచ్చింది. త్రివిక్రమ్ కూడా హ్యాపీ అయ్యారు.

త్రివిక్రమ్ సలహాతోనే
భీష్మ సినిమా చూసిన తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సలహా ఇచ్చారు. ట్రైలర్‌లో కథ చెప్పమన్నారు. దాంతో ప్రేక్షకులు ఓ ఫీలింగ్‌తో సినిమాకు వస్తారని చెప్పారు. నేను రాసే డైలాగ్స్‌పై త్రివిక్రమ్ ప్రభావం ఉంటుంది. ఆయన వద్ద పనిచేయడం వల్ల నాపై ఆ ప్రభావం ఉంటుందని అనుకొంటున్నాను అని వెంకీ కుడుముల ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.