Don't Miss!
- Sports
Commonwealth Games : నాలుగో స్థానంతో ముగించిన భారత్.. షూటింగ్ ఉండుంటేనా..!
- Lifestyle
మీ వంటగదిలో ఉండే ఈ 8 వస్తువులు మీ జుట్టును పొడవుగా మరియు మెరిసేలా చేయగలవని మీకు తెలుసా?
- News
జీవన్ రెడ్డి హత్య కుట్ర కేసు చేధించిన పోలీసులు.. కారణమిదే..?
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
- Finance
Vizag Housing: విశాఖలో విపరీతంగా పెరిగిన ఇళ్ల ధరలు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎస్బీఐ..
- Automobiles
19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మంగళూరు వ్యక్తి అరుదైన రికార్డ్
- Technology
iPhone14 సిరీస్ విడుదల సెప్టెంబర్ 6వ తేదీనేనా! సేల్ ఎప్పుడంటే!
నా సినిమా హిట్ అయితే నాన్న ఖాతాలో.. ఫెయిల్ అయితే నీవల్లే అంటాడు.. మమ్ముట్టి గురించి దుల్కర్ సల్మాన్
మహానటి తర్వాత వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో దుల్కర్ సల్మాన్ చేస్తున్న సినిమా సీతారామం. బాలీవుడ్ తార మృణాల్ థాకూర్, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. సీతారామం చిత్రం ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ..

కశ్మీర్ షూటింగ్‌లో అలాంటి నమ్మకం
ప్రతీ సినిమా స్క్రిప్టు లెవెల్‌లో ఒక మ్యాజిక్‌లా కనిపిస్తుంది. సీతారామం విషయానికి వస్తే.. కశ్మీర్‌లో షూటింగ్ చేసే సమయంలో ఆసక్తి పెరిగింది. ఒక ఫ్యాక్టరీలో ఆర్మీ బ్యారెక్ సెటప్ వేశాం. రోజు రోజుకు సినిమా పరిధి, గ్రాండ్‌నెస్ పెరుగుతూ కనిపించింది. ఆర్టిస్టులు చాలా మంది వచ్చి షూట్‌లో చేరుతున్నారు. అలాంటి పరిస్థితులు, మేకింగ్ చూసిన తర్వాత సీతారామం బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది అని దుల్కర్ సల్మాన్ తెలిపారు.

సీతారామం విషయంలో అలాంటి బ్యాలెన్స్
మలయాళంలో రియలిస్టిక్ సినిమాలు తీస్తారు. కానీ అందులో కూడా నేను కమర్షియల్ వాల్యూస్ ఉండేలా చూసుకొంటాను. నేను నటించే మూవీస్ రియలిస్టిక్‌గా ఉండటంతోపాటు సినిమాటిక్ ఉండేలా చూసుకొంటాను. సీతారామం కూడా రియలిస్టిక్‌గా ఉండటమే కాకుండా కమర్షియల్ వ్యాల్యూస్ కూడా ఉంటాయి. మలయాళం కానీ, తెలుగులో కానీ నా సినిమాలను బాలెన్స్ చేసుకొంటాను. సీతారామం విషయంలో కూడా అదే జరిగింది అని దుల్కర్ సల్మాన్ చెప్పారు.

ముగ్గురు కుర్రాళ్లు వచ్చి అలాంటి కామెంట్
2001లో
నా
తొలి
సినిమాకు
ఫిల్మ్‌ఫేర్
అవార్డు
అందుకోవడానికి
హైదరాబాద్
వచ్చారు.
అప్పుడే
తెలుగు
ప్రేక్షకులు
నాపై
చూపిన
అభిమానం
ఆశ్చర్యం
కలిగించింది.
అప్పుడు
ముగ్గురు
కుర్రాళ్లు
వచ్చి
మీరు
నటించిన
ఉస్తాద్
హోటల్
సినిమా
చూశాం.
చాలా
బావుంది'
అని
చెప్పారు.
అది
నా
రెండో
సినిమా.
ఆ
చిత్రానికి
కనెక్ట్
అవ్వడం
చాలా
సర్‌ప్రైజ్
అనిపించింది.
అలాగే
నా
చిత్రాలు
వివిధ
ఓటీటీ
వేదికలపై
చూసి
సినిమాల
పట్ల
వున్న
ఒక
ప్యాషన్‌తో
చాల
మంది
కనెక్ట్
అవ్వడం
ఆనందమనిపించింది.

మహానటి సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేకపోయా
మహానటి సమయంలో నా కాళ్ళకి గాయం కావడంతో ఈవెంట్స్ కి రాలేకపోయాను. ఇప్పుడు సీతారామం ప్రమోషన్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. వైజాగ్, విజయవాడ ఈవెంట్స్ అభిమానుల చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు. ఆ రెస్పాన్స్ ని నేను ఊహించలేదు. నిజంగా నేను అదృష్టవంతుడ్ని అని దుల్కర్ సల్మాన్ అన్నారు.

పదేళ్లలో నేను 35 చిత్రాలు.. నాన్న ఏడాదికి 30 సినిమాలు
పదేళ్ళలో వివిధ భాషల్లో దాదాపు 35 చిత్రాలు చేశాను. అలాగే వివిధ వ్యాపారాలు కూడా చేస్తున్నాను. ఇతరులతో పోల్చుకొంటే నిజానికి నేను తక్కువే చేశాను. మలయాళంలో నా సమకాలికులు ఏడాదికి 12 సినిమాలు చేస్తున్నారు. మా నాన్న గారే ఏడాది 30కి పైగా సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్లతో పోల్చుకుంటే నేను తక్కువ చేసినట్లే అని దుల్కర్ సల్మాన్ అన్నారు.

నా సినిమా ఫ్లాప్ అయితే కారణం నేనే అంటూ
నా జీవితానికి మా నాన్న మమ్ముట్టి ఆదర్శం. స్పూర్తి. అతడి క్రమశిక్షణ నాకు చాలా ఇష్టం. తను తన కెరీర్‌ను ప్లాన్ చేసుకొనే విధానం అలాగే జనంతో మాట్లాడే తీరు చేసి గర్వపడుతాను. నా కథలో విషయంలో పెద్దగా జోక్యం చేసుకోడు. నేను ఏదైనా కథ వినాలంటే కనీసం రెండున్నర గంటలు పడుతుంది. ఒక్కోసారి నాలుగు భాషల్లో కథలు వినాల్సి వస్తుంది.
అలాంటి సమయంలో ఆయనకు గానీ, నాకు గానీ అంత సమయం ఉండదు. ఆయనకు కథను చాలా క్లుప్తంగా చెబుతాను. నా సినిమా హిట్ అయితే.. నాన్న (మమ్ముట్టి) క్రెడిట్ తీసుకొంటాడు. ఫెయిల్ అయితే నా ఛాయిస్ అని చెబుతాడు అని దుల్కర్ సల్మాన్ తెలిపారు.