twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మ, హిచ్ కాక్ స్పూర్తి.. ప్రపంచవ్యాప్తంగా హిట్ టాక్.. విజయోత్సాహంతో మెహర్ తేజ్

    |

    గత కొద్దికాలంగా సుహాస్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకొంటున్నారు. సినిమా సినిమాకు అంచనాలు పెంచుతూ వెళ్తున్న సుహాస్‌తో సైకో థ్రిల్లర్‌ చిత్రం ఫ్యామిలీ డ్రామాను దర్శకుడు మెహెర్ తేజ్ తెరకెక్కించారు. ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా ఓటీటీలో ప్రదర్శిస్తున్న సమయంలో దర్శకుడు మెహెర్ తేజ్ ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

    Director Mehar Tej

    సుహాస్ హీరోగా నటించిన కొత్త సినిమా "ఫ్యామిలీ డ్రామా". మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో తేజా కాసరపుతో కలిసి మెహెర్‌ తేజ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. తేజ కాసరపు, పూజా కిరణ్‌, అనూష నూతుల, శ్రుతి మెహర్‌, సంజయ్‌ రథా తదితరులు కీలక పాత్రలు పోషించారు. సోని లివ్ ఓటీటీలో అక్టోబర్ 29వ తేది నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. డార్క్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడం సంతోషంగా ఉందంటున్నారు హీరో సుహాస్, దర్శకుడు మెహెర్ తేజ్. "ఫ్యామిలీ డ్రామా"కు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో పాత్రికేయులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు.

    దర్శకుడు మెహెర్ తేజ్ మాట్లాడుతూ...రెండేళ్లుగా ఈ కథ మీద డిస్కషన్స్ చేస్తున్నాము. కలర్ ఫొటో సినిమా షూటింగ్ సుహాస్ ఉన్నప్పుడు వెళ్లి కథ చెప్పాను. సుహాస్ కంటే ముందు మరో నటుడిని ఈ క్యారెక్టర్ కు అనుకున్నా కుదరలేదు. క్యారెక్టరైజేషన్, కథ నచ్చి సుహాస్ ఈ సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. డార్క్ కామెడీ జానర్ లో మన దగ్గర సినిమాలు రావడం తక్కువ. అయితే ఈ జానర్ లో వరల్డ్ వైడ్ మూవీస్ బాగా ప్రేక్షకాదరణ పొందాయి. మన దగ్గర కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది అని మెహెర్ తేజ్ వెల్లడించారు.

    రామ్ గోపాల్ వర్మ, హిచ్ కాక్ లాంటి దర్శకులు నన్ను ఇన్ స్పైర్ చేశారు. వాళ్ల సినిమాల తరహా స్క్రీన్ ప్లే స్ఫూర్తితో ఫ్యామిలీ డ్రామా చిత్రాన్ని రూపొందించాను. సినిమా చేసేప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ ఆడియెన్స్ కు మాత్రమే నచ్చుతుందని అనుకున్నాం. కానీ ఇవాళ ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మా చిత్రాన్ని చూస్తుండటం, ఆదరిస్తుండటం సంతోషంగా ఉంది అని దర్శకుడు మెహెర్ తేజ్ పేర్కొన్నారు.

    సుహాస్ చక్కగా పర్మార్మ్ చేశాడు. సినిమా యూనిట్ అంతా రిహార్సల్ చేసింది. కోవిడ్ పరిస్థితుల్లో సమయం వృథా కాకుండా సింగిల్, డబుల్ టేక్‌లో సీన్లను పూర్తి చేశాం. ప్రతి సీన్ కూడా ముందు ప్రాక్టీస్ చేసి తెరకెక్కించిందే. సుహాస్ సహా మిగతా ఆర్టిస్టులు అంతా వర్క్ షాప్స్ చేశారు. ఉన్న క్యారెక్టర్ లలో చాలా మంది థియేటర్ ఆర్టిస్టులే. దాంతో పిక్చరైజేషన్ ఈజీగా, త్వరగా అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లాన్ చేసి పెట్టాం. దానికీ మంచి రెస్పాన్స్ వస్తోంది. నా కొత్త సినిమా డిస్కషన్స్ లో ఉంది. డీటెయిల్స్ త్వరలో చెబుతాను అని మెహెర్ తేజ్ అన్నారు.

    English summary
    Director Mehar Tej flying high after Family Drama success. He enjoying time with Family drama sucess. He spoke to Telugu filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X