twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Shekar హిట్టు కాకపోతే అప్పుల్లో కూరుకుపోతాం.. మా బతుకులను కాపాడండి.. రాజశేఖర్ ఎమోషనల్

    |

    గరుడవేగ, కల్కి సినిమాల విజయం తర్వాత హీరో రాజశేఖర్ నటించిన చిత్రం శేఖర్. ఈ సినిమా మలయాళ చిత్రం జోసెఫ్ ఆధారంగా రూపొందింది. మే 20వ తేదీన ఈ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాలోని ఎమోషనల్ అంశాలను, తన వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తూ.

    శేఖర్ సినిమా హిట్ కాకపోతే..

    శేఖర్ సినిమా హిట్ కాకపోతే..


    శేఖర్ మూవీ రిలీజ్‌కు ముందు చాలా టెన్షన్‌తో ఉన్నాను. గతంలో నా సినిమాలకు ముందు ఆస్తులు ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ సినిమా హిట్ అయితే తప్ప అప్పుల్లో నుంచి బయటకు రాలేం. లేదంటే అప్పుల పాలవుతాం. అందువల్ల చాలా టెన్షన్ ఎక్కువ. అందుకే మంచి కథ, కాన్సెప్ట్‌ను ఎంచుకొని శేఖర్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. కాబట్టి ఈ సినిమా టాక్ విని ప్రేక్షకులు థియేటర్లకు రావాలని కోరుతున్నాను. ఈ సినిమాను థియేటర్లలోనే చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అందు వల్లనే థియేటర్‌కు వచ్చి మా బతుకులను కాపాడమని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వేడుకొన్నాను అని రాజశేఖర్ అన్నారు.

     60 ఏళ్ల వ్యక్తి పాత్రలో

    60 ఏళ్ల వ్యక్తి పాత్రలో


    శేఖర్ సినిమా విషయానికి వస్తే.. ఆర్టిస్టుగా నేను చాలా సంతృప్తి చెందాను. ఆ క్యారెక్టర్‌లో ఉన్న ఎమోషన్స్, యాటిట్యూడ్‌ను చక్కగా చూపించాను. ఆ క్యారెక్టర్‌లో ఉండే బాధను పర్‌ఫెక్ట్‌గా చేశాను. నా పాత్రకు సంబంధించిన మేకోవర్ చాలా ఇంపార్టెంట్. కొత్త లుక్ ఉంటే బాగుంటుందని.. 60 ఏళ్ల వయసు వ్యక్తి ఎలా ఉంటాడో తెల్లటి గడ్డంతో కనిపించాలని అనుకొన్నాను. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నా గెటప్‌ గురించి చాలా మంది ప్రశంసించారు. ట్రైలర్ చూసిన తర్వాత వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో మంచి ధైర్యం వచ్చింది అని రాజశేఖర్ తెలిపారు.

    శేఖర్ సినిమాను సెన్సార్ అధికారులు చూసి

    శేఖర్ సినిమాను సెన్సార్ అధికారులు చూసి


    శేఖర్ సినిమాను చూసిన తర్వాత సెన్సార్ బోర్డు మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. సినిమా విజయంపై వారు కూడా విశ్వాసం ప్రకటించారు. అలాగే నా సన్నిహితుల్లో కొంత మందిని పిలిచి సినిమా చూపించాం. వారు కూడా భారమైన హృదయంతో బయటకు వచ్చారు. ఎమోషన్స్ బాగా పండాయని చెప్పారు. దాంతో మాకు మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది అని రాజశేఖర్ చెప్పారు.

    రీమేక్స్‌తో నాకు బ్లాక్‌బస్టర్ హిట్లు

    రీమేక్స్‌తో నాకు బ్లాక్‌బస్టర్ హిట్లు


    మలయాళం సక్సెస్‌ఫుల్ చిత్రం జోసెఫ్ రీమేక్‌గా శేఖర్ రూపొందింది. గతంలో నేను నటించిన తలంబ్రాలు, ఆహుతి, మగాడు, సింహరాశి, మా అన్నయ్య, మా ఆయన బంగారం సినిమాలు రీమేక్‌లే. నేను నటించిన చాలా చిత్రాలు రీమేక్‌గా చేయడం.. అవి పెద్ద విజయం సాధించడం తెలిసిందే. అందుకే మంచి కంటెంట్ ఉన్న జోసఫ్ సినిమాను అందుకే రీమేక్ చేశాం. రీమేక్‌ చేస్తే కొన్ని అడ్వాంటేజ్‌లు ఉంటాయి. కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.

    27 ఏళ్లుగా సాయికుమార్ డబ్బింగ్

    27 ఏళ్లుగా సాయికుమార్ డబ్బింగ్


    శేఖర్ సినిమాపై నటుడు సాయి కుమార్ గొప్పగా ప్రశంసించారు. ఆయనే ఫోన్ చేసి మనం హిట్టు కొడుతున్నామని చెప్పాడు. దాంతో ఈ సినిమాపై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. చాలా సంవత్సరాల తర్వాత నాకు సాయి కుమార్ డబ్బింగ్ చెప్పారు. 27 సంవత్సరాలుగా నాకు సాయి కుమార్ డబ్బింగ్ చెప్పడం తెలిసిందే. మళ్లీ ఈ సినిమాకు నాకు గొప్పగా డబ్బింగ్ చెప్పారు అని రాజశేఖర్ తెలిపారు.

    శేఖర్ సినిమాకు మ్యూజిక్ బలం

    శేఖర్ సినిమాకు మ్యూజిక్ బలం

    శేఖర్ సినిమాకు జోసెఫ్‌కు కొన్ని మార్పులు చేశాం. తెలుగు సినిమా విషయంలో కాస్త కథ, కథనంలో వేగం పెంచాం. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా సినిమాను మలిచాం. కథలోని ఆత్మ దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకొన్నాం. ఫాదర్, డాటర్ సెంటిమెంట్ బాగా పండింది. ఎమోషన్స్ కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. ప్రతీ ప్రేక్షకుడికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్ అందించిన మ్యూజిక్ బలం. పాటలు చాలా బాగా వచ్చాయి అని రాజశేఖర్ చెప్పారు.

    English summary
    Angry Man and Hero Rajashekar's Shekar movie is going to hit Theatres on May 20th. In this occassion, He speaks to Media in promotion of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X