twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమా కాపీ కొట్టి శివ తీశా.. 60 వేల స్క్రీన్లలో లడ్కీ రిలీజ్.. రాంగోపాల్ వర్మ (ఇంటర్వ్యూ)

    |

    వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం అమ్మాయి (హిందీలో లడ్కీ). ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. అమ్మాయి చిత్రంలో పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం జూలై 15వ తేదీన తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, చైనా భాషల్లో విడుదల అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆర్జీవి మీడియాతో మాట్లాడుతూ..

     పూజా భలేకర్‌తో తొలి మార్షల్ ఆర్ట్స్ మూవీ

    పూజా భలేకర్‌తో తొలి మార్షల్ ఆర్ట్స్ మూవీ


    ఇండియాలో తొలి మార్షల్ ఆర్ట్స్ చిత్రం అమ్మాయి. హిందీలో లడ్కీ పేరుతో రిలీజ్ చేస్తున్నాం. వాస్తవానికి మార్షల్ ఆర్ట్స్ అనేది ఫైట్స్. తెలుగు సినిమా పరిశ్రమలో మార్షల్ ఆర్ట్స్ పేరుతో వైర్స్, వీఎఫ్‌ఎక్స్, డూప్స్, ఎడిటింగ్‌లో అంశాలతో ఫైట్స్‌ను మానిప్యులేట్ చేస్తారు. అమ్మాయి సినిమా విషయానికి వస్తే నేను అలాంటివీ ఏమీ చేయలేదు. నిజంగా ఆ అమ్మాయి (పూజా భలేకర్) ఏం చేయగలదో అది చేయించాను. బ్రూస్‌లీ కూడా అంతే.. తాను ఏం చేయగలడో అదే ఫైట్. ఈ చిత్రంలో ఫైట్స్ సినిమాటిక్‌గా ఉండవు. అందుకే నేను ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ సినిమా అని అన్నాను. మనవాళ్లు చేసేది స్టంట్స్. మనుషుల్ని మామూలుగా కొట్టడానికి ట్రైనింగ్ తీసుకుని కొట్టడానికి తేడా అదే అని రాంగోపాల్ వర్మ అన్నారు.

     12 ఏళ్ల నుంచి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్

    12 ఏళ్ల నుంచి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్


    శివ సమయంలో చేసిన ఫైట్స్‌కు రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. అక్కడ ఫైట్స్‌లో నాగార్జున ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, సౌండ్ ఎఫెక్ట్స్‌ను బట్టి నిజంగా కొట్టిన ఫీలింగ్ వచ్చేది. కానీ అమ్మాయి చిత్రంలో మాత్రం రిస్క్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడి దూకి, గాల్లోకి ఎగిరి తన్నడం వంటి యాక్షన్స్ ఉంటాయి. ఇక పెద్ద హీరోలు, నిర్మాతలు ఇలాంటి రిస్క్‌లు తీసుకోలేరు. పూజా భలేకర్ ఎన్నో ఏళ్ల నుంచి ట్రైనింగ్ తీసుకుంటోంది. 12 ఏళ్ల నుంచి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నది. అందుకే ఆమెకు తన బాడీ మీద కంట్రోల్ ఉంది అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

    ఓ వింత ప్రేమ కథ ఉంటుంది

    ఓ వింత ప్రేమ కథ ఉంటుంది


    అమ్మాయి చిత్రంలో కేవలం మార్షల్ ఆర్ట్స్ మాత్రమే కాకుండా ఓ వింత ప్రేమ కథ ఉంటుంది. ఈ అమ్మాయికి బ్రూస్‌లీ అంటే మహా ఇష్టం. ఆ అమ్మాయి అంటే మరో మరో వ్యక్తికి పిచ్చి. బ్రూస్‌లీ మీదున్న పిచ్చితో ఈ అమ్మాయికి డేంజర్ పరిస్థితి ఉందని తెలిసి.. ఆ బ్రూస్‌లీ మాయలోంచి బయటకు తీసుకొస్తాడు. రంగీలా మూవీలో ప్రేమ కథ అనుకోవచ్చు. రంగీలాలో జాకీ ష్రాఫ్ రోల్ బ్రూస్ లీ అయితే.. ఆమీర్, ఊర్మిళా మిగతా ఇద్దరూ అనుకోవచ్చు అని రాంగోపాల్ వర్మ చెప్పారు.

    హై స్పీడ్ కెమెరాలతో షూట్

    హై స్పీడ్ కెమెరాలతో షూట్

    పూజా భలేకర్ స్వతహాగా ఫైటర్. ఆమెలో ఓ వేగం, కిక్‌లో ఫాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆమె స్పీడ్‌ను క్యాప్చర్ చేయడానికి ఎక్స్‌ట్రీమ్ హై స్పీడ్ కెమెరాలను వాడాం. దాదాపు థౌజండ్ ఫ్రేమ్స్ పర్ సెకన్ కెమెరాను వాడాం. ఈ సినిమాలోని ఫైట్స్‌ను కెమెరాలో బంధించడానికి సాధారణ కెమెరాతో సాధ్య పడదు. హై స్పీడ్ కెమెరాలతో అదీ సాధ్యమైంది అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

    పూణేలో పూజా భలేకర్‌ను పట్టుకొన్నాం

    పూణేలో పూజా భలేకర్‌ను పట్టుకొన్నాం


    పూర్తి మార్షల్ ఆర్ట్స్ సినిమాను తీయాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. అయితే దాని కోసం ఎంతో మంది ట్రైనర్లను వెతికాను. బ్రూస్‌లీలా ఎవ్వరూ అనిపించలేదు. ఇక అలాంటి వారు దొరకరు అని వదిలేశాను. పుణెలో పూజా భలెకర్ అని ఓ అమ్మాయి ఉంది.. అని తెలిసింది. తైక్వాండో, మార్షల్ ఆర్ట్స్‌లో మెడల్స్ సాధించిందని తెలిసింది. ఆమె తన తండ్రితో వచ్చి ఆడిషన్స్ ఇచ్చింది.అప్పుడు ఈ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ రషెస్ చైనాలోని డిస్ట్రిబ్యూటర్ చూసి ఈ సినిమాను ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. నలభై వేల స్క్రీన్స్ అని కాదు..ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఈ సినిమా రిలీజ్ నాటికి 60 వేల థియేటర్లలో రిలీజ్ కావొచ్చు అని రాంగోపాల్ వర్మ అన్నారు.

     శివ ఆ సినిమా చూసి కాపీ కొట్టా

    శివ ఆ సినిమా చూసి కాపీ కొట్టా


    శివ సినిమాను రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నుంచి కాపీ కొట్టాను. అందులో రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టి శివ తీశాను. సేమ్ స్క్రీన్ ప్లే. శివ సినిమా స్క్రిప్ట్ ఇరవై నిమిషాల్లో రాశాను అని చెప్పాను. శివ కూడా మార్షల్ ఆర్ట్స్ సినిమానే. కాకపోతే ఫైట్స్ ఆ రేంజ్‌లో ఉండవు. కానీ ఫైట్స్‌లో ఇంటెన్స్ ఉంటుంది అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

    English summary
    Director Ram Gopal Varma's latest movie is Ladki. Its been releasing in Telugu, Tamil, Malyalam, Kannada, Hindi, China languages. Here is the exclusive interview form RGV.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X