Just In
- 11 min ago
Naandhi 11 Days Collections: క్లిష్ట సమయంలోనూ సత్తా చాటిన ‘నాంది’.. లాభాల్లోనూ నరేష్ మూవీ రికార్డు
- 16 min ago
ఆన్లైన్లో నితిన్ దర్శకుడికి టోకరా.. గుడ్డిగా నమ్మి డబ్బులు పంపిన దర్శకుడు.. చివరికి..
- 36 min ago
Uppena 18 Days Collections: దారుణంగా పడిపోయిన ‘ఉప్పెన’ కలెక్షన్లు.. అయినా వైష్ణవ్ తేజ్‌దే హవా!
- 1 hr ago
ఆ సినిమాలోలా రెచ్చిపోయిన జబర్ధస్త్ కమెడియన్: అసలైన రొమాన్స్ చూపిస్తా అంటూ ఆమెను నలిపేశాడు!
Don't Miss!
- Sports
ఐపీఎల్ 2021 వేదికలపై సన్‌రైజర్స్ అసంతృప్తి.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలంటూ!!
- Automobiles
తండ్రి పుట్టిన రోజు కానుకగా తనయుడు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్!
- News
యువతికి లైంగిక వేధింపులు-తండ్రి ఫిర్యాదు చేశాడని హత్య: వీడియో చూస్తే...!
- Finance
భారీగా తగ్గిన బంగారం ధరలు, రూ.45,000కి దిగొచ్చిన పసిడి: వెండి కూడా డౌన్
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి వ్యాపారులు ఈరోజు ఆర్థిక నష్టాన్ని భరించాలి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాజమౌళి ప్రశంసను మరిచిపోలేను.. బాహుబలి సమయంలో గట్టిగా కౌగిలించుకొని భేష్ అంటూ.. కల్యాణీ మాలిక్
టాలీవుడ్‌లో సంగీత దర్శకుడు కల్యాణీ మాలిక్ చేసిన సినిమాలు సంఖ్యలో తక్కువే అయినప్పటికీ.. ఆయన ఫీల్‌గుడ్ పాటలకు పెట్టింది పేరు. ఐతే... ఆంధ్రుడు, అష్టా చమ్మా, అలా మొదలైంది, ఊహలు గుసగుసలాడే తర్వాత కల్యాణీ మాలిక్ చేస్తున్న చిత్రం చెక్. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన చెక్ చిత్రం ఫిబ్రవరి 26 తేదీన విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో కల్యాణీ మాలిక్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

చెక్ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ...
చెక్ సినిమా ఓ డిఫరెంట్ సినిమా. స్క్రిన్ ప్లే ఆధారంగా సాగే కథ. ఈ చిత్రంలో ఎక్కువ పాటలు పెట్టడం వల్ల కథలో ఉండే డెప్త్, ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఈ సినిమాకు సందర్భోచితంగా వచ్చే ఒక పాట చాలూ. పాటలు పెట్టకూదనే విషయంలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి నిర్ణయం సరైందే అని సంగీత దర్శకుడు కల్యాణీ మాలిక్ తెలిపారు

బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులు థ్రిల్‌గా
చెక్ సినిమాకు సంబంధించిన రీరికార్డింగ్ వరకు నాకు మంచి పేరు వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణంగా మారుతుంది. ఈ సినిమా నా కెరీర్‌కు మంచి ఎసెట్ అవుతుంది. తెర మీద చెక్ సినిమా చూసినప్పుడు ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీల్ అవుతారు. సినిమా విషయంలో నేను ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నానో.. నితిన్‌తోపాటు అందరూ పూర్తి విశ్వాసంతో ఉన్నారు అని కల్యాణీ మాలిక్ పేర్కొన్నారు.

బాహుబలి సౌండ్ మిక్సింగ్ గురించి
ఇక బాహుబలి సినిమాకు సౌండ్ మిక్సింగ్ చేయడం నాకు గొప్ప అనుభవంగా మిగిలింది. అది గ్రేట్ ఎక్సీపిరియెన్స్. మెమొరీబుల్ సంఘటన. బాహుబలి సినిమా సౌండ్ మిక్సింగ్ ముంబైలోను, హైదరాబాద్‌లో చేశాం. తొలిసారి అట్మాస్‌లో చేయడం జరిగింది. అయితే బాహుబలి సౌండ్ మిక్సింగ్ విషయంలో రాజమౌళి చాలా టెన్షన్‌గా ఉన్నాడు. సౌండ్ మిక్సింగ్ ఎలా వస్తుంది? తెర మీద సన్నివేశాలు ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయనే విషయంపై పట్టుదలగా ఉన్నాడు అని కల్యాణీ మాలిక్ వెల్లడించారు.

బాహుబలి చిత్రంలో దేవరా పాటకు
సౌండ్ మిక్సింగ్ పూర్తయిన తర్వాత ముంబైలొని పీవీఆర్ థియేటర్‌లో ధీవర పాటను వేసుకొని అవుట్ పుట్ ఎలా వచ్చిందనే విషయాన్ని చూసుకొన్నాం. నేను, కీరవాణి, రాజమౌళి మాత్రమే ఉన్నాం. ఆ సమయంలో నాకు ఒక రకమైన టెన్షన్ ఉంది. పాటను చూసిన తర్వాత రాజమౌళి లేచి బయటకు వెళ్లిపోయారు. అప్పుడు నా మనసులో టెన్షన్ మరింత పెరిగింది అని కల్యాణీ మాలిక్ తెలిపారు.

రెండేళ్ల టెన్షన్ తీర్చావు అంటూ రాజమౌళి
అయితే రాజమౌళి సౌండ్ మిక్సింగ్ గురించి ఏమంటారో అనే భయం మనసులో ఉంది. సాధారణంగా ఏదైనా నచ్చితే బావుంది అంటారు. అలా అంటే చాలా గొప్పగా ఉందని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో నేను బయటకు వెళ్లగానే రాజమౌళి వచ్చి గట్టిగా కౌగిలించుకొన్నారు. రెండేళ్లు పడ్డ టెన్షన్ నీవు ఇచ్చిన అవుట్‌పుట్‌తో తీరిపోయిందన్నారు. రాజమౌళి ఇచ్చిన కాంపిమెంట్ నా లైఫ్‌లో మరిచిపోలేనిది అని కల్యాణీ మాలిక్ తెలిపారు.