Don't Miss!
- News
ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్.. హరీష్‌రావు ఆరోగ్యశాఖ ప్రగతి నివేదికపై వైఎస్ షర్మిల సెటైర్లు!!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Finance
Gold price today: పసిడి ప్రియులకు అలెర్ట్.. తాజాగా బంగారం రేట్లు ఇలా.. కొనాలనుకుంటున్నారా?
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
పుష్ప 2లో కృతిశెట్టి.. సుకుమార్ సినిమాలో నటించాలని.. సీక్రెట్ చెప్పిన బేబమ్మ
సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ నేతృత్వంలో ఆయన శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమా ద్వారా కృతిశెట్టి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉప్పెన సినిమా తర్వాత కృతి బిజీ హీరోయిన్‌గా మారిపోయారు. అయితే త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప 2 చిత్రంలో కృతిశెట్టి నటిస్తున్నారనే విషయం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో శ్యామ్ సింగరాయ్ సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కృతిశెట్టి వివరణ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..

డబ్బింగ్ చెప్పాలని ఉందంటూ..
శ్యామ్ సింగరాయ్ సినిమాకు నేను డబ్బింగ్ చెప్పలేదు. డబ్బింగ్ నాకు చెప్పాలని ఉంది. కానీ ఈ పాత్రకు కొంచెం బేస్ వాయిస్ కావాలని అన్నారు. అందుకే ఉప్పెన సినిమాలో నా పాత్రకు చెప్పిన అమ్మాయి, ఆర్జేనే డబ్బింగ్ చెప్పింది. నా వాయిస్‌కు ఆమె వాయిస్ సూట్ అవుతుంది. ఆమె నాకు డబ్బింగ్ చెప్పడంలో ఎప్పుడు తగ్గదు. అందుకే ఆమెతోనే డబ్బింగ్ చెప్పించాం. ఇక ముందు కూడా నాకు ఆ అమ్మాయే డబ్బింగ్ చెబుతుంది అని కృతిశెట్టి తెలిపారు.

నాని ఎప్పుడూ నేచురల్ స్టార్
నాని ఎప్పుడూ నేచురల్ స్టార్ అంటారు. అయితే ఆయన ఎప్పుడూ పాత్రలో ఒదిగిపోతారు. నాకు వాసు పాత్ర బాగా నచ్చింది. ఆయన ట్రెండిగా సినిమాలో కనిపించారు. అలాగే శ్యామ్ సింగరాయ్‌గా కూడా నాకు బాగా నచ్చాడు. ఆ పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపించారు. బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది. ఆయన పాత్ర చాలా సహజంగా ఉంటుంది. నాకు నాని నటించిన నిన్ను కోరి, ఎంసీఏ సినిమాలు అంటే ఇష్టం అని కృతి చెప్పారు.

యాక్షన్ సినిమాలో నటించాలని ఉంది
నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. నేను కూచిపూడి నేర్చుకొంటున్నాను. శ్యామ్ సింగరాయ్‌లో సాయిపల్లవి చేసిన డ్యాన్స్ చాలా నచ్చింది. నేను సెట్‌కు వెళ్లాను కానీ.. సాయిపల్లవి డ్యాన్స్ చేసేటప్పుడు నేను చూడలేదు. నా డ్యాన్స్ కాకుండా యాక్షన్ సినిమా చేయాలని ఉంది. కానీ నేను ఫిజిక్‌పరంగా చాలా వీక్. ఇంకా స్ట్రాంగ్ కావాలి. అందుకే ఫిట్‌నెస్‌పై దృష్టిపెడుతున్నాను. ఉప్పెన సినిమా రిలీజ్ కాకముందే నన్ను నమ్మి.. డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తారనే కాన్ఫిడెన్స్‌తో డైరెక్టర్లు రావడం గర్వంగా ఉంది అని కృతి శెట్టి అన్నారు.

పుష్ప 2లో రోల్ గురించి
పుష్ప 2 చిత్రంలో స్పెషల్ క్యారెక్టర్ చేస్తారనే వార్తలు నా వద్దకు వచ్చాయి. కానీ సుకుమార్ గానీ, యూనిట్ కానీ నన్ను సంప్రదించలేదు. నాకు సుకుమార్ గారి సినిమాలో నటించాలని ఉంది. ఉప్పెన సినిమాను ఆయనే నిర్మించారు. ఆయన సినిమాలు ఎలా ఉంటాయి. ఆయన ఎలా తీస్తారు అనే విషయం నాకు బాగా తెలుసు. పుష్ప 2 లో అవకాశం ఇస్తే నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని కృతి శెట్టి చెప్పారు.

కృతిశెట్టి సినీ కెరీర్ ఇలా
శ్యామ్ సింగరాయ్ తర్వాత నేను నటించిన చిత్రం బంగర్రాజు. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మీ ముందుకు వస్తాను. మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. అలాగే ఆ అమ్మాయి సినిమా షూటింగ్ దశలో ఉంది. హీరో రామ్‌తో సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉంది. మాచర్ల నియోజకవర్గం సినిమా ఏప్రిల్ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి అని కృతి శెట్టి వెల్లడించారు.