For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jetty గుండెను పిండేసే కథ.. క్లైమాక్స్ హృదయాన్ని భారంగా.. హీరో కృష్ణ మాన్యం (ఇంటర్వ్యూ)

  |

  వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మాతగా, సుబ్రమణ్యం పిచుక దర్శకత్వంలో రూపొందిన చిత్రం జెట్టి. మాన్యం కృష్ణ, నందితా శ్వేత జంటగా, శివాజీ రాజా, కన్నడ కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో హీరో కృష్ణ మాన్యం తెలుగు ఫిల్మీ‌బీట్‌తో మాట్లాడుతూ..

  నా స్వస్థలం.. నా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే?

  నా స్వస్థలం.. నా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే?


  నా పేరు కృష్ణ. నా స్వస్థలం చిత్తూరు జిల్లా.. చిన్నతనంలోనే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్‌తో డిగ్రీ మానేసి.. హైదరాబాద్ వచ్చాను. దూరదర్శన్‌ కోసం ఒక ఎపిసోడ్... ఈటీవీ కోసం తూర్పు వెళ్లే రైలు సీరియల్‌లో మూడు ఎపిసోడ్స్‌లో నటించాను. అయితే ఇంటి నుంచి తెచ్చుకొన్న డబ్బులు అయిపోవడంతో ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో శిల్పకళా వేదికలో ఓ ఫంక్షన్ కోసం వెళ్లి.. కోట శ్రీనివాసరావుతో ఫోటో దిగడానికి ప్రయత్నించాను. అయితే ఫిలింగనర్‌లో నువ్వు మా ఇంటికి రా అని చెప్పాడు. దాంతో నేను ఫిలింనగర్‌లోని కోటా ఇంటికి వెళితే.. ముందు డిగ్రీ చదువుకో. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ప్రయత్నించమని సలహా ఇచ్చారు అని కృష్ణ మాన్యం తెలిపారు.

  గల్లా జయదేవ్ ఫ్యామిలీతో మీకు ఎలాంటి రిలేషన్ ఉంది?

  గల్లా జయదేవ్ ఫ్యామిలీతో మీకు ఎలాంటి రిలేషన్ ఉంది?

  డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఐటీ జాబ్స్ చేశాను. కానీ నా మససంతా సినిమాపైనే ఉంది. ఇదిలా ఉంటే.. నాకు గల్లా జయదేవ్ కుటుంబంతో మాకు దగ్గరి సంబంధం ఉంది. అదే సమయంలో నా బావ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నిస్తూ.. చెన్నైలో పాండ్యన్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకొన్నాడు. నేను కూడా గల్లా అశోక్‌తో కలిసి ట్రైనింగ్ తీసుకొన్నాను. అది నా కెరీర్‌కు ఇప్పుడు బాగా ఉపయోగపడుతున్నది అని కృష్ణ చెప్పారు.

  మహేష్ బాబు మూవీలో అవకాశం కోసం ప్రయత్నించారా?

  మహేష్ బాబు మూవీలో అవకాశం కోసం ప్రయత్నించారా?


  చెన్నైలో శిక్షణ పూర్తయిన తర్వాత ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తూ.. ఆర్గన్ డొనేషన్, ఇతర సోషల్ వర్క్‌ చేసేవాడిని. నా సోషల్ వర్క్ చూసి మా బావ గల్లా జయదేవ్ ఇంప్రెస్ అయి మహేష్ బాబు సినిమాలో ఆఫర్ ఇస్తాడేమో అని అనుకొనే వాడిని. అలాంటి పరిస్థితుల్లో హీరో కోసం వెతుకొన్న ఓ నిర్మాత.. నన్ను చూసి ఓ లవ్ స్టోరి సినిమాలో ఆఫర్ ఇచ్చారు. అయితే చిన్న సినిమాకు ఉండే కష్టాల మాదిరిగానే.. నా తొలి సినిమా రిలీజ్ ఆగిపోయింది అని కృష్ణ మాన్యం చెప్పారు.

  జెట్టీ కథ ఏమిటి? జెట్టీ అంటే ఏమిటి?

  జెట్టీ కథ ఏమిటి? జెట్టీ అంటే ఏమిటి?


  నా తొలి సినిమా రిలీజ్ ఆలస్యమైన సమయంలో.. నేను టెన్సన్‌లో పడిపోయాను. అలాంటి సమయంలో జెట్టీ మూవీలో ఆఫర్ ఇచ్చారు. సినిమా షూటింగ్‌కు ముందు కరోనా వైరస్ కారణంగా సినిమా పరిశ్రమ స్థంభించింది. ఆ తర్వాత 2020 నవంబర్‌లో ఒకే షెడ్యూల్‌లోనే జెట్టి సినిమా పూర్తి చేశాం. జెట్టి అంటే.. ఫిషింగ్ హార్బర్.. కోస్తాంధ్రకు జెట్టిలు ఎందుకు అవసరం? సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెనను జెట్టి. ఈ జెట్టి అవసరం ఏమిటనే కోణంలో కథ సాగుతుంది. మేము కఠారిపాలెం ప్రాంతంలో ఉన్న జెట్టి ఏరియాలో సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంగా సాగుతుంటాయి. ఆ ప్రాంతంలోనే ఓ మోతుబరి ఎలా కంట్రోల్ చేస్తుంటాడు. అతడిపై మత్య్సకారులు ఎందుకు ఎదురు తిరిగారు అనే విషయంతో కథ సాగుతుంది.

  గుండెను పిండేసే క్లైమాక్స్‌తో

  గుండెను పిండేసే క్లైమాక్స్‌తో


  జెట్టీ సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజ్ అవుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. జెట్టి సినిమా భావోద్వేగం, మత్స్యకారుల జీవితం లాంటి అంశాలతోపాటు తండ్రి, కూతుళ్ల మధ్య ఓ ఎమోషనల్ బాండింగ్‌తో కథ సాగుతుంది. ఆ ప్రాంతానికి జెట్టి తీసుకు రావడానికి ఓ తండ్రి ఏం చేశారు అనేది ఈ సినిమాకు ఆత్మ లాంటిది. జెట్టి సినిమా గుండెను బరువెక్కించే సినిమా. క్లైమాక్స్‌లో ఓ పాయింట్‌ హృదయాన్ని పిండివేస్తుంది. పాటలు, యాక్షన్ సీన్లు బాగుంటాయి అని కృష్ణ మాన్యం చెప్పారు. దూరం కరిగిన పాటకు 19 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కార్తీక్ కొడగండ్ల మంచి మ్యూజిక్ ఇచ్చారు. శ్రీమణి, చంద్రబోస్, కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యాన్ని అందించారు. జెట్టి నిర్మాత వేణుమాధవ్ ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తెరకెక్కించారు.

  ట్రైలర్ చూసి గోపిచంద్ మలినేని ఏమన్నారు?

  ట్రైలర్ చూసి గోపిచంద్ మలినేని ఏమన్నారు?

  జెట్టీ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయించడానికి ఇటీవల గోపిచంద్ మలినేనిని కలిశాను. మా ట్రైలర్ చూసిన తర్వాత.. క్రాక్ సినిమాలో ఇలాంటి సీన్లు చేయాలని అనుకొన్నాను. కానీ లైటింగ్, సమయం లేకపోవడం వల్ల మీరు తీసిన సీన్లను తీయలేకపోయాం.. జెట్టీ సినిమాలో సీన్లు చాలా అద్బుతంగా ఉన్నాయి అని ప్రశంసించారు. దాంతో జెట్టి సినిమాపై మాకు మంచి నమ్మకం కలిగింది అని కృష్ణ చెప్పారు.

  తమిళ సినిమాలో నటిస్తున్నారా?

  ప్రస్తుతం జెట్టి సినిమాతోపాటు నా మొదటి సినిమా రిలీజ్‌కు రెడీగా ఉన్నది. ప్రస్తుతం జెట్టి సినిమాటోగ్రాఫర్ సలహా మేరకు నాకు తమిళంలో ఓ మంచి సినిమా ఆఫర్ వచ్చింది. నేను హీరోగానే కాకుండా ఎలాంటి పాత్రలనైనా చేయడానికి నేను సిద్దం. మంచి నటుడిగా నేను గుర్తింపు పొందే పాత్రలను చేయడానికి రెడీగా ఉన్నాను. యాక్టింగ్ విషయంలో రానా, నవీన్ చంద్ర నాకు ఇన్సిపిరేషన్. నేను సొంతంగా 100 పైపర్స్ అనే సినిమా కథను రాసుకొన్నాను. నేటి సమాజంలో ప్రేమలు, బ్రేకప్స్ లాంటి అంశాలతో కథ ఉంటుంది. తమిళ సినిమా తర్వాత నేను నా కథను సెట్స్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను అని కృష్ణ మన్యాల తెలిపారు.

  English summary
  Debutant Hero Maanyam Krishna is coming with Jetty movie. This movie si based on Fishermen lifes. This movie is set to release on November 4th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X