Don't Miss!
- News
మరో పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేయనున్న కేసీఆర్: వరంగల్‌లో హరీశ్ రావు
- Lifestyle
సంబంధంలో ఉంటూ మిమ్మల్ని మీరు కోల్పోకుండా ఉండటం ఎలాగో తెలుసా?
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
ఫ్లాప్ సినిమా.. ఫెయిల్యూర్ డైరెక్టర్‌తో రిస్క్ చేశా.. సన్నాఫ్ ఇండియా గురించి మోహన్ బాబు కామెంట్స్
విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో నాలుగు దశాబ్దాలకుపైగా దక్షిణాది సినిమా పరిశ్రమలో తనకంటూ గొప్ప గుర్తింపును తెచ్చుకొన్న నటుడు మోహన్ బాబు. వివిధ కారణాల వల్ల సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా సన్నాఫ్ ఇండియా చిత్రాన్ని సొంత బ్యానర్‌పై డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సందర్భంగా మీడియాతో మోహన్ బాబు మాట్లాడుతూ..

సినిమా నా ఊపిరి
సినిమా ఊపిరి అని నా గురువు దాసరి నారాయణ అన్నారు. అలాగే నా కుటుంబానికి కూడా సినిమా ఊపిరే. ఇక్కడ ఏమీ లేకుండా పొట్ట చేతితో పట్టుకొని వచ్చాం. నటుడిగా, నిర్మాతగా బాగా సంపాదించాం. విద్యారంగంలో పేద విద్యార్థులకు సహకారం అందిస్తున్నాం. ఆ కాలేజిని ప్రస్తుతం యూనివర్సిటీగా మార్చింది. ఇక సినిమా విషయానికి వస్తే.. సినిమా ఎప్పుడూ రిస్కే. 1982 సంవత్సరంలో లక్ష్మీ ప్రసన్న బ్యానర్‌ను అన్నగారు ఎన్టీ రామరావు చేతుల మీదుగా ఆవిష్కృతమైంది అని మోహన్ బాబు చెప్పారు.

ఫ్లాప్ సినిమా కథతో రిస్క్ చేశా
లక్ష్మీ ప్రసన్న బ్యానర్‌తో నిర్మాతగా మారాలని అనుకొన్నాను. సుందర్ అనే రచయిత వచ్చి 50 కథలు చెప్పారు. అయితే ఒక్క కథ కూడా నచ్చలేదు. చివరకు ఓ కథ చెప్పాడు. ఆ కథ నాకు బాగా నచ్చడంతో సినిమా చేద్దామని అన్నాను. మీకు నచ్చిందా అని అడిగితే.. నచ్చింది అని చెబితే.. మరోసారి ఆలోచించమని చెప్పాడు. అందుకు నేను అదే సినిమాను తీస్తానని చెప్పాను. అప్పుడు అనబలం, జనబలం అనే సినిమా. కన్నడలో రాజ్‌కుమార్ చేశారు. నేనే కథ ఇచ్చాను. కానీ సినిమా ఫ్లాప్ అని చెప్పాడు. అయినా నేను రిస్క్ తీసుకోవాలని అనుకొన్నాను. డైరెక్టర్‌గా ఎవరిని తీసుకోవాలని ఆలోచిస్తే.. ఇండస్ట్రీకి హిట్ ఇచ్చిన వ్యక్తి.. ఫ్లాప్‌లతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అతడిని పిలిచి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చాను. రిస్క్ చేశాను కాబట్టే నేను నిలబడ్డాను అని మోహన్ బాబు అన్నారు.

రత్నబాబు కథ చెప్పిన వెంటనే
ఒక రోజు దర్శకుడు డైమండ్ రత్నబాబు వచ్చి కథ చెప్పాడు. వెంటనే సినిమా చేద్దామని అన్నాను. విష్ణుకు ఫోన్ చేస్తే.. తను కూడా సానుకూలంగా స్పందించాడు. వెంటనే ఓ పోస్టర్ డిజైన్ చేసి పంపించాడు. కానీ సినిమా చేయడం కొంత రిస్క్ ఉందని అన్నాడు. రిస్క్‌ను పక్కన పెట్టు.. మంచి సినిమా చేద్దాం అని సన్నాఫ్ ఇండియా ప్రారంభించాం. మొదట ఓటీటీకి రిలీజ్ చేద్దామని అనుకొన్నాం. కానీ చివరకు థియేట్రికల్ రిలీజ్‌కు సిద్దమయ్యాం అని మోహన్ బాబు చెప్పారు.

ఇళయ రాజా మ్యూజిక్ అద్భుతం
సన్నాఫ్ ఇండియా చిత్రానికి గొప్ప సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజిక్ ఇచ్చాడు. 18 శతాబ్దానికి చెందిన గద్యాన్ని పాటగా మలిచాడు. ఆ పాటను నలుగురు సింగర్లతో పాడించాం. కానీ ఇళయరాజాకు, నాకు నచ్చలేదు. చివరకు మలయాళ సింగర్ రాహుబల్ నంబియార్ అద్భుతంగా పాడాడు. సంస్కృత భాషను స్పష్టంగా పలికే వాళ్లలో మలయాళీలు అద్భుతంగా పలుకుతారు. ఆ పాటను మీరు స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తారు అని మోహన్ బాబు తెలిపారు.

సమాజంలోని అవినీతిపై
నటన పరంగా చూస్తే.. నాది ప్రత్యేకమైన శైలి. సమాజంలోని అవినీతిని వెలికి తీయాలని అనుకొంటున్నాను. సన్నాఫ్ ఇండియా చిత్రంలో ఒకడిని అరెస్ట్ చేస్తారు. వాడు వెంకటేశ్వరస్వామి పచ్చల హారం ఇస్తానని ఆశపెడుతారు. కానీ నీవు ఇచ్చేది నకిలీ నగలు.. నీకు రెండు సార్లు కరోనా వచ్చినా నీకు బుద్ది రాలేదు అని గట్టిగా గడ్డిపెడుతాను. నా సినిమాల జోనర్ అలానే ఉంటాయి.

చేయని నేరానికి శిక్ష
సన్నాఫ్ ఇండియా సినిమా ద్వారా.. ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతున్న తీరుతెన్నుల గురించి చెప్పాలనుకొంటాను. రాజకీయాల్లో బలి అయిన వ్యక్తి.. జైలులో అన్యాయంగా శిక్షను అనుభవిస్తున్నాడు. వాడి ఫ్యామిలీ ఎలా బాధపడ్డారని చూపించాం. అతడికి న్యాయం ఎలా జరుగాలని అడిగితే.. ప్రైవేట్ జైలు కావాలని అంటాడు. ప్రస్తుతం చేయని నేరానికి శిక్ష అనుభవించేవాళ్లు ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరిని కథ చెప్పబోతున్నాం. న్యాయ దేవతకు కట్టిన కళ్లగంత విప్పితే.. తెలుస్తుంది.. పాలు వస్తున్నాయా? నీళ్లు వస్తున్నాయా? అనేది తెలుస్తుందనే విషయాన్ని ప్రస్తావించాం అని మోహన్ బాబు అన్నారు.