నా కెరీర్‌లో చెక్ మూవీ బ్లాక్‌బస్టర్... నితిన్ నెక్ట్స్ లెవెల్ పెర్ఫార్మెన్స్.. కల్యాణీ మాలిక్

యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. అనంద ప్రసాద్‌ నిర్మించిన సినిమా చెక్‌. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లు. కల్యాణీ మాలిక్‌ సంగీతం అందించారు. ఐతే... తర్వాత చంద్రశేఖర్‌ యేలేటి, కల్యాణీ మాలిక్‌ కాంబినేషన్‌ మళ్లీ చెక్‌కి కుదిరింది. సినిమాలోని ఏకైక పాట నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను ప్రోమో ప్రేమికుల రోజున విడుదలైంది. బుధవారం పూర్తి పాట విడుదల కానుంది. అలాగే, ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కల్యాణీ మాలిక్‌ ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

 17 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి

17 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి

2003లో ఐతే సినిమాతో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి, నేను కెరీర్ ప్రారంభించాం. ఆ తర్వాత మేమిద్దరం కలిసి పనిచేయడానికి ఏవో కారణాల వల్ల కుదర్లేదు. మళ్లీ 17 ఏళ్ల తర్వాత చెక్‌ సినిమాతో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం కుదిరింది. ప్రతీ సినిమా తొలి సినిమా మాదిరిగానే పనిచేస్తాం. అదే భయం, అదే భక్తి ఉంటాయి. నా పని పట్ల అలాంటి గౌరవం ఉంది అని కల్యాణి మాలిక్ అన్నారు.

కెరీర్‌లో హిట్లు, డిజాస్టర్లు

కెరీర్‌లో హిట్లు, డిజాస్టర్లు

నా కెరీర్‌లో ఐతే, ఆంధ్రుడు, అష్టాచెమ్మా, అలా మొదలైంది, ఊహలు గుస గుసలాడే లాంటి సూపర్ హిట్లు ఉన్నాయి. అలాగే కొన్ని డిజాస్టర్లు కూడా ఉన్నాయి. అయితే నా కెరీర్‌లో గ్యాప్ రావడానికి పెద్దగా కారణాలు లేవు. అయితే చెక్ సినిమా మాత్రం నా కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా మిగిలిపోతుంది. చెక్ సినిమా భారీ విజయాన్ని అందుకొంటుందని బలంగా నమ్ముతున్నాను. చెక్ తర్వాత ఇక గ్యాప్ ఉండదని నేను భావిస్తున్నాను అని కల్యాణి మాలిక్ పేర్కొన్నారు.

ఒక్క పాట కోసం 75 ట్యూన్లు ఇచ్చా

ఒక్క పాట కోసం 75 ట్యూన్లు ఇచ్చా

చెక్ సినిమాలో ఒకే ఒక పాట ఉంటుంది. ఆ పాట కోసం దాదాపు 75 ట్యూన్లు దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి వినిపించాను. దర్శకుడిగా తాను మంచి అవుట్‌పుట్ వచ్చేంత వరకు రాజీ పడరు. ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక పాట సిట్యువేషన్‌గా వస్తుంది. కావాలని పెట్టలేదు. ప్రాపర్‌గా స్క్రీన్ ప్లే ప్రకారమే వస్తుంది అని కల్యాణీ మాలిక్ తెలిపారు

నితిన్ పెర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో

నితిన్ పెర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో

చెక్ సినిమాలో నితిన్ అద్భుతంగా నటించాడు. ఇంతకు ముందు నితిన్‌లా కనిపించడు. నితిన్, ఇతర నటీనటులు బాగా నటించడం వల్ల నాకు మరింతగా కష్టపడాల్సి వచ్చింది. రీరికార్డింగ్ బాగా చేయగలిగాను. నటీనటుల పెర్ఫార్మెన్స్ గొప్పగా ఉంటే మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేస్తుంది. ఈ సినిమా తర్వాత నితిన్ కెరీర్ మరో రేంజ్‌లో ఉంటుంది అని కల్యాణీ మాలిక్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X