దిల్ రాజుతో 12 ఏళ్ల గ్యాప్.. అసలేం జరిగిందంటే.. థ్యాంక్యూ గురించి నాగచైతన్య (Interview)
లవ్ స్టోరి, థ్యాంక్యూ సినిమాలు కోవిడ్‌కు ముందే చేయాలని నిర్ణయించాను. కానీ కరోనావైరస్ కారణంగా రెండేళ్లు లేట్ అయ్యాయి. కాబట్టి నేను నటించిన చిత్రాలు ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ వస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. అభిరామ్ ఎమోషనల్ జర్నీ సినిమా ఆరంభమైన పది నిమిషాలకే మొదలవుతుంది. ప్రేక్షకులు అభిరామ్ జర్నీని ఫాలో అయిపోతుంటారు. అభిరామ్ పాత్ర నుంచి ప్రేక్షకులు నేర్చుకొనేది ఏమీ ఉండదు. కానీ జీవితంలో గ్రాటిట్యూడ్ ఎలా తెలియజేయాలనే విషయం ఎమోషనల్‌గా ఉంటున్నాయి అని నాగచైతన్య అన్నారు. ఇంకా థ్యాంక్యూ, రాశీ ఖన్నా, మాళవిక నాయర్, దిల్ రాజు గురించి ఏం చెప్పారంటే..

విక్రమ్ కుమార్ మంచి టీచర్
థ్యాంక్యూ సినిమాలో అభిరామ్ పాత్ర కోసం దర్శకుడు విక్రమ్ కుమార్ ఎలాంటి టిప్స్ ఇవ్వలేదు. విక్రమ్ కుమార్ మంచి టీచర్. మంచి ఫర్‌ఫెక్షనిస్టు. ఆయన ఎప్పడూ టిప్స్ ఇవ్వరు. ఆయనతో ట్రావెల్ అయితే మనమే పాత్రను ఎలా చేయాల్లో అర్దం అవుతుంది. అభిరామ్ పాత్ర సినిమా నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. మీకు మూడు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలే కనిపిస్తాయి. కానీ ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇలాంటి స్క్రిప్టులు చేయడం చాలా కష్టం. ఇప్పుడు కాబట్టి 16 ఏళ్ల కుర్రాడిగా చేశాను. మరో నాలుగేళ్ల తర్వాత ఆ వయసు పాత్రలు చేయలేం అని నాగచైతన్య అన్నారు.

దిల్ రాజుతో 12 ఏళ్ల తర్వాత
దిల్ రాజు గారితో 12 ఏళ్ల తర్వాత థ్యాంక్యూ ప్రాజెక్టు కుదిరింది. చాలాసార్లు చాలా కథల గురించి మా మధ్య డిస్కషన్ జరిగింది. కానీ పాత్రలు గానీ, కథలు గానీ ఎక్సైట్ చేయాలి. డైరెక్టర్, నిర్మాత, నటులు, ఇతర సాంకేతిక నిపుణులను కథ ఎక్సైట్ చేయాలి. అలాంటి కథలు మా మధ్య రాలేదు. అందుకే ఇంత సమయం పట్టింది. థ్యాంక్యూ సినిమా కథను బీవీఎస్ రవి ఇచ్చారు. విక్రమ్ కుమార్‌తో పాటు అందరం ఎక్సైట్ అయ్యాం. దాంతో థ్యాంక్యూ ప్రాజెక్టు వర్కవుట్ అయింది అని నాగచైతన్య తెలిపారు.

నేను ఎవరికి థ్యాంక్యూ చెప్పానంటే
నేను చాలా తక్కువగా మాట్లాడుతుంటాను. చాలా విషయాల్లో నేను థ్యాంక్స్ చెప్పాలని అనుకొన్నాను. కానీ నా మనసులో నుంచి బయటకు రాలేదు. థ్యాంక్యూ మూవీ తర్వాత నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పాను. గతంలో ఎందుకు చెప్పలేకపోయాను అనే విషయాన్ని వాళ్లకు చెప్పాను. థ్యాంక్యూ సినిమా ఫారిన్‌లో జరుగుతుంది. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత వైజాగ్, ఇతర ప్రాంతాల్లో జరుగుతుంది. నాకు అవుట్ డోర్ షూటింగ్స్ అంటే చాలా ఇష్టం. పబ్లిక్ పల్స్‌ను పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అని నాగచైతన్య చెప్పారు.

రాశీఖాన్నా, మాళవిక, అవికా గోర్ గురించి
థ్యాంక్యూ సినిమాలో రాశీఖాన్నా కారణంగానే అభిరామ్ జర్నీ ప్రారంభం అవుతుంది. అభిరామ్ చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రతీ సినిమాలో ఉండే విధంగానే.. థ్యాంక్యూ సినిమాలో విక్రమ్ కుమార్ మ్యాజిక్ పాయింట్ ఉంటుంది. ట్రైలర్, టీజర్‌లలో ఆ విషయం చూపించలేదు. థియేటర్లలో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. అవికా గోర్ కూడా నటించారు. కానీ నా సిస్టర్ పాత్ర మాదిరిగా ఆమె నటించింది అని నాగచైతన్య తెలిపారు.

మహేష్ బాబు అభిమానిగా
థ్యాంక్యూ సినిమాలో నేను మహేష్ బాబు అభిమానిగా నటిస్తున్నాను. సినిమా డిఫరెంట్ టైమ్ లైన్‌ను బట్టి కథ నడుస్తుంది. మహేష్ బాబు నటించిన పోకిరి, ఒక్కడు సినిమాలు, అతడి సూపర్ హిట్ సినిమాలను కవర్ చేశాం. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా బాగా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కథ నడుస్తుంది. అదే ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. రకరకాల వేరియేషన్‌లో కనిపించడానికి యూనిట్ నాకు స్వేచ్ఛ నిచ్చింది. దాంతోనే వర్కవుట్స్ చేసి.. నేను నా లుక్‌ను మార్చుకొన్నాను అని నాగచైతన్య అన్నారు.


Click it and Unblock the Notifications











