»   » మహానటి, ఎన్టీఆర్ బయోపిక్ చేయడం లేదు.. ఎందుకంటే.. నిత్యా మీనన్

మహానటి, ఎన్టీఆర్ బయోపిక్ చేయడం లేదు.. ఎందుకంటే.. నిత్యా మీనన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాదిలో విలక్షణమైన నటి ఎవరంటే నిత్యమీనన్ అని ఠక్కున చెబుతారు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ఆకట్టుకొంటున్నారు. ఎన్ని సినిమాలు చేశామన్నది ఆమె లెక్క కాదు. ఎంత మంచి సినిమాలు చేశామన్నదే నిత్య మీనన్ సిద్దాంతం. నిత్యమీనన్ తాజాగా అ! అనే చిత్రంలో స్వలింగ సంపర్కురాలిగా కనిపించింది. ఆ పాత్ర ప్రభావం సమాజంపై ఉంటుందని ఆమె స్పష్టం చేసింది. మహానటి, ఎన్టీఆర్ బయోపిక్ అవకాశాలపై వివరణ ఇచ్చారు. అ! సినిమా సక్సెస్ వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో నిత్యమీనన్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడింది.. ఆ వివరాలు మీకోసం..

 మహానటి చేయడం లేదు

మహానటి చేయడం లేదు

సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మహానటి సినిమా ముందు నా వద్దకే వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల అందులో చేయలేదు. రెమ్యునరేషన్, డేట్స్ సమస్య అసలే కాదు. కొన్ని బయటకు చెప్పలేని కారణాలు ఉన్నాయి. అందుకే మహానటికి దూరంగా ఉన్నాను.

Keerthy Suresh Playing A Role Of Legendary Mahanati Savithri | Filmbieat Telugu
ఎన్టీఆర్ బయోపిక్ గురించి

ఎన్టీఆర్ బయోపిక్ గురించి

ఎన్టీఆర్ బయోపిక్ కోసం సంప్రదించిన మాట వాస్తవమే. కానీ ఆ సినిమాను నేను ఒప్పుకోలేదు. ఆ సినిమాలో నేను లేను కాబట్టి దాని గురించి మాట్లాడలేను. ఆ సినిమా గురించి ఏమి చెప్పలేను మీరు అడుగవద్దు.

 నాలుగు భాషల్లో ప్రాణ

నాలుగు భాషల్లో ప్రాణ

నాలుగు భాషల్లో తీస్తున్న ప్రాణ అనే సినిమాలో నటిస్తున్నాను. అందులో ఒకే యాక్టర్ ఉంటారు. ఆ పాత్రను నేను పోషిస్తున్నాను. ఇంకా వేరే యాక్టర్లు ప్రాణ చిత్రంలో ఉండరు. చాలా ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్. కాన్సెప్ట్ సినిమా అది.

 సింగిల్ క్యారెక్టర్

సింగిల్ క్యారెక్టర్

ప్రాణ సినిమాకు సంబంధించి ఓ విశేషం ఉంది. సౌండ్ డిజైనింగ్ ఆ సినిమా ప్రత్యేకత. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. ఈ సినిమాను చాలా డిఫరెంట్‌గా చేయడానికి రసూల్ కృషి చేస్తున్నారు. సరౌండ్ సింక్ సౌండ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. షూటింగ్ సమయంలోనే ఉండే సౌండ్‌ను రికార్డ్ అవుతుంది. డబ్బింగ్ లేకుండా సినిమా ఉంటుంది. సహజసిద్ధంగా నేపథ్యం సంగీతం, డైలాగ్స్ రికార్డు అవుతుంది.

 కొత్త సౌండ్ టెక్నాలజీ

కొత్త సౌండ్ టెక్నాలజీ

ప్రాణ అనే సినిమాను కేరళలోని కుమిలి అనే హిల్ స్టేషన్‌లో షూటింగ్ చేశాం. లోకేషన్‌కు ప్రాధాన్యం అంతగా లేదు. ఓ అమ్మాయి కథనే సినిమాగా తెరకెక్కించాం. నాలుగు భాషల్లో రూపొందుతున్నందున ఒకే డైలాగ్‌ను నాలుగు సార్లు చెప్పాల్సి వచ్చింది. కొంత కష్టమైనా తప్పలేదు.

 లైంగిక దాడిపై ఖండించా

లైంగిక దాడిపై ఖండించా

మలయాళ నటిపై జరిగిన లైంగిక దాడి ఘటన చాలా దారుణం. ఆ ఘటనపై పబ్లిక్‌గా స్పందించలేదు. సోషల్ మీడియాలో నేను ఎక్కువగా కనిపించను కాబట్టి తెలియరాలేదు. బాధిత నటితో నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. వ్యక్తిగతంగా మాట్లాడటం ఇంపార్టెంట్ అనిపించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు అని అనుకొన్నాను. కానీ నేను ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాను. బాధిత నటికి ధైర్యం, మనోధైర్యాన్ని ఇచ్చాను.

 సినిమానే జీవితం కాదు

సినిమానే జీవితం కాదు

షూటింగ్‌లు లేనప్పుడు ఖాళీ సమయాల్లో వేరే పనుల్లో బిజీగా ఉంటాను. లైఫ్ అంటే చాలా విషయాలు ఉంటాయి. సినిమా ఒక్కటే జీవితం కాదుగదా. చాలా విషయాలపై దృష్టిపెడుతాను. సినిమాలు వేగం పెంచే విషయం నా చేతిలో లేదు. దేవుడే నిర్ణయిస్తాడు.

 స్పోర్టివ్‌గా తీసుకొంటాను

స్పోర్టివ్‌గా తీసుకొంటాను

అందరి మాదిరిగానే నేను కూడా విమర్శలపై పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తాను. రివ్యూలు కొన్ని పాజిటివ్‌గా, నెగిటివ్‌గా ఉంటాయి. వాటిని స్పోర్టివ్‌గా తీసుకొంటాను. అయితే వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఉంటే బాధపడుతాను.

 మెర్సల్‌లో గృహిణిగా,

మెర్సల్‌లో గృహిణిగా,

కొన్నిసార్లు నా వయసుకు మించిన పాత్రలు పోషిస్తుంటాను. ఇప్పుడు ఆ విషయమే నాకు కొంత సమస్య తెచ్చిపెడుతున్నది. మెర్సల్‌లో గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించాను. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రంలో నాకంటే రెండు సంవత్సరాలు పెద్దగా ఉండే అమ్మాయికి తల్లిగా నటించాను. అప్పట్లో అది కరెక్ట్ అనిపించింది. అందుకే నేను ఆ పాత్రలు చేశాను.

English summary
Nithya menen is versatile actor in the south. She has done different movies in recent past. Recently she did a character as Lesbian in Awe! movie. This movie produced her co star Nani. This movie getting good applause from one sector of Audience. In this occassion, Nithya menen spoke to Telugu Filmibeat exclusively.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu