For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'ఒకే ఒక జీవితం' సినిమా కోసం ఐదేళ్ల శ్రమ.. అల్లు అర్జున్ తో సినిమా..: డైరెక్టర్ శ్రీకార్తిక్

  |

  యంగ్ టాలెంట్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒకే ఒక జీవితం సినిమా పాజిటివ్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ఇక దర్శకుడు శ్రీకార్తిక్ విలేఖరుల సమవేశంలో పాల్గొని సినిమా సక్సెస్ విశేషాలు షేర్ చేసుకున్నారు.. ఆ వివరాల్లోకి వెళితే..

  ఐదేళ్ళ సమయం

  ఐదేళ్ళ సమయం

  శ్రీకార్తీక్ మాట్లాడుతూ.. ఈ కథని రాసేందుకు రెండేళ్ళ సమయం పట్టింది. హీరో సెట్ కావడానికి మరో ఏడాదిన్నర పట్టింది. అనంతరం కోవిడ్ వలన రెండేళ్ళు... సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు ఐదేళ్ళ సమయం పట్టింది. ఫైనల్ గా నా నిరీక్షణకి తగిన ఫలితం దక్కింది. ఈ కథ ఆలోచన రావడానికి కారణం మీ అమ్మగారే ఒక కారణం. అమ్మ బెడ్ మీద వున్నపుడే షార్ట్ ఫిల్మ్ చూపించాలని అనుకున్నా. కానీ అప్పటికే చూసే స్థితిలో లేరు. నేను ఫిల్మ్ మేకర్ అవుతానని కూడా తనకి తెలీదు.. అని అన్నారు.

  ఎమోషనల్ రైడ్

  ఎమోషనల్ రైడ్

  ఇక నాకు సైన్స్ ఇష్టం. ఈ సినిమాలో సైన్స్ లేకపోతే మెలో డ్రామా అయ్యేది. ఇక ఆడియన్స్ కి ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఇవ్వాలనే ఈ కథని సైన్స్ తో డిజైన్ చేశా. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చింది. భవిష్యత్ లో మరిన్ని సైన్స్ ఫిక్షన్ చేయాలి అనుకుంటున్నాను. హీరో శర్వానంద్ తో వర్క్ చేయడం గొప్ప అనుభూతి. శర్వాకి నాకు ఈ సినిమా ఎమోషనల్ రైడ్. శర్వాకి కూడా తన అమ్మ అంటే ప్రాణం. శర్వాకి కెరీర్ లోనే ఒకే ఒక జీవితం మంచి సినిమా అవుతుందనినమ్మా. అదే నమ్మకం నిజమైయింది.. అని అన్నారు.

  అమల గారిని తీసుకోవాలనే ఆలోచన

  అమల గారిని తీసుకోవాలనే ఆలోచన

  ఈ సినిమాలో అమ్మ పాత్ర కోసం అమల గారిని తీసుకోవాలనే ఆలోచన నాదే. స్టోరీ వినగానే అమల గారికి చాలా నచ్చింది. వెంటనే చేస్తానని అన్నారు. నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేశాక అసలైతే డ్యాన్స్ స్కూల్ పెట్టాలని అనుకున్నా. కుదరకపోతే న్యూయార్క్ స్కూల్ లో డ్యాన్స్ లో మాస్టర్స్ చేయాలనీ కూడా అనిపించింది. ఒకప్పుడు ఒక డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నా. రాధిక, గౌతమి గారు ఆ షోకి న్యాయ నిర్ణేతలుగా వచ్చారు. నటుడ్ని కావాలని కూడా అనుకున్నా. రెండేళ్ళు తిరిగినా అవకాశాలు రాలేదు. తర్వాత నేనే సునిమా చేయాలి అని నిర్ణయానికి వచ్చాను. అందుకే షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్ చేశా.. అని అన్నారు.

   78 రోజుల్లో షూటింగ్

  78 రోజుల్లో షూటింగ్


  ఒకే ఒక జీవితం సినిమా పూరి కావడానికి ఏడాది పట్టింది. రెండు భాషల్లో కలిపి 78 రోజుల్లో షూటింగ్ ని పూర్తి చేశాం. ఈ సినిమా చూసిన అనంతరం నాగార్జున గారు ''ఇకపై నిన్ను నా కొడుకులా చూస్తా'' అని అన్నారు. మారుతి గారితో పాటు మరికొందరు దర్శకులు సినిమా గురించి గొప్ప గా మాట్లాడారు. ఈ సినిమా ద్వారా ఓపికతో వుండాలి అని మనం చేసే పని పట్ల నిజాయితీగా వుంటే ఈ విశ్వం మనకి తోడౌతుంది. ఈ సినిమా జరుగుతున్నపుడు చాలా సందర్భాల్లో ఇది అనుభవంలోకి వచ్చింది.. అని శ్రీకార్తీక్ అన్నాడు.

  అల్లు అర్జున్ తో సినిమా

  అల్లు అర్జున్ తో సినిమా

  భవిష్యత్తులో చేయబోయే సినిమా కోసం మంచి ప్రొడక్షన్ కోసం చూస్తున్నా. మళ్ళీ నా కొత్త సినిమా తెలుగులో ఉండబోతుంది. బిగ్ స్కేల్ లో థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని ఉంది. ఒక ఫాంటసీ స్క్రిప్ట్ అయితే రెడీగా వుంది. నా రెండో సినిమా అల్లు అర్జున్ గారితో చేయాలనీ అనుకుంటున్నాడు. కథ కూడా చెప్పాలి. మా ఫ్యామిలీలో అంతా అల్లు అర్జున్ ఫ్యాన్సే ఉన్నారు. ఆయనతో సినిమా కోసం ఐదేళ్ళు అయినా ఎదురుచూస్తాను. ఇక హైదరాబాద్ ఇష్టం. అమ్మ బిఎస్ఎన్ ఎల్ ఆఫీసర్ గా చేశారు ఆమె తెలుగువారే. నాన్న రియల్ ఎస్టేట్ లో చేసేవారు.. అని శ్రీ కార్తీక్ వివరణ ఇచ్చారు.

  English summary
  Oke oka jeevitham director Shree Karthick latest interview and clarification on next project
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X