twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాఘవేంద్రరావు పిలిచి ఆఫర్.. పూరీకి రుణపడి ఉంటాను.. కిచ్చ సుదీప్‌తో హీరోయిన్‌గా.. ప్రమోదిని

    By Rajababu
    |

    తన తనయుడు ఆకాశ్ హీరోగా పూరీ దర్శకత్వం వహించిన మెహబూబా చిత్రం ఇటీవలే రిలీజైంది. ఆ చిత్రంలో ఆకాశ్ తల్లిగా నటించిన ప్రమోదిని తనదైన శైలిలో నటించి మెప్పించారు. అందం, అభినయం కలోబోసిన ప్రమోదిని న్యూ జనరేషన్ తల్లిగా పేరు సంపాదించారు. మెహబూబా చిత్రంలో చేసిన తల్లిపాత్రకు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ప్రమోదిని తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు.

    బాలనటిగా కన్నడలో

    బాలనటిగా కన్నడలో

    నా పేరు ప్రమోదిని. కర్ణాటకలో స్థిరపడిన తెలుగువాళ్లం. తొలుత కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాను. నా సోదరి, నేను క్లాసికల్ డ్యాన్సర్లలం. మా తల్లికి మమ్మల్ని సినిమా తెరకు పరిచయం చేయాలని ఓ కోరిక ఉండేది. ఆ సమయంలో కన్నడలో ఓ సినిమా అవకాశం వచ్చింది. దాంతో బాలనటిగా అవకాశం లభించింది. తవురుమణి చిత్రంతో నా కెరీర్ ప్రారంభమైంది. ఆ చిత్రం ద్వారా హీరో వినోద్‌కుమార్ పరిచయం అయ్యారు. ఆ సినిమా హిట్ కావడంతో బాలనటిగా మంచి పాత్రల్లో నటించాను. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా అవార్డులు వచ్చాయి.

    కిచ్చ సుదీప్ పక్కన హీరోయిన్‌గా

    కిచ్చ సుదీప్ పక్కన హీరోయిన్‌గా

    ఎడ్యుకేషన్ కోసం సినిమాలు మానేశాను. నాకు బాలనటిగా అవకాశం ఇచ్చిన అబ్బయ్యనాయుడు మళ్లి పిలిచి హీరోయిన్‌గా అవకాశం లభించింది. కిచ్చ సుదీప్‌ను హీరోగా పరిచయం చేస్తూ తవయ్య అనే సినిమా రూపొందించారు. ఆ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటించాను. ఆ సినిమా ఆడకపోవడంతో నాకు అవకాశాలు రాలేదు.

    గ్లామర్ పాత్రలపై అభ్యంతరం

    గ్లామర్ పాత్రలపై అభ్యంతరం

    మాది సంప్రదాయ కుటుంబం. దాంతో గ్లామర్ పాత్రలు ధరించడంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఆ కారణంగా నేను టెలివిజన్ రంగంపై దృష్టిపెట్టాను. టెలివిజన్ రంగంలో మెగా సీరియల్‌లో నటించాను. ఆ తర్వాత ఉదయ టెలివిజన్‌లో పాపులర్ యాంకర్‌గా మారాను. యాంకర్‌గా మంచి క్రేజ్ వచ్చింది.

    రాఘవేంద్రరావు ఆఫర్

    రాఘవేంద్రరావు ఆఫర్

    అప్పుడే దర్శకుడు రాఘవేంద్రరావుతో పరిచయం జరిగింది. అప్పుడు తెలుగులో నటిస్తావా అని అడిగి ఓ సీరియల్‌లో అవకాశం ఇచ్చారు. 1992లో తెలుగులో మనోయజ్క్షం సీరియల్‌లో నటించాను. ఆ తర్వాత రాఘవేంద్రరావు రూపొందించిన శ్రీకృష్ణ లీలలులో నటించాను. ఆ తర్వాత పెళ్లి జరగడంతో అమెరికాకు వెళ్లిపోయాను.

     14 రీల్స్ బ్యానర్‌లో

    14 రీల్స్ బ్యానర్‌లో

    ఆ తర్వాత మళ్లీ అమెరికా నుంచి తిరిగి వచ్చి గోరంతదీపం, ఇతర టెలివిజన్ సీరియల్స్‌లో నటించాను. 14 రీల్స్ బ్యానర్‌లో అవకాశం లభించింది. దాంతో కృష్ణ గాడి వీర ప్రేమగాథ చిత్రంతో నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ధ్రువ, రెండు రెళ్లు ఆరు, లై చిత్రాలు నాకు మంచి గుర్తింపును ఇచ్చాయి.

     మెహబూబా అవకాశం అలా

    మెహబూబా అవకాశం అలా

    ఇక మెహబూబా చిత్రంలో అవకాశం రావడం జీవితంలో మరిచిపోలేనిది. దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు రుణపడి ఉంటాను. ముందు పూరీ ఆఫీస్ నుంచి మణిరాజ్ ఫోన్ చేసి ఫొటోలు పంపించమన్నారు. ఆ తర్వాత రోజే ఓ వీడియో పంపించమని అడిగారు. వీడియో చూసిన తర్వాత రేపటి నుంచే షూటింగ్ అని చెప్పారు. ఆ సినిమాలో నేను నటించిన సీన్లను యదావిధిగా ఉంచారు. అందుకు పూరీ థ్యాంక్స్.

     మెహబూబా తర్వాత మంచి ఆఫర్లు

    మెహబూబా తర్వాత మంచి ఆఫర్లు

    మెహబూబా చిత్రం రిలీజ్ తర్వాత నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఆఫర్లు ఇస్తున్నాయి. రాజ్ తరుణ్‌ చిత్రం రాజుగాడు, రాహుల్ రవీంద్రన్ నటించిన దృష్టి, ఇతర చిత్రాల్లో తల్లిగా నటిస్తున్నాను. నేను, నాన్న, బాయ్‌ఫ్రెండ్ చిత్రంలో అవకాశం ఇచ్చారు. కానీ డేట్స్ ప్రాబ్లెం వల్ల చేయలేకపోయాను. అందుకు బెక్కం వేణుగోపాల్‌కు థ్యాంక్స్. మళ్లీ హుషారులో మంచి పాత్ర పోషిస్తున్నాను.

    English summary
    Tollywood's popular director Puri Jagannadh launching his son Akash Puri with Mehabooba movie. This movie was released on May 11. This made under banner of Puri Connect. This movie going in good in trade circles. In this occassion, Promodini, who played a mother role to akash speaks about her role in Mehbooba.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X