For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Priyamani అలాంటి పవర్‌ఫుల్ రోల్ కోసం చూస్తున్నా.. భామా కలాపం చూసి నా భర్త అలాంటి కామెంట్.. ప్రియమణి ఇంటర్వ్యూ

  |

  సీనియర్ హీరోయిన్ ప్రియమణి విభిన్నమైన పాత్రలతో సినిమాలతోపాటు ఓటీటీలో వెబ్ సిరీస్‌తో మెప్పిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్, నారప్ప చిత్రాలతో ఆకట్టుకొన్నారు. తాజాగా భామా కలాపం అనే సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భామా కలాపం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ప్రియమణి తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

  Recommended Video

  Bhamakalapam : Priyamani Laughter-filled Interview ప్రియమణి బీయింగ్ బోల్డ్ | Filmibeat Telugu
  200 శాతం సంతృప్తి

  200 శాతం సంతృప్తి

  భామ కలాపం సినిమా రిలీజ్ తర్వాత రెస్పాన్స్ మంచిగా వస్తున్నది. 200 శాతం సంతృప్తి కలిగించింది. ఫోన్ చేసి వ్యక్తిగతంగా అభినందిస్తున్నారు. సినిమాలో నా లుక్ బాగుంది. ఫీల్ బాగుంది. కంప్లీట్ ఎంటర్‌టైనర్ అనే ఫీడ్ బ్యాక్ వస్తున్నది. ఈ సినిమాలో నన్ను ఎట్రాక్ట్ చేసిన మెయిన్ పాయింట్ ఏమిటంటే.. స్టోరి చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. కథ ఎలా చెప్పారో.. అలానే తెర మీద ఆవిష్కరించారు. ఓటీటీలో ఇలాంటి అనుపమ లాంటి పాత్ర, మధ్య తరగతి గృహిణి పాత్రను పోషించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. గుడ్డు చుట్టు తిరిగే కథను ఇంత వరకు చేయలేదు. జాన్ విజయ్‌ నటన నాకు బాగా నచ్చింది అని ప్రియమణి అన్నారు.

   ఇలాంటి అమాయకమైన పాత్రతో

  ఇలాంటి అమాయకమైన పాత్రతో

  ఇప్పటి వరకు బోల్డ్, డేరింగ్ పాత్రలు చేశాను కానీ.. అనుపమ లాంటి అమాయకమైన పాత్రను ఇంత వరకు చేయలేదు. అమాయకంగా నటించడం నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. నిజజీవితంలో నేను అలా ఉండను. నా బాడీ లాంగ్వేజ్ చూస్తే అమాయకురాలిని అనిపించను. వాస్తవ జీవితంలో వ్యక్తులను చూసిన నా క్యారెక్టర్ ఎఫెక్టివ్‌గా నటించాను. అయితే నా హృదయానికి నచ్చిన పాత్ర మాత్రం కాదు.. కొత్తగా ఉందని ట్రై చేశాను అని ప్రియమణి చెప్పారు.

   ఇతరుల లైఫ్‌లో జోక్యం చేసుకోను

  ఇతరుల లైఫ్‌లో జోక్యం చేసుకోను

  భామ కలాపం సినిమాలో అనుపమ మాదిరిగా ఇతరుల జీవితాల్లో జోక్యం కలిగించుకోను. షూటింగులతో బిజీగా ఉండటం కారణంగా నా పొరుగింటి వారు ఎవరు అనే విషయం కూడా తెలియదు. ఈ మధ్యనే నేను నా పొరుగింటి వారితో పరిచయం చేసుకొన్నాను. ఇతరుల లైఫ్‌లో జోక్యం చేసుకోను కానీ.. సలహాలు, సూచనలు ఇస్తాను. ఈ సినిమా చేయడం వల్ల కొన్ని విషయాలు నేర్చుకొన్నాను. అనుపమ లాంటి అలవాట్లు ఉండకూడదు. ఇతరుల జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని, ఒకవేళ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో అనే భయం కలుగుతుందనే విషయాన్నితెలుసుకొన్నాను అని ప్రియమణి చెప్పారు.

  కొత్త దర్శకులతో పనిచేయడంపై

  కొత్త దర్శకులతో పనిచేయడంపై

  కొత్త దర్శకులతో పనిచేయడం ఎప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. దర్శకుడు కథ చెప్పిన విధానం నమ్మకం కుదిరితే సినిమా చేయడానికి ఒప్పుకొంటాను. షూటింగులో సన్నివేశాల డిస్కషన్ చేసే విధానం చూసినప్పుడు దర్శకులపై మంచి అభిప్రాయం కలుగుతుంది. కొన్నిసార్లు నాకు నచ్చకపోతే దర్శకుడికి కొన్నిసార్లు సలహాలు ఇస్తాను. డైలాగ్స్ ఏదైనా తేడా అనిపిస్తే.. ఇది మార్చడానికి అవకాశం ఉందా అని అడుగుతాను. ఓటీటీ కారణంగా హీరోయిన్ ఓరియెంట్ చిత్రాలకు డిమాండ్ పెరిగింది. దర్శకులు హీరోయిన్లను దృష్టిలోపెట్టుకొని కథలు రాస్తున్నారు. నాకు పవర్‌ఫుల్ విలన్ పాత్ర చేయాలని ఉంది. నా జర్నీ సినిమా పరిశ్రమలో చాలా ఉంది. నటనపట్ల ఇంకా ఉత్సాహం చల్లార్లేదు. ఇప్పుడే నా అసలు కేరీర్ మొదలైంది. ఇక ముందు చాలా చేసేది ఉంది అని ప్రియమణి అన్నారు.

  నాకు వంట చేయడం రాదు అంటూ

  నాకు వంట చేయడం రాదు అంటూ

  భామ కలాపం చిత్రంలో చెఫ్‌గా నటించాను. కానీ నిజ జీవితంలో వంటలో ప్రావీణ్యం శూన్యం. ఎవరైనా వండిపెడితే పుష్టిగా తింటాను. నా భర్త మంచి వంటగాడు. అతడు వండి పెడితే నేను బాగా తింటాను. వంటగదిలోకి వెళ్లి ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఓటీటీ కారణంగా ఎలాంటి పాత్రలైన పోషించే వెసులుబాటు ఉంది అని ప్రియమణి తెలిపారు.

  నా భార్త కాల్ చేసి..

  నా భార్త కాల్ చేసి..

  భామ కలాపం తెలుగుతోపాటు తమిళంలో కూడా రిలీజ్ అయింది. తమిళం నుంచి ఇంకా ఫీడ్ బ్యాక్ రాలేదు. సినిమా చూసిన వాళ్లు మెసేజ్ పెడుతున్నారు. నా భర్త ఈ రోజే ఆహా యాప్ డౌన్‌లోడ్ చేసుకొని సినిమా చూశాడు. చాలా బాగుందని అభినందించాడు. సినిమాలో చాలా అందంగా ఉన్నారు. కామిక్ రోల్స్ వస్తే చేయమని నా భర్త సలహా ఇచ్చారు అని ప్రియమణి చెప్పారు.

   ప్రియమణి సినిమాలు ఇలా..

  ప్రియమణి సినిమాలు ఇలా..

  ప్రియమణి తన తదుపరి సినిమాల విషయాలను వెల్లడిస్తూ.. రానా దగ్గుబాటితో విరాటపర్వం సినిమా చేశాను. అది రిలీజ్‌కు సిద్దంగా ఉంది. హిందీలో అజయ్ దేవగన్‌తో మైదాన్ సినిమా చేస్తున్నాను. తమిళంలో కొటేషన్ గాంధీ చేస్తున్నా. కన్నడలో డాక్టర్ 56 చేస్తున్నాను అని ప్రియమణి తెలిపారు.

  English summary
  Actress Priyamani's latest movie Bhama Kalapam released on Aha OTT on February 11th. Here is the exclusive interview from Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X