For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  7 Days 6 Nights: ఎవరికి చెప్పకుండా గోవా వెళ్లి.. రీసెర్చ్ చేసి రాసిన కథ.. ఏమ్.ఎస్.రాజు ఇంటర్వ్యూ

  |

  దేవి, వర్షం, ఒక్కడు, మనసంతా నువ్వే.. ఇలా ఎన్నో మరచిపోలేని అద్భుతమైన సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రాజు ఇప్పుడు దర్శకుడిగా మారి విభిన్నమైన తరహాలో సక్సెస్ లు అందుకుంటున్నారు. ఎక్కువగా యూత్ ను ఎట్రాక్ట్ చేసే విధంగా బోల్డ్ కంటెంట్ తో ప్రయోగాలు చేస్తున్నారు.

  ఇక డర్టీ హరి సినిమాతో హిట్ అందుకున్న అనంతరం '7 డేస్ 6 నైట్స్'సినిమాతో సక్సెస్ అందుకునేందుకు సిద్ధమయ్యారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సందర్భంగా ఎంఎస్ రాజు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

  ఆ విధంగా ఈ కథ పుట్టింది

  ఆ విధంగా ఈ కథ పుట్టింది

  '7 డేస్ 6 నైట్స్' కథ ఎలా మొదలైంది అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. 'డర్టీ హరి' అనంతరం తర్వాత కొన్ని కథలు అనుకుంటున్నాను. ఇక అప్పుడే రాజ్ కపూర్ 'బర్సాత్' చూశా. అందులో రెండు పాత్రలు నాకు బాగా కనెక్ట్ ఆయాయు. అతి మంచోడికి ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. ఇక హీరో ఎప్పుడూ ఏదో ఒక డేంజర్ లో ఉంటాడు. అప్పుడే సినిమా ఆసక్తిగా ఉంటుంది. ఇక 'బర్సాత్' క్యారెక్టర్లు నచ్చడంతో వాటిని స్ఫూర్తిగా తీసుకుని కొత్త కథ రాశాను.. అని అన్నారు.

  సుమంత్ పాత్ర ఎలా ఉంటుందంటే..

  సుమంత్ పాత్ర ఎలా ఉంటుందంటే..

  సుమంత్ అశ్విన్ పాత్ర గురించి మాట్లాడుతూ.. 'బర్సాత్'లో రాజ్ కపూర్ క్యారెక్టర్ తరహాలోనే సుమంత్ క్యారెక్టర్ డిజైన్ చేశాను. గడ్డం, బరువు ఎక్కువగా ఉండాలని అదొక కేర్‌లెస్ రోల్ కాబట్టి జీవితంలో అతడికి ఒక లక్ష్యం ఉంటుంది. కానీ దాన్ని ఇంకా చేరుకోలేదు. మరో వైపు లవ్ చేసిన అమ్మాయి విదేశాలకు వెళుతుంది. డిప్రెషన్ హైలెట్ అవ్వాలి అంటే గడ్డం పెంచి, బరువు పెరగాలని అన్నాను. ఇక అందుకు తగ్గితే అతను మారిపోయాడు. రోహన్ అనే నటుడు ఫ్రెండ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. కానీ కథ, నేపథ్యాలు వేర్వేరుగా ఉంటాయి.. అని ఎమ్.ఎస్.రాజు అన్నారు.

   రీసెర్చ్ చేశాను

  రీసెర్చ్ చేశాను

  ఈ కథ రాయాలని అనుకున్నప్పుడు ఒక్కడినే గోవా వెళ్లి కొంత రీసెర్చ్ చేశాను. బయోపిక్ కోసం కాకుండా కొత్తగా యూత్ సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు కూడా రీసెర్చ్ చేయాలని అనిపించింది. అందుకే ఇంట్లో ఎవరికి చెప్పకుండా గోవా వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశా అక్కడ యూత్ ఎలా ఎంజాయ్ ఎలా మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారు అనే అంశాలను చూసి 7 డేస్ 6 నైట్స్ కథను రాశాను.. అలాగే ఇండస్ట్రీలో ఎవరూ అట్టెంప్ట్ చేయని జానర్ సినిమాలు అని కాదు కానీ సినిమా స్టార్ట్ అయితే అలా వెళ్లిపోయే సినిమాలు చేయాలని అనుకుంటున్నా.. చిన్న ట్విస్ట్ లు సినిమాను ఒక్కసారిగా మార్చేస్తాయి ఇక సినిమాలు '7 డేస్ 6 నైట్స్' ఎలా ఉందో ప్రేక్షకులు చెప్పాలి.. అని ఎమ్ రాజు అన్నారు.

  థియేటర్ల సంఖ్య పెరుగుతోంది..

  థియేటర్ల సంఖ్య పెరుగుతోంది..

  '7 డేస్ 6 నైట్స్' సినిమాను తక్కువ థియేటర్లలో విడుదల చేయాలనుకున్నాం.. మొన్న విడుదల ట్రైలర్ విడుదల చేశాక... చాలా మంది అడుగుతున్నారు. అందుకే థియేటర్ల సంఖ్య పెరుగుతోంది. ఇక సినిమలో నటించిన కొత్త హీరోయిన్లు అద్భుతంగా చేశారు. రోహన్ చేసే కామెడీకి జనాలు నవ్వుతారు. పక్కన మరో ఎమోషనల్ రోల్ కూడా ఉంది. ఆ పాత్రకు సుమంత్ సూట్ అవుతాడని అతడిని తీసుకున్నాను. ఇక '7 డేస్ 6 నైట్స్' అంటే ఏదో అమ్మాయిలను తీసుకుని బీచ్‌కు వెళ్లే సినిమా కాదు... డినిమాలో ఒక మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంది. ఇంటర్వెల్ నుంచి ప్రేక్షకులు ఒక ట్రాన్స్‌లోకి వెళతారు.. అని ఎమ్ఎస్.రాజు అన్నారు.

  ఫ్యామిలీ కూడా రావచ్చు

  ఫ్యామిలీ కూడా రావచ్చు

  థియేటర్లకు ఎక్కువగా వచ్చేది యువతరమే.. అందుకే ఇది యూత్ సినిమా అంటున్నాను. అలాగే, ఇది ఫ్యామిలీ కూడా చూడవచ్చు. శుక్రవారం సాయంత్రానికి కుటుంబ ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వస్తారని అనుకుంటున్నాను. అడల్ట్ కంటెంట్ సినిమా అయితే కాదు. సెన్సార్ నుంచి 'యు/ఎ' సర్టిఫికెట్ లభించింది. ఇక సతి సినిమా భార్యాభర్తల మధ్య జరిగే కథతో తీసిన సినిమానే 'సతి'. ఇదొక మిస్టరీ జానర్ సినిమాగా రానుంది. ఇక మరొక పాత సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాము. దాన్ని 14 భాషల్లో తీస్తాం. అక్టోబర్ లో ఆ సినిమా స్టార్ట్ కావచ్చు. చాలా పెద్ద స్కేల్ లో ఉంటుంది.. అని ఏమ్.ఎస్.రాజు తెలియజేశారు.

  English summary
  Producer ms raju special interview on 7 Days 6 Nights movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X