‘ఓజీ సినిమాతో డిస్టిబ్యూటర్లకు నష్టాలా? అంత రేటుకు ఎందుకు కొనాలి?’
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం ఇప్పటికే పలు చోట్ల భారీ లాభాలను సొంతం చేసుకొన్నది. నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం డిస్టిబ్యూటర్లకు నష్టాలను తెచ్చిపెట్టిందనే విషయంపై నిర్మాత నట్టికుమార్ పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. ఈ సినిమా బిజినెస్, బడ్జెట్ గురించి ఆయన ఏం చెప్పారంటే..
ఓజీ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ 225 కోట్ల రూపాయలుగా నమోదైందని బిజినెస్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 230 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని చేపట్టిన ఈ చిత్రం రికార్డు వసూళ్లను నమోదు చేస్తున్నది.

ఓజీ చిత్రం ప్రొడక్షన్ కాస్ట్ పరంగా రిలీజైన 3వ రోజే బ్రేక్ ఈవెన్ అయింది. హరిహర వీరమల్లుతో పోల్చితే మూడు రెట్లుగా రైట్స్ అమ్మారు. ఆ పరిస్థితుల్లో ఎంత కలెక్ట్ చేస్తుందో కొన్ని రోజులు ఆడితే తెలుస్తుంది. నైజాం బ్రేక్ ఈవెన్ అయింది. వైజాగ్‌లో పుష్ప, సంక్రాంతికి వస్తున్నాం రేట్లతో పోల్చుకొంటే కొంత మేరకు నష్టం వచ్చే అవకాశం ఉంది అని నట్టి కుమార్ అన్నారు.
పవన్ కల్యాణ్ సినిమాకు సహజంగానే క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్‌ను చూపించి ఓజీ మూవీకి నిర్మాతలు క్యాష్ చేసుకొన్నారు. భారీ రేట్ చెబితే.. డిస్టిబ్యూటర్లు ఎందుకు కొనాలి. వాళ్లు కొనకపోతే అంతంత రేట్లు ఎవరు కోట్ చేస్తారు. కాబట్టి నిర్మాత ఎంత రేట్ చెబితే అంత రేటుకు కొనడం సరికాదు. అయితే అంత రేటు పెట్టినా ఓజీ భారీగా కలెక్ట్ చేసింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని నట్టి కుమార్ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు కాంతార చాప్టర్ 1 నుంచి ఎలాంటి ముప్పు లేదు. ఓజీ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. అయితే కొన్ని చోట్ల నష్టాలు వచ్చాయనే ప్రచారం జరుగుతున్నది. అందులో నిజం లేదు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు అధిక రేట్లకు సినిమాను కొన్నారు. వారికి కొన్ని చోట్ల స్వల్ప నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇడ్లీ కొట్టు సినిమా ఫ్లాప్ కావడంతో ఆ సినిమా థియేటర్లు అన్నీ కాంతారకు లభించాయి అని నట్టి కుమార్ చెప్పారు.
పవన్ కల్యాణ్‌కు అభిమానులే కాదు. ఫ్యామీలి ఆడియెన్స్, రెగ్యులర్ ఆడియెన్స్ కూడా వచ్చి చూశారు. పవన్ కల్యాణ్ మూవీ ఓ ప్రభంజనం సృష్టించింది. ఆయన నటన, డైలాగ్స్ కూడా ఓ ప్రభంజనమే. ఓజీ సినిమా సూపర్ హిట్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఐదు రెట్లు హిట్ అవుతుంది అని జోస్యం చెప్పారు.
తెలుగు సినిమా రంగంలో టికెట్ రేట్లు పెంచడానికి నేను వ్యతిరేకం. తెలుగు సినిమాకైనా, డబ్బింగ్ సినిమాకైనా రేట్లు పెంచడం సరికాదు. టికెట్ రేట్స్ పెంచడం వల్ల పైరసీ ఎక్కువ అవుతుంది. ప్రేక్షకులు దూరం అవుతారు. అభిమానులు, సినిమా ప్రేక్షకులు పైరసీని ప్రోత్సహించకూడదు అని నట్టికుమార్ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











