Don't Miss!
- Finance
LIC: రెండు రోజుల్లో రూ.16,580 కోట్లు నష్టపోయిన ఎల్ఐసీ.. ఆందోళనలో పెట్టుబడిదారులు..!
- News
భర్తతో గొడవ: కొరికేసింది.. సీన్ కట్ చూస్తే..!
- Sports
INDvsNZ : ఇదేం బౌలింగ్రా.. నువ్వే వాళ్లను గెలిపిస్తున్నావ్.. టీమిండియా పేసర్‌పై ట్రోల్స్!
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
- Technology
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- Automobiles
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- Lifestyle
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
Tamannaah ను అందుకే తీసుకొన్నాం..సత్యదేవ్ సపోర్ట్ మరువలేం..గుర్తుందా శీతాకాలం నిర్మాత రామారావు(ఇంటర్వ్యూ)
కన్నడ దర్శకుడు నాగశేఖర్ దర్శకత్వంలో లవ్ మాక్‌టెయిల్ చిత్రానికి రీమేక్‌గా రామారావు చింతపల్లి నిర్మించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. సత్యదేవ్, తమన్నా భాటియా, మేఘా ఆకాశ్, కావ్య శెట్టి, సుహాసిని మణిరత్నం ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 9వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిర్మాత చింతపల్లి రామారావు మీడియాతో మాట్లాడుతూ..

మాది గుంటూరు జిల్లాలోని..
మాది గుంటూరు జిల్లా వినుకొండకు సమీపంలోని ఓ పల్లెటూరు మా గ్రామం. ఇండియాలోని టాప్ 10 కాలేజీలో ఒకటైన బెంగళూరు ఇంజనీరింగ్ చదువుకొన్నాను. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోను, అలాగే ఎలివేటర్, కన్‌స్ట్రక్షన్ రంగంలోను నేను ఉన్నాను. చిన్నప్పటి నుంచి సినిమా అంటే నాకు ఇష్టం. బాల్యంలో ఫిలిం రీల్స్‌తో గోడలపై సినిమాలు ప్రదర్శించడం చేసే వాడిని. చిరంజీవి, కృష్ణ ఫోటోలు పెట్టి ఇస్త్రీ చేస్తే షర్ట్‌పై బొమ్మ ప్రింట్ చేసుకొనే వాడిని.
అలా సినిమాపై ఇంట్రెస్ట్‌తో డబ్బింగ్ సినిమాలు చేశాను. ఇప్పుడు నేరుగా ప్రొడక్షన్‌లోకి వచ్చాం. మరో మూడు సినిమాలు ప్రొడక్షన్‌లో ఉన్నాయి. సమాజానికి ఉపయోగ పడే చిత్రాలను నిర్మించాలనే ఆలోచనలలో ఉన్నాను. హారర్, క్రైమ్, హ్యుమన్ ఎమోషన్స్ సినిమాలంటే నాకు ఇష్టం అని నిర్మాత చింతపల్లి రామారావు అన్నారు.

నిర్మాతగా ఎలా మారానంటే?
గుర్తుందా శీతాకాలం సినిమా కన్నడ చిత్రం లవ్ మాక్‌టెయిల్‌కు రీమేక్‌గా రూపొందించాం. ఈ సినిమా నా ఛాయిస్ కాదు. డైరెక్టర్ నాగశేఖర్ ముందుగా సినిమా ప్రారంభించారు. మధ్యలో ఆర్థిక సమస్యలు రావడంతో నేను ఈ సినిమాతో భాగమయ్యాను. ఈ సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ వరకు తీసుకొచ్చాను. ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి స్వతహాగా పెద్ద డిస్టిబ్యూటర్. ఆయనతో కలిసి సినిమా నిర్మించడం హ్యాపీగా ఉంది. సినీ నిర్మాణంలో కొన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకొంటాం. మరికొన్ని అంశాలు అనుభవంగా మారుస్తాయి అని చింతపల్లి రామారావు చెప్పారు.

సత్యదేవ్ నాకు ధైర్యాన్ని ఇచ్చారు..
గుర్తుందా శీతాకాలం సినిమాకు సంబంధించి హీరో సత్యదేవ్ తనకు సంబంధం లేకున్నా.. అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకొన్నారు. నేను నిర్మాతగా ప్రవేశించే సమయంలో నాకు సత్యదేవ్ ధైర్యం ఇచ్చారు. మీరు రంగ ప్రవేశం చేయండి..నేను అన్ని విషయాలు దగ్గరుండి చూసుకొంటానని చెప్పారు. నిర్మాత బాగా ఉండాలని అకౌంట్ల కూడా చూశారు. ఈ సినిమా నిర్మాణంలో నాకు సత్యదేవ్ సహకారం అందించారు అని చింతపల్లి రామారావు తెలిపారు.

తమన్నాను ఎందుకు తీసుకొన్నామంటే?
కమర్షియల్ ఎలిమెంట్స్‌తో గుర్తుందా శీతాకాలం సినిమా చేశాను. తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించింది. ప్రేక్షకుడిని థియేటర్‌కు తప్పించే సత్తా ఉన్న హీరోయిన్. సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్స్ అందించాలనే కోణంలోనే తమన్నాను తీసుకొన్నాం. దర్శకుడు నాగశేఖర్ మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్. దర్శకుడిగా కన్నడలో తనకు తాను నిరూపించుకొన్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించారు. దేశంలోనే పేరు ఉన్న గాయకులతో పాటలు పాడించాం అని చింతపల్లి రామారావు చెప్పారు.

జీవితం, ప్రేమ అనే అంశాలతో
మనిషి జీవితంలో సాగే మూడు దశలను చక్కగా చెప్పే ప్రయత్నం గుర్తుందా శీతాకాలం మూవీలో చెప్పాం. ఇది పక్కాగా యూత్‌కు సంబంధించేదే కాకుండా కుటుంబ కథా చిత్రం. జీవితంలోని ప్రేమ వ్యవహారాల్లో విలువైన ప్రేమ.. యువతీ, యువకులు ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదో అనే సారాంశంతో కథ సాగుతుంది.
ఎదుటి వాళ్ల వద్ద ప్రేమను తీసుకోవడం కాదు.. ప్రేమను ఇవ్వాలనే పాయింట్‌ను చెప్పాం. ఆటోగ్రాఫ్.. ఇతర సినిమాల కథకు పోలీక ఉండదు. లవ్ మాక్‌టెయిల్ సినిమా కథను 30 శాతం తీసుకొని.. మిగితాదంతా మార్పులు చేశాం. సినిమా అద్బుతంగా వచ్చింది అని చింతపల్లి రామారావు చెప్పారు.

సినిమా ఎందుకు ఆలస్యమైందంటే?
సినిమా ఆలస్యం కావడం వెనుక ఆర్థిక ఇబ్బందులు లేవు. కాకపోతే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లో జరిగాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే.. కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా వేశాం. కోవిడ్ తర్వాత చిరంజీవి గాడ్ ఫాదర్, ఇతర పెద్ద సినిమాలు రావడం జరిగింది. అంతేకాకుండా గాడ్ ఫాదర్, రామసేతు తర్వాత సత్యదేవ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాను ఆపాం అని చింతపల్లి రామారావు అన్నారు.