twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Gandharva సూపర్‌ డూపర్ హిట్.. కథలో, క్లైమాక్స్‌లో అదే ట్విస్టు.. డైలాగ్ కింగ్ సాయికుమార్

    |

    ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై ఎస్‌కే ఫిలిమ్స్ సురేష్ కొండేటి స‌హ‌కారంతో యాక్ష‌న్ గ్రూప్ స‌మ‌ర్పిస్తున్న చిత్ర‌ం గంధర్వ. సందీప్ మాధ‌వ్‌, గాయ్ర‌తి ఆర్‌. సురేష్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ద్వారా అప్స‌ర్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ సుభాని నిర్మించారు. జూలై 8 తేదీన విడుద‌లవుతున్న ఈ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో డైలాగ్ కింగ్ సాయికుమార్‌ ఈ సినిమాలోని తన పాత్ర గురించి మాట్లాడుతూ..

    డైరెక్టర్ సైన్యంలో పనిచేసిన వ్యక్తి

    డైరెక్టర్ సైన్యంలో పనిచేసిన వ్యక్తి

    సైన్యంలో పనిచేసి వచ్చిన వ్యక్తి అప్సర్ దర్శకత్వం వహించారు. దర్శకుడు వీరశంకర్ ఓ రోజు ఫోన్ చేసి అప్సర్ కథ చెబుతాడు వినండి అని చెప్పారు. అయితే కొత్త వాడైనప్పటికి అప్సర్ చెప్పిన కథ విని కనెక్ట్ అయ్యాను. గంధ‌ర్వ‌ మూవీలో అంతా కొత్త‌వారైనా క‌థ‌లోని ఎమోష‌న్స్‌, ఫీలింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. క‌లికాలంలో ఓ సీన్ వుంటుంది. నాన్న చనిపోయాడు అనుకుంటాం. తిరిగి వ‌స్తే ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. గంధ‌ర్వ‌లో అలానే వుంటుంది. ఈ పాయింట్‌ను ద‌ర్శ‌కుడు అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు అని సాయికుమార్ తెలిపారు.

    కథను నమ్మే కొత్త దర్శకుడితో

    కథను నమ్మే కొత్త దర్శకుడితో

    క‌న్న‌డ‌లో రంగీ త‌రంగా అనే మూవీ చేశాను. ఆస్కార్ దాకా వెళ్ళింది. నేను ఆ సినిమా చేశాక కొత్త‌వాడితో ఎలా చేశావ్! అని న‌న్ను చాలామంది అడిగారు. క‌థ‌ను న‌మ్మాను అన్నాను. అలా కథను నమ్మి చేసిన చిత్రమే గంధర్వ. నేను పోలీస్ స్టోరీ చేసి 25 ఏళ్ల‌యింది. ఈ రోజుకీ ఇంకా ఆ సినిమాను గుర్తుపెట్టుకొని ప్రేక్ష‌కులు ప‌లుక‌రిస్తున్నారు. ఇప్పుడు సీక్వెల్ చేయ‌డానికి క‌మ‌ల్ హాస‌న్ విక్ర‌మ్ సినిమా కిక్ ఇచ్చింది. అండ‌ర్ ప్లే, డ్రామా.. ఇలా ప్ర‌తీదీ నేను చేశాను. అలాంటి కొత్త ప్ర‌య‌త్న‌మే గంధ‌ర్వ సినిమాలోని నా పాత్ర ఉంటుంది అని సాయికుమార్ అన్నారు.

    కొత్త కాన్సెప్ట్‌‌తో సినిమా

    కొత్త కాన్సెప్ట్‌‌తో సినిమా

    పాత, కొత్త జ‌న‌రేష‌న్ హీరోల‌తో న‌టించ‌డం గొప్ప అనుభూతి. సందీప్ చేసిన జార్జిరెడ్డి, ఇతర సినిమాలు చూశాను. సందీప్ టాలెంటెడ్‌ యాక్టర్. కొత్త జ‌న‌రేష‌న్‌లో స‌త్య‌దేవ్, ప్రియ‌ద‌ర్శితో నేను చేస్తున్నా. వారి పెర్ఫార్మెన్స్‌కు అనుగుణంగా నేను మార్చుకుని చేస్తున్నా. అలాగే గంధ‌ర్వ‌లో సందీప్‌తో చేశా. టైటిల్‌కు త‌గ్గ‌ట్టు కొత్త కాన్సెప్ట్ ఫిలిం అని సాయికుమార్ తెలిపారు.

     ఊహించని ట్విస్టులు నా పాత్ర ద్వారా

    ఊహించని ట్విస్టులు నా పాత్ర ద్వారా

    గంధ‌ర్వ‌ చిత్రం 1971 నుంచి 2021 వరకు సాగే టైమ్ ట్రావెల్ కథ. గంధ‌ర్వ‌లో కూడా ఎవ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ నా పాత్ర‌లో ఉంటుంది. నేను పొలిటీషియ‌న్‌. ముఖ్యమంత్రి కావాలని కలలు కంటుంటాను. సరిగ్గా ఆ సమయంలో నా తండ్రి అంటూ సందీప్ మాధ‌వ్ నా జీవితంలోకి వ‌స్తాడు. మా అమ్మ‌కు, ఈయ‌న‌కు ఉన్న రిలేష‌న్ ఏమిట‌ని సందీప్ కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడు. మా కథను మీడియా హైలైట్ చేస్తుంది. క‌థ‌లో ట్విస్ట్ ఏమిటనేది తెరపైన చూడాల్సిందే అని సాయికుమార్ చెప్పారు.

     సినిమా ముగింపు జాగ్రత్తగా డీల్

    సినిమా ముగింపు జాగ్రత్తగా డీల్

    సినిమాను చూసే విధానం ప్రేక్షకుల్లో మారింది. మేథావుల్లా, సినీ విమర్శకుల ఆలోచిస్తున్నారు. సినిమా ముగింపును జాగ్రత్తగా చెప్పాలని దర్శకుడికి చెప్పాను. క్ల‌యిమాక్స్‌లో సైంటిఫిక్‌గా ఉంటూనే అంద‌రినీ మెప్పించేలా చేశాడ‌ని నేను సురేష్ కొండేటి ద్వారా విన్నాను. ఆయ‌న సినిమా చూసి సూప‌ర్‌ డూప‌ర్ హిట్ అవుతుంద‌న్నారు.

    ఇదే అభిప్రాయాన్ని డ‌బ్బింగ్ చెప్పిన‌వాళ్ళు సందీప్ మాధ‌వ్‌, జ‌య‌సింహ కూడా చెప్పారు. ఇంట‌ర్వెల్‌లో మంచి ట్విస్ట్ ఉంటుంది. ఓ ప‌జిల్ కూడా వుంటుంది. మ‌నిషిని పోలిన మ‌నుషులు ఏడుగురు ఉంటార‌నుకుంటాం. ఆ విషయాన్ని లాజిక్‌గా ద‌ర్శ‌కుడు ముడివిప్పిన విధానం చాలా బాగుంది.

    English summary
    Actor Saikumar's latest movie is Gandharva. Sandeep Madhav and Gayatri are in lead roles. Here is Saikumar reveals interesting experiences in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X