For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఖాళీ సమయాల్లో అలాంటి వీడియోలు చూస్తా.. సంపూర్ణేష్ బాబు ఊహించిన జవాబు!

  |

  హృదయ కాలేయం చిత్రంతో ప్రేక్షకుల హృదయాల్లో స్థిరమైన స్థానం సంపాదించుకొన్న సంపూర్ణేష్ బాబుకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. సంపూ సినిమా వస్తుందంటే అందరిలోను ఓ అటెన్షన్ ఉంటుంది. తన నటనతో, డ్యాన్సులతో, డైలాగ్స్‌తో మెప్పిస్తున్న సంపూర్ణేష్ బాబు తాజాగా బజారు రౌడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే తన జీవితం గురించి, సమాజం గురించి అనేక విషయాలు వెల్లడిస్తూ ఆయన ఎమోషనల్ అయ్యారు. సినిమా కంటే సమాజంలోని పరిస్థితులను వెల్లడిస్తూ..

  పిల్లల భవిష్యత్ అందోళనకరంగా

  పిల్లల భవిష్యత్ అందోళనకరంగా

  ప్రస్తుతం సమాజంలో చిన్న పిల్లల భవిష్యత్ ఆందోళనకరంగా మారింది. చిన్న పిల్లలు సెల్‌ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. వారికి అదే ప్రపంచంగా మారింది. ఫోన్లకే పరిమితం కావడం వల్ల వారిలో సమయస్పూర్తి, ఆలోచన విధానం కొరవడే ప్రమాదం ఏర్పడింది. దాంతో వారిలో మానసిక ఎదుగుదల ఆగిపోతున్నది. ప్రపంచాన్ని శాసించే అధినేతలు కూడా సెల్‌ఫోన్‌కు బానిసై పోతున్నారు అని సంపూర్ణేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు.


  Anchor Shyamala చిలిపిగా కవ్విస్తూ.. అందంతో ఆకట్టుకొంటున్న బిగ్‌బాస్ బ్యూటీ

   తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధం

  తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధం

  ప్రస్తుతం పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ప్రేమానురాగాలు కనుమరగయ్యే పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు చెబితే వినని పరిస్థితి కనిపిస్తుంది. గతంలో పదో తరగతి చదివే పిల్లల్ని ఏదైనా అడిగితే ఫలానా చోటుకి వెళ్లానని చెప్పారు. కానీ ఇప్పుడు పిల్లల్లో అలాంటి పరిస్థితి అరుదుగా కనిపిస్తుంటుంది. ఓ ఉన్నత ఆఫీసర్ ఇంట్లో తండ్రి, కొడుకుల మధ్య జరిగిన సంభాషణ ఆకట్టుకొన్నది. వారి మధ్య ఇప్పుడు ఫ్రెండ్లీ వాతావరణం కనిపించడం నాకు ఆశ్చర్యం కలిగింది.

  లక్ష్యాన్ని చేరుకోవడానికి కలలు కనాల్సిందే..

  లక్ష్యాన్ని చేరుకోవడానికి కలలు కనాల్సిందే..

  తామకు తాము ఎదగడానికి కలలు కనాల్సిందే. కలలు కనడం వల్లే తమ లక్ష్యాన్ని చేరుకొంటారు. కలలు కనడం వల్ల ఖర్చు లేదు కదా అని సంపూ అన్నారు. మనం ఏది అనుకొంటే తప్పకుండా జరుగుతుంది. మనస్పూర్తిగా కోరుకొంటే తప్పక జరుగుతుంది అని సంపూ పేర్కొన్నారు.

  Anita Hassanandani: పెళ్ళయి పిల్లాడున్నా తగ్గని నువ్వు నేను హీరోయిన్...మాల్దీవుల్లో మత్తెక్కిస్తూ!

  నిర్మాత సహకారం గొప్పగా ఉంటుంది

  నిర్మాత సహకారం గొప్పగా ఉంటుంది

  ఉదాహరణకు బజారు రౌడి నిర్మాత కూడా పట్టుదలగా, అంకితభావంతో పనిచేశారు. సినిమా పరిశ్రమలో సక్సెస్ అవుతాను. ఓటమి ఉండదు. నేను అనుకొన్నది సాధిస్తాననే ధీమాను వ్యక్తం చేయడం నాలో కాన్ఫిడెన్స్‌ను పెంచింది. నాలాంటి చిన్న నటుడి పక్కన పెద్ద నటులను, సాంకేతిక నిపుణులను పెట్టి సినిమా చేశారు. మహేశ్వరి మంచి డ్యాన్సర్. నేను చిరంజీవి ఫ్యాన్‌ను. డ్యాన్స్ ఆయనను చూసి నేర్చుకొన్నాను. కానీ ఆయన గ్రేస్ గొప్పగా ఉంటుంది. ఆయనకే సాధ్యం అని సంపూర్ణేష్ బాబు చెప్పారు.

  Mahesh Babu's Goa Trip Photos: సితార, మంజుల, వంశీ పైడిపల్లి హంగామా.. జెట్ విమానంలో ఫోటోలు వైరల్

  Bazaar Rowdy Movie Hero Sampoornesh Babu Exclusive Interview | Part 3
  సమయం చిక్కితే ఆ వీడియోలు చూస్తా

  సమయం చిక్కితే ఆ వీడియోలు చూస్తా

  నా లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నేను భిన్నంగా ఉండాలని ప్రయత్నిస్తాను. నా జీవితం, నేను వచ్చిన పరిస్థితులు నాలో అనేక ఆలోచనలను రేకిస్తాయి. అందుకే నేను ఖాళీగా ఉన్నప్పడు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి ప్రవచనాలు వింటాను. ఇంకా సమయం చిక్కితే.. జేడీ లక్ష్మీనారాయణ స్పీచ్‌లు వింటాను. నేను యూత్‌ను కలిసినప్పుడు గానీ. పిల్లల్ని కలిసినప్పుడు గానీ వాళ్ల స్పీచ్‌లు, ప్రవచనాలు వినమని చెబుతుంటాను. వాటిని వింటే వెంటనే అర్దం కావు. కానీ కొన్ని రోజులు వింటూ పోతుంటే పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఒక సాత్విక భావం వస్తుంది. అలాంటి వస్తే ఏదైనా సాధించవచ్చు. ఏది సాధించ లేకపోయినా ఆనందంగా ఉండటానికి అవకాశం కలుగుతుంది.

  English summary
  Actor Sampoornesh speaks about life Philosophy. He reveals about JD Lakshminarayana, garikapati, Chaganti speeches.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X