For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అత్యాశకు వెళ్లి.. అలా మోసపోయాను.. జీవితంలో మోసపోతూనే.. సత్యదేవ్

  |
  Bluff Master Hero Satya Dev Exclusive Interview With Filmibeat Telugu

  జ్యోతిలక్ష్మితో హీరోగా టాలీవుడ్‌లోకి ప్రవేశించిన సత్యదేవ్ విభిన్నమైన పాత్రలను ఎంచుకొంటూ ముందుకెళ్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన షతురంగ వేట్టై చిత్రం రీమేక్‌గా రూపొందిన బ్లఫ్ మాస్టర్ చిత్రంలో ప్రస్తుతం నటించాడు. ఈ చిత్రంలో అందాల తార నందితా శ్వేత జంటగా నటించింది. కమెడియన్ పృథ్వీ కీలక పాత్రలో నటించాడు. జీవితంలో ప్రతినిత్యం జరిగే మోసాల ఆధారంగా సినిమా కథ సాగుతుంది. ఈ సినిమా డిసెంబర్ 28న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో సత్యదేవ్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. ఆయన చెప్పినదేమిటంటే..

  అత్యాశకు వెళ్లి మోసపోయా

  అత్యాశకు వెళ్లి మోసపోయా

  నేను ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలన్న ఆశతో మల్టీలెవెల్ మార్కెటింగ్ (చైన్ మార్కెటింగ్)‌లో చేరాను. నేను అత్యాశకు పోయి రెండు లెగ్‌లు కొన్నాను. ఆ తర్వాత ఆ కంపెనీ బిచాణా ఎత్తేసింది. దాంతో నేను మోసపోయానని తెలుసుకొన్నాను. ఎప్పుడూ జీవితంలో ధనవంతుడు బాగానే ఉంటాడు. దిగువ తరగతి వర్గం బాగానే ఉంటుంది. బాగా మోసపోయేది మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్లే.

  మోసపోయేతత్వం అందరిలోనూ

  మోసపోయేతత్వం అందరిలోనూ

  బేసిక్‌గా మోసపోయేతత్వం అందరిలో ఉంటుంది. బ్లఫ్ మాస్టర్ చిత్రం ద్వారా ప్రధానంగా చెప్పాలనుకున్నదేమిటంటే.. జీవితంలో డబ్బే ప్రధానం కాదు.. ప్రేమ కూడా ముఖ్యమైందే అని అవని (నందిత శ్వేత) ద్వారా చెప్పాం. అలాంటి అత్యాశకు వెళ్లిన యువకుడు మళ్లీ ఎలా రియలైజ్ అయ్యారు అనేదే ఈ సినిమా కథ.

  ఆ నటుడి లైఫ్ దుర్భరం.. గేట్ వద్ద గెంటేశారు.. కృష్ణను కలిసిన రెండో రోజే మరణం.. పృథ్వీ

  రకరకాల పాత్రలు, గెటప్స్‌తో

  రకరకాల పాత్రలు, గెటప్స్‌తో

  బ్లఫ్ మాస్టర్ చిత్ర కథలో రకరకాల గెటప్ ఉన్నాయి. రకరకాల పాత్రలతో ప్రజలను మోసగిస్తాడు. మోసాలతో కూడిన ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకొంటాయి. ఈ సినిమాలో థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ పాత్ర ధనశెట్టి హాస్యాన్ని పండిస్తుంది.

  దర్శకుడు గోపి గణేష్ గురించి

  దర్శకుడు గోపి గణేష్ గురించి

  బ్లఫ్ మాస్టర్ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా దర్శకుడు గోపి గణేష్ గురించి చెప్పుకోవాలి. సినిమా తప్ప మరోటి ఆలోచించలేదు. సినిమా కోసమే బతికాడు. ఆ తర్వాత అభిషేక్ ఫిలింస్ అధినేత, నిర్మాత రమేశ్ పిళ్లై గురించి, ఆ తర్వాత శ్రీదేవి మూవీస్, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గురించి చెప్పాలి. ఈ ముగ్గురు పోషించిన పాత్ర సినిమాకు కీలకం. వారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

  పూరీ జగన్నాథ్ ఆఫర్‌తో జీవితం మలుపు

  పూరీ జగన్నాథ్ ఆఫర్‌తో జీవితం మలుపు

  జ్యోతిలక్ష్మీ చిత్రానికి 500 మంది ఆడిషన్స్ వెళితే నాకు అవకాశం లభించింది. ఆ సమయంలో నేను 90 కేజీల బరువు ఉండేవాడిని. పూరీ జగన్నాథ్ బరువు తగ్గమని చెప్పారు. అలా 16 కేజీల బరువు తగ్గిన తర్వాత నీవే హీరో అని చెప్పారు. దాంతో నా సినిమా కెరీర్ మరో మలుపు తిరిగింది. అంతరిక్షం లాంటి సినిమాల్లో నటించే అవకాశం లభించింది. హీరోగానే కాదు.. కథాపరంగా ప్రాధాన్యం ఉంటే పాత్రల్లో కూడా నటిస్తున్నాను. ప్రస్తుతం గువ్వా గోరింక, 47 రోజులు, ఓ హిందీ సినిమాలో నటిస్తున్నాను.

  English summary
  Nandita Swetha will be seen sharing the screen space with Satyadev in Bluff Master in the direction of Gopi Ganesh Pattabhi. The film is remake of Kollywood hit Chaturanga. This movie set to release on December 28th. In this occassion, Hero Satya Dev Spoke to the Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X