twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమాజంలోని అరాచకాలను చూపే ప్రయత్నమే 1997 మూవీ: శ్రీకాంత్ అయ్యంగార్ (ఇంటర్వ్యూ)

    |

    డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న 1997. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 26న గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఈ సినిమాలో అవినీతి పోలీస్ అధికారిగా భిన్నమైన పాత్రలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ సినిమా విడుదల సందర్బంగా మీడియాతో శ్రీకాంత్ అయ్యంగార్ ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..

    Srikanth Iyengar about 1997 movie and Ram Gopal Varma

    ప్రశ్న: 1997 సినిమా మీరు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి ?

    జవాబు: మోహన్ గారు నేను షూటింగ్ చేస్తున్నప్పుడు సెట్స్ కొచ్చారు. ఈ కథ ఉంది చెప్పాలని, అయన ఈ కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మోహన్ గారు నన్ను బాగా కన్వెన్స్ చేసారు. ఈ కథ నచ్చడంతో చేశాను. ఈ సినిమా ముఖ్యంగా తక్కువ కులం మనుషులను ఇంకో కులం వాళ్ళు తొక్కేయాలని, లేదా నీ రంగు తక్కువ తొక్కువ, నీ దేవుడు కంటే నా దేవుడు గొప్ప అంటూ మనుషులు మనుషులుగా కాకుండా ప్రవర్తిస్తున్నారు. తక్కువ కులం వారిని తొక్కేయాలి, కానీ అదే తక్కువ కులంలో అమ్మాయి అయితే ఆమె పై మొహం కలుగుతుంది. ప్రస్తుతం మన సిస్టం బాగాలేదు. సిస్టం లో క్రైం రేట్ ఎక్కువగా ఉంది. ఒక అమ్మాయిని రేప్ చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టడం ఇలాంటి అంశాల నేపథ్యంలో సినిమా ఉంటుంది. మన సిస్టం లో ఎలాంటి లోపాలు ఉన్నాయి. సామాన్య మనుషులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అన్న పాయింట్ అప్ వ్యూ లో ఉంటుంది.

    ప్రశ్న: ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

    జవాబు: ఇందులో నేను కరెప్టెడ్ పోలీస్ అధికారిగా కనిపిస్తాను. ఈ సినిమా డబ్బింగ్ సమయంలో నా పాత్రకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఇంత దరిద్రంగా వ్యక్తులు కూడా ఉంటారా ? అని నాకే ఛి అనిపించింది. నిజంగా ఒక నీచ, దారిద్ర, నికృష్ట పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తాను. నిజంగా ఈ పాత్ర నాకు బిన్నంగా ఉన్నప్పటికీ ఆ పాత్ర తాలూకు ప్రవర్తన చూసి నాకే అసహ్యం వేసింది. అంత నీచమైన పాత్ర. కొన్ని ప్రాంతాల్లో ఆ ఊరి ఎస్సై, సి ఐ లే దేవుళ్లుగా ఫీల్ అవుతుంటారు.

    ప్రశ్న: అంటే ఇందులో కులాల గురించి చర్చిస్తున్నారా ?

    జవాబు: కాదు .. ఇందులో కేవలం ఒక మనిషి ఎలా మనిషిని అన్నది మరచిపోయి బ్రతుకుతున్నాడు. అవతలివాడిని ఎలా తొక్కాలి, నాదే పైచేయి అనాలి అన్న పాయింట్ తో రియల్ గా జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.

    ప్రశ్న : వరుసగా భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు ? కెరీర్ ఎలా ఉంది ?

    జవాబు: నా నలభై ఏడేళ్లకు నాకు బ్రేక్ వచ్చింది. ముఖ్యంగా బ్రోచేవారెవరురా సినిమాతో నాకు సక్సెస్ దక్కింది. ఆ తరువాత పలు సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో చేస్తున్నాను. హీరో, హీరోయిన్స్ ఫాదర్ రోల్స్, డాక్టర్ గా, పాజిటివ్ తో పాటు నెగిటివ్ రోల్స్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు బాగుంది.

    ప్రశ్న: నటన పరంగా ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి ?

    జవాబు: చాలా మంచి పాత్రలే వస్తున్నాయి, కానీ మూడు తిమింగలాలు దాటుకుని అవకాశాలు రావాలంటే కొంచెం కష్టమే. ఆ మూడు తిమింగలాలు ఒకరు ప్రకాష్ రాజ్, రెండు రావు రమేష్, మూడు మురళి శర్మ. ఈ ముగ్గురు నటులుగా ఆకాశం అంత ఎత్తులో ఉన్నారు. వాళ్ళను దాటుకుని మనకు ఛాన్సులు రావాలంటే కొంచెం టైం పడుతుంది. నాకు ప్రకాష్ రాజ్ నటన అంటే ఇష్టం. అయన నా పర్సనల్ దేవుడు. అలాగే కమల్ హాసన్ నటన కూడా చాలా ఇష్టం .

    ప్రశ్న: దర్శకుడిగా మోహన్ ఎలా తీసాడు ?

    జవాబు: మోహన్ దర్శకుడిగా చాలా చక్కగా పనిచేసాడు. చాలా నిజాయితీగా పనిచేసాడు. ఎక్కడ ఎలా ఉండాలి, సినిమా మొత్తం నేనే కనిపించాలి అన్న ఇంటెన్షన్ లేకుండా ముఖ్యంగా కొత్త దర్శకుడు అన్న టెన్షన్ ఎక్కడా లేకుండా చేసాడు. తప్పకుండా దర్శకుడిగా, నటుడిగా మోహన్ కు మంచి పేరొస్తుంది.

    ప్రశ్న: ఎక్కువగా వర్మ తో సినిమాలు చేసారు ?
    జవాబు: నా గాడ్ ఫాదర్ వర్మ గారే. కరోనా సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు వర్మ ఫోన్ చేసి శ్రీకాంత్ ఇప్పుడు ఖాళీగా ఉన్నావా అని అడిగితె అవును సర్ అన్నాను. సరే అని అయన రెండు సినిమాల్లో నటింప చేసాడు. ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే నలభై ఐదు సినిమాల్లో నటించాను. అలాగే కన్నడలో రెండు సినిమాలు చేశాను. వెబ్ సిరీస్ లు కూడా చేశాను. ఏ అవకాశం వచ్చినా వదిలేదు లేదు.

    ప్రశ్న : ఈ సినిమాలో డైలాగ్ విషయంలో ఎక్కువగా వినిపిస్తుంది ?
    జవాబు: డైలాగ్స్ చాలా బాగున్నాయి. రచన శైలి అంటారు కదా.. అలా చాలా అద్భుతంగా ఉంటాయి. పాత్ర పరంగా ఉంటాయి , ఎదో పంచ్ డైలాగ్ వెయ్యాలి అన్న ఆలోచనతో కాదు నాచురల్ గా డైలాగ్స్ ఉంటాయి. దాంట్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది.

    ప్రశ్న: ఫైనల్ గా 1997 సినిమా సమస్యలను చూపించే ప్రయత్నం చేసారా ? లేక దానికి సొల్యూషన్ చెప్పారా ?
    జవాబు: ఈ రోజుల్లో మారమంటే ఎవరు మారతారు చెప్పండి. ఒక సినిమా విడుదలైతే ప్రతి ఒక్కరు సినిమా ఇలా ఉంది, కెమెరా ఇలా ఉంది, ఫ్రేమ్ ఇలా ఉందంటూ విమర్శిస్తుంటారు .. కానీ వాళ్లకు ఇందులో ఏవి తెలియదు, కెమెరా గురించి అసలు తెలియదు, డైరెక్షన్ రాదు కానీ అన్ని తెలుసన్నట్టుగా మాట్లాడేస్తుంటారు. అలాగే ఈ సినిమాలో ప్రస్తుతం జరుగుతున్న సమస్యల గురించి చెప్పే ప్రయత్నం చేశారు.

    English summary
    Actor Srikanth Iyengar about 1997 movie and Ram Gopal Varma డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న 1997.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X