Srikanth interview చిరంజీవి మూవీలో విలన్‌గా ఆఫర్ వస్తే.. శ్రీకాంత్ అదిరిపోయే జవాబు!

తమిళ సూపర్ స్టార్, ఇళయ దళపతి విజయ్, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం చిత్రం వారిసు (తెలుగులో వారసుడు). తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ..

 తొలిసారి తమిళంలో సినిమా

తొలిసారి తమిళంలో సినిమా

నా కెరీర్‌లో తమిళ సినిమా చేయడం ఇదే తొలిసారి. నాకు గతంలో తమిళం నుంచి ఆఫర్లు రావడం జరిగింది. కానీ తెలుగులో బిజీ ఉండటం వల్ల కొన్ని ఆఫర్లు రిజెక్టు చేశాను. వారసుడు సినిమా ఆఫర్ గురించి దిల్ రాజు కాల్ చేసి చెప్పాడు. ఆ తర్వాత నేను వంశీ పైడిపల్లి కలిసి సబ్జెక్ట్ డిస్కస్ చేశాం. నా క్యారెక్టర్ గురించి చెప్పిన తర్వాత నేను ఒకే చెప్పాను. ఈ సినిమాలో నేను, కిక్ శ్యామ్, విజయ్ బ్రదర్స్‌గా నటిస్తున్నాం. అయితే అఖండ తర్వాత నన్ను చూసి ఆయన షాక్ అయ్యారు. ఇంతలావుగా ఉన్నాడని అంటే.. నా లేటేస్ట్ ఫోటోలు చూపించడంతో విజయ్ ఒకే చేశారు అని శ్రీకాంత్ తెలిపారు.

ఎమోషనల్‌గా సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

ఎమోషనల్‌గా సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్


వారసుడు (Varisu) పక్కా ఎమోషనల్స్‌తో చేసిన ఫ్యామిలీ కథ. ఈ చిత్రంలో కిక్ శ్యామ్, జయసుధ, ప్రకాశ్ రాజ్, రష్మిక మందన్న లాంటి తెలుగుతో పరిచయం ఉన్న నటీనటులు ఉన్నారు. ఈ సినిమాలో నాది పాజిటివ్ క్యారెక్టర్. విలన్ పాత్ర అని చెప్పలేం. కాకపోతే పక్కా ఫ్యామిలీ, బ్రదర్స్, వదినలు, ఫ్యామిలి మెంబర్స్ కలిసి ఉండే బృందావనం లాంటి సినిమా. ఈ మధ్య విజయ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన సినిమా చేయలేదు. అలాంటి సమయంలో వంశీ పైడిపల్లి కథ చెప్పడం, ఆయనకు నచ్చడంతో వారిసు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మొదటి నుంచి చివరి సీన్ వరకు నా రోల్ ఉంటుంది అని వారసుడు సినిమా గురించి శ్రీకాంత్ చెప్పారు.

 హ్యుమన్ ఎమోషన్స్‌తో దృశ్య కావ్యంలా

హ్యుమన్ ఎమోషన్స్‌తో దృశ్య కావ్యంలా


వారసుడు' అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అద్భుతమైన హ్యుమన్ ఎమోషన్స్ ఉంటాయి. సినిమా ఒక దృశ్యకావ్యంలా వుంటుంది. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో చేసినప్పటికీ ఇది పక్కా తెలుగు సినిమాలానే ఉంటుంది అని శ్రీకాంత్ తెలిపారు.

అఖండ తర్వాత గ్యాప్ ఎందుకంటే?

అఖండ తర్వాత గ్యాప్ ఎందుకంటే?


అఖండ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్ర చేసిన తర్వాత డిఫరెంట్ సినిమా చేయాలని చూస్తున్నాను. ఆ క్రమంలో ఎంచుకొన్న సినిమాలే వారిసు, శంకర్ సినిమా. ఈ రెండు చిత్రాల్లో నేను చేసేవి విభిన్నమైన పాత్రలు. అఖండ తర్వాత జేమ్స్ చేశాను. అల్లు అరవింద్ నిర్మించే సినిమాలో నటిస్తున్నాను. అఖండ తర్వాత రిలీజయ్యే సినిమా వారసుడు. నాకు కథలు, పాత్రల గురించి పెద్దగా పట్టింపు లేదు. పెద్ద బ్యానర్, మంచి రోల్ ఉంటే చేయాలని అనుకొన్నాను అని శ్రీకాంత్ తెలిపారు.

చిరంజీవి మూవీలో విలన్‌గా

చిరంజీవి మూవీలో విలన్‌గా


బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో విలన్‌గా చేశాను. చిరంజీవితో కలిసి నటించి చాలా కాలమైంది. చిరంజీవి పిలుస్తే వెళ్లి సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను. అయితే చిరంజీవి సినిమాలో విలన్ పాత్ర ఆఫర్ వస్తే.. చేయడం కష్టమే. అది ఆలోచించాల్సిన విషయమే. బ్రదర్, ఇతర పాత్రలంటే చేయవచ్చు. విలన్ అంటే చాలా కష్టమే. చిరంజీవిని అరేయ్ ఒరేయ్ అనడం నా వల్ల కాదు. అలాంటి పాత్ర చేయాల్సి వస్తే.. సీన్ షూటింగ్ అయిపోయిన తర్వాత చేతులెత్తి దండం పెట్టి క్షమించమని కోరుతాను అని శ్రీకాంత్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X