Mirai Part 2: మిరాయ్ పార్ట్ 2.. కథ లీక్ చేసిన మంచు మనోజ్.. ఏంటంటే?

కొన్నాళ్లుగా చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సినిమాలకు దర్శక నిర్మాతలు సీక్వెల్స్ ను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా ప్రేక్షకుల ముందుకు మిరాయ్ చిత్రం వచ్చింది. ఈ యాక్షన్ అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్ ఫిల్మ్ సెప్టెంబర్ 12న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో గ్రాండ్ గా విడుదలైంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుతుండటం విశేషం.

మిరాయ్ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా లీడ్ లో నటించారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించడం విశేషం. స్టార్ హీరోయిన్ శ్రియా కీలక పాత్రలో నటించారు. అలాగే జగపతి బాబు, జయరామ్, పవన్ చోప్రా, రాజేంద్రనాథ్ ముఖ్య పాత్రల్లో నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించింది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్, కీర్తి ప్రసాద్ సినిమాను గ్రాండ్ గా రూపొందించారు.

Teja Sajja Mirai Movie prat 2

మిరాయ్ చిత్రం రూపొందించడానికి నటీనటుల రెమ్యునరేషన్, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలు అన్నీ కలుపుకొని రూ.40 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. తొలిరోజు మిరాయ్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్ల వరకు వసూళ్లు అందే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మిరాయ్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు అందిస్తుందో చూశాక, మిరాయ్ కి పార్ట్ 2 కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నారంట మేకర్స్.

మిరాయ్ పార్ట్ 2పై ఇటీవల ఇంటర్వ్యూలో మంచు మనోజ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. మిరాయ్ చిత్రంలో తను పోషించిన పాత్ర చాలా పెద్దదని చెప్పారు. తన పాత్ర అద్భత శక్తులను కూడగట్టేందుకు ప్రయత్నిస్తుందని చెప్పుకొచ్చారు. కథ ప్రకారం చిత్రంలో 9 గ్రంథాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని, అలా 9 గ్రంథాలను దక్కించుకుంటే రావణసురుడితో సమానమైన శక్తులు వస్తాయని తెలిపారు. దాంతో 10 తలల రావణుడిగా మారిపోయే పాత్ర అది అని చెప్పారు.

ఇక రావణుడిని వధించేది రాముడే కాబట్టి సినిమాలో రాముడి పాత్ర కనిపించిందని చెప్పారు. అంతే కాకుండా మిరాయ్ పార్ట్ 2నే కాకుండా 3, 4, 5 కూడా వస్తూనే ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం మేకర్స్ అధికారికంగా మిరాయ్ పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందనేది మాత్రం వెల్లడించ లేదు. మున్ముందు ఎలాంటి అప్డేట్ వస్తుందో అనేది చూడాలి. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. గౌర హరి అద్భుతమైన సంగీంత అందించారు.

More from Filmibeat

Read more about: teja sajja mirai tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X