The Rajasaab: అన్ని లెక్కలు మారుతాయి.. ప్రభాస్ రాజాసాబ్ పై తమన్ రివ్యూ
Thaman Review on The Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది 'కల్కి'సినిమాతో పలుకరించారు. ఈ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ మూవీ సక్సెస్ తరువాత తాజాగా 'ది రాజాసాబ్'సినిమాతో ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హార్రర్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ఫోటోలు, గ్లింప్స్ ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా సినిమాపై సక్సెస్ పుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరింత హైప్ క్రియేట్ చేశారు. తనదైన స్టైల్ లో ప్రభాస్ రాజాసాబ్ మూవీ రివ్యూ చెప్పేశారు. ఇంతకీ ఏమన్నారంటే?
రాజా సాబ్ సినిమా మారుతి దర్శకత్వంలో రోమాంటిక్ కామెడీ హరర్ జానర్ లో రూపొందుతోంది. ప్రధాన పాత్రల్లో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హార్రర్ అండ్ కామెడీ థ్రిల్లర్ ను డిసెంబర్ 5 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. వినోదం, రొమాంటిక్, కామెడీ, హరర్ కలిసిన ఈ సినిమా ట్రైలర్ విడుదలతో హైప్ మరింత పెరిగింది.

ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందన్న విషయంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్‌పై అధికారిక ప్రకటన చేశారు. ప్రకారం, ట్రైలర్ సెప్టెంబర్ 29, సాయంత్రం 6 గంటలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ప్రభాస్, సంజయ్ దత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోస్టర్‌లోని క్యాప్షన్ ఇలా ఉంది: "లక్షలాది మంది నిరీక్షణకు ముగింపు. వినోదం, భయం, ఎన్నో గంభీర అనుభవాల కోసం సిద్ధంగా ఉండండి. ఈ ప్రపంచంలోకి రాయల్ ఎంట్రీ." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ రాజాసాబ్ సినిమాపై అంచనాలు పెంచేశాడు. తనదైన స్టైల్ లో మూవీ రివ్యూ చెప్పేసి అంచనాలను అమాంతం పెంచేశాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ సరికొత్త ప్రయోగమనీ, ఇకపై మారుతి డైరెక్షన్ గురించి చెప్పాలంటే బిఫోర్ రాజా సాబ్.. ఆఫ్టర్ రాజా సాబ్ గా అంటారన్నారు. మారుతి మామూలు సినిమా తీయలేదనీ, మారుతి కెరియర్ లోనే కాకుండా రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లో కూడా ఓ మైలు స్టోన్ గా నిలిచిపోతుందన్నారు. రాజా సాబ్ పై ఇప్పటివరకు అంచనాలు లేకున్నా.. రేపు రిలీజ్ కాబోతున్న ట్రైలర్ తో కొన్ని లెక్కలు మారుతాయని షాకింగ్ కామెంట్ చేశారు.
అలాగే.. తాను ఎడిటింగ్ రూమ్ లో కొన్ని సీన్స్ చూసానని, ఒక్కొక్క ప్రేమలో ప్రభాస్ యాక్టింగ్ ఇరగదీసాడని పేర్కొన్నారు. సింపుల్ గా చెప్పాలంటే ప్రభాస్ యాక్టింగ్ హిలేరియస్ అనీ, ప్రభాస్ నుండి చాలా రోజుల తర్వాత హై వోల్టేజ్ పర్ఫామెన్స్ మరోసారి రాజా సాబ్ సినిమాలో చూడబోతున్నామని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్, డ్యూయెట్, ఐటమ్, థీమ్ సాంగ్ ఉన్నాయని, చాలా రోజుల తర్వాత ఒక పూర్తి ఆడియో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తమన్ చెప్పారు. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ కావడంతో ప్రభాస్ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమాతో ప్రభాస్ ఇలాంటి విజయం అందుకుంటాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











