»   » సాయిపల్లవి, నాగశౌర్య గొడవపై వరుణ్ తేజ్.. ఆమె నాతో..

సాయిపల్లవి, నాగశౌర్య గొడవపై వరుణ్ తేజ్.. ఆమె నాతో..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Varun Tej Reacts On Naga Shourya Sai Pallavi Issue

ముకుంద, కంచె చిత్రాలతో వరుణ్ తేజ్ మంచి ప్రేక్షకాదరణను మూటగట్టుకొన్నాడు. ఫిదా చిత్రంతో సక్సెస్‌తోపాటు మంచి అభిరుచి కలిగిన నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. ఫిదా తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి తొలిప్రేమ చిత్రంతో ముందుకొచ్చాడు. రాశీఖన్నాతో వరుణ్ కలిసి నటించిన చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్‌కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో వరుణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

పవన్ తొలిప్రేమకు

పవన్ తొలిప్రేమకు

పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాతో నేను నటించిన తొలిప్రేమకు కథాపరంగా ఎలాంటి సంబంధం లేదు. 20 ఏళ్ల క్రితం బాబాయ్ నటించిన తొలిప్రేమ అప్పటి జనరేషన్ అభిరుచులకు, ట్రెండ్‌కు తగినట్టుగా రూపొందించారు. ఇప్పుడు జనరేషన్ మారింది. ఈ తొలిప్రేమను ఇప్పటి జనరేషన్‌కు అనుగుణంగా రూపొందించాం.

ఇప్పటి జనరేషన్‌కు తగినట్టుగా

ఇప్పటి జనరేషన్‌కు తగినట్టుగా

పాత తొలిప్రేమను టెలివిజన్‌లో చూడటం తప్ప థియేటర్లకెళ్లి చూసినవారెవరూ లేరు. ఇక మా తొలిప్రేమ సినిమా ఇప్పటి జనరేషన్‌కు అనుగుణంగా రూపొందింది. అప్పటి జనరేషన్‌లో హీరో రక్తంతో ప్రేమలేఖ రాసి ఇస్తాడు. ఇప్పడు టెక్నాలజీకి అనుగుణంగా యువతి, యువకుల్లో తొలి ప్రేమ ఎలా చిగురించింది అనే అంశాలతో ఈ సినిమా రూపొందింది.

తొలి ప్రేమ టైటిల్ గురించి

తొలి ప్రేమ టైటిల్ గురించి

తొలిప్రేమ అనే టైటిల్‌ అనేది మా సినిమా కథకు చక్కగా సరిపోతుంది. టైటిల్ ఏదో పెట్టాలని పెట్టలేదు. టైటిల్ పెట్టుకొంటున్నామని పవన్‌తో చర్చించలేదు. మా ఫ్యామిలీలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ప్రస్తుతం తొలిప్రేమ టైటిల్‌ ఉషాకిరణ్ మూవీస్ వద్ద ఉందని తెలుసుకొని సంప్రదించగా వారు ఆ టైటిల్‌ను మాకు ఇచ్చారు.

ఫిదా కథకు పోలిక ఉండదు

ఫిదా కథకు పోలిక ఉండదు

ఫిదా సినిమాకు తొలిప్రేమ సినిమా లవ్‌స్టోరికి ఎక్కడా పోలీక ఉండదు. ప్రేమమ్ సినిమా కథకు కూడా దారిదాపుల్లో ఉండదు. లండన్‌లో షూట్ చేసిన సన్నివేశాలు నాకు ఈ సినిమాలో బాగా నచ్చాయి. కాలేజ్ సీన్లలో నటించేటప్పుడు హ్యాపీగా అనిపించింది. మళ్లీ కాలేజ్‌కు వెళ్లామా అనే ఫీలింగ్ కలిగింది.

అఫైర్లకు దూరంగా ఉండేవాడిని

అఫైర్లకు దూరంగా ఉండేవాడిని

కాలేజ్‌లో ఉన్నప్పుడు లవ్, అఫైర్లు అనే విషయాలకు దూరంగా ఉండేవి. ఈ సినిమాలో నటించేటప్పుడు అలాంటి విషయాలు గుర్తుకు రాలేదు. నిజజీవితంలో అఫైర్లు అనేవి నాకు లేవు. వాలంటైన్ లాంటి సమయంలో అమ్మాయిలతో తిరిగిన దాఖలాలు లేవు. నలుగురం ఫ్రెండ్స్ కలిసి వెళ్లి ప్రేమికులను చూస్తూ గడిపే వాళ్లం.

లవ్ బ్రేకప్‌లో చిన్న చిన్న

లవ్ బ్రేకప్‌లో చిన్న చిన్న

తొలిప్రేమ సినిమాలో నాకు క్లైమాక్స్ పార్ట్ విపరీతంగా ఆకట్టుకొన్నది. లవ్ బ్రేకప్‌కు పెద్ద పెద్ద కారణాలు ఉండవు. చిన్న చిన్న కారణాలతోనే ప్రేమికులు విడిపోవడం జరుగుతుంది. తొలి ప్రేమ సినిమా చేసినప్పుడు పాత్ర పరంగా నేను కూడా అలానే చేశానా అనిపించింది. ఈ చిత్రంలో నా పాత్రకు అగ్రెసివ్‌నెస్ ఉంటుంది. హీరోయిన్ పాత్ర మాత్రం మరోమారు ఆలోచించుకొని చేద్దాం అంటున్నది.

రాశీఖన్నాను అందుకే తీసుకొన్నాం..

రాశీఖన్నాను అందుకే తీసుకొన్నాం..

ఊహలు గుసగుసలాడే సినిమాలో రాశీఖన్నా చేసిన పెర్ఫార్మెన్స్ చూసి ఆమెను తొలిప్రేమకు ఎంపిక చేశాం. తొలి ప్రేమలోని హీరోయిన్ క్యారెక్టర్‌ రాశీఖన్నాకు సరిగ్గా సరిపోతుందని ఆమెను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొన్నాం. పాత్రకు తగినట్టుగా ఆమె మారిపోయింది. 5 కేజీల బరువు కూడా తగ్గింది

వెంకీ అట్లూరితో కలిసి

వెంకీ అట్లూరితో కలిసి

దర్శకుడు వెంకీ అట్లూరిపై నమ్మకంతోనే దర్శకత్వం చేసే అవకాశాన్ని ఇచ్చాను. వెంకీతో నాకు ఐదారు ఏళ్ల నుంచి పరిచయం ఉంది. నా సిస్టర్స్ చేసే వెబ్‌సిరీస్‌కు వెంకీ రచనా సహకారం అందించారు. ఆయనకు దర్శకత్వం చేసే ఆలోచన ఉందనే విషయం నాకు తెలియదు. తొలిసారి దర్శకత్వం ఎలా చేస్తాడో అనే విషయంపై కొంత సందేహం ఉంటుంది. కానీ దిల్‌రాజు వద్ద పనిచేయడంతో నాకు కొంత ధైర్యం కలిగింది.

అప్పుడు తొలిసారి ప్రేమలో

అప్పుడు తొలిసారి ప్రేమలో

వాస్తవ జీవితంలో స్కూల్ డేస్‌లో తొలిసారి ప్రేమలో పడ్డాను. ఆ తర్వాత నేను అంతగా ఆ విషయానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. సినిమాలు చూడటం తప్ప మరో ధ్యాస లేదు. ఫ్రెండ్స్‌కు అఫైర్ ఉండేవి. వాళ్లు ఇప్పుడు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు. మా నాన్న కారణంగా నాకు వరల్డ్ సినిమా పరిచయమైంది.

ఓవర్సీస్‌లో మంచి టాక్

ఓవర్సీస్‌లో మంచి టాక్

ఓవర్సీస్‌లో తొలి ప్రేమ సినిమా గురువారమే రిలీజ్ అయింది. అమెరికాలో తొలిప్రేమ సినిమాకు మంచి రెస్సాన్స్ వస్తున్నది. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అభినందించారు. వాళ్ల కాలేజ్ డేస్‌, యవ్వనంలో జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చాయని చెప్పడం ఆనందంగా ఉంది. దాంతో తొలిప్రేమ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకానికి బలం చేకూరింది.

సాయిపల్లవి, నాగశౌర్య విభేదాలు

సాయిపల్లవి, నాగశౌర్య విభేదాలు

హీరోయిన్ సాయిపల్లవితో హీరో నాగశౌర్యకు కొన్ని విభేదాలు వచ్చాయనే విషయంపై వరుణ్ తేజ్ స్పందించారు. ఫిదా సమయంలో సాయిపల్లవికి నాకు ఎలాంటి విభేదాలు రాలేదు. నాతో బాగానే ప్రవర్తించింది. మా మధ్య మంచి రిలేషన్స్ ఇప్పటికీ ఉన్నాయి. సాయిపల్లవి దారుణంగా ప్రవర్తించిందని నాగశౌర్య చెప్పిన విషయంలో వారి మధ్య ఏమి జరిగిందో నాకు తెలియదు. ఆ విషయం నా దృష్టికి రాలేదు. గొడవ అనే సాయిపల్లవి, నాగశౌర్య వ్యక్తిగత విషయానికి సంబంధించిన అంశం. నేను ఆ విషయంలో మాట్లాడటం సరికాదు అని వరుణ్ సందేశ్ అని అన్నారు.

English summary
South superstar Varun Tej and actress Raashi Khanna's latest outing 'Tholi Prema' has hit the screens on February 9, 2018. The Telugu romantic drama is directed by debutant Venky Atluri and produced by B V S N Prasad. The film also stars Sapan Pabbi, Priyadarshi Pullikonda, Suhasini Maniratnam, Vidyullekha Raman and Hyper aadhi. The romantic comedy has received a positive response from fans on Twitter. This film is getting ready to release in telugu on Feb 10th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu