twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక చెంపపై కొడితే మరో చెంప వాయిస్తా.. నా ఆటిట్యూడ్ మారదు.. విజయ్ దేవరకొండ

    By Rajababu
    |

    అర్జున్‌రెడ్డి విజయం తర్వాత విజయ్ దేవరకొండ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి చిత్రం మే 9న రిలీజ్‌కు సిద్ధమైంది. త్వరలోనే టాక్సీవాలా విడుదలకు రెడీ అవుతున్నది. అలాగే మైత్రీ, బిగ్‌బెన్ బ్యానర్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నది. విజయ్ దేవరకొండ జన్మదిన సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయనున్నారు. మే9న మహానటి రిలీజ్ చేయడం నిర్మాత నిర్ణయమని, తన జన్మదినానికి సినిమా విడుదలకు ఎలాంటి సంబంధం లేదని విజయ్ వెల్లడించారు. ఈ సందర్బంగా అనేక విషయాలను వెల్లడించారు.

    Recommended Video

    Vijay DevaraKonda Has Signed A New Movie
     ఆఫర్ల కోసం వెళితే బయటకు పంపిచారు..

    ఆఫర్ల కోసం వెళితే బయటకు పంపిచారు..

    మూడు నాలుగైదు సంవత్సరాల క్రితం సినిమా ఆఫీస్‌కు వెళితే బయట నుంచే పంపిచేవాళ్లు. అలాంటిది ఇప్పుడు నా సొంత ఆఫీస్‌లోనే ప్రెస్ మీట్ నిర్వహించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నా ఆఫీస్‌కు వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ నా వెల్‌కం.

    బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం

    బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం

    నా బర్త్ డే సందర్భంగా ప్రస్తుతం ప్రెస్ మీట్ పెట్టలేదు. ముఖ్యంగా మహానటి చిత్రం గురించి, నా సినిమాల గురించి మాట్లాడేందుకు మిమ్మల్నందరినీ పిలిచాను. నాకు బర్త్ డే సెలబ్రేషన్ చేసుకోవడం ఇష్టం లేదు. బర్త్ డే కంటే నా సినిమాలు అడితే, నా నటనకు మంచి ప్రశంస లభిస్తే నేను ఎంజాయ్ చేస్తాను.

    కథలో ఎంపికలో మార్పు

    కథలో ఎంపికలో మార్పు

    నా జీవితంలో ప్రతీ దశలోనూ మారుతూ వస్తున్నాను. అర్జున్ రెడ్డి తర్వాత నాలో చాలా మార్పులు వచ్చాయి. అర్జున్‌రెడ్డి సినిమా సక్సెస్ అవుతుందని అనుకొన్నాను. ఇంత ఘన విజయం సాధిస్తుందని అనుకోలేదు. కథల ఎంపికలోనూ, సినిమాలు ఒప్పుకోవడంలో నా ఆలోచన మారింది. ఒరిజినల్‌గా ఉండే అటిట్యూట్ మారదు.

    నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా

    నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా

    చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం వచ్చినట్టు, నాకు నచ్చినట్టు ఉంటాను. బాధ్యతగా ఉండాలని నేను అనుకొను. విమర్శలను సానుకూలంగా తీసుకొంటాను. నేను చెత్తగా నటించానంటే ఒకే అనుకొంటాను. కానీ నేను ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో చెప్పితే నాకు నచ్చదు.

     తప్పేంటి? ఒప్పేంటి అని

    తప్పేంటి? ఒప్పేంటి అని

    మహానటి సావిత్రిపై చేసిన కామెంట్లపై స్పందించిన నెటిజన్లను రెచ్చగొట్టే విధంగా కామెంట్ చేయడంపై మాట్లాడుతూ.. అది నా రియాక్షన్ మాత్రమే. తప్పేంటి? ఒప్పేంటి అని జడ్జ్ చేసే శక్తి లేదు. నేను షూటింగ్‌లో బిజీగా ఉంటాను. నేను సోషల్ మీడియాలో లేను. నా ఫోన్‌లో యాప్‌ కూడా లేదు. నా టీమ్ మాత్రమే చూసుకొంటుంది. నేను పెట్టాలనుకొన్న పోస్టులను వాళ్లు పెడుతారు. కొన్నిసార్లు వాళ్లు వద్దన్నా.. నేను చెప్పాలనుకొంటున్నది చెప్పడానికి ప్రయత్నిస్తాను

    మహానటి సావిత్రి నా సినిమా కాదు

    మహానటి సావిత్రి నా సినిమా కాదు

    మహానటి చిత్రంలో మళ్లీ మళ్లీ వచ్చే సినిమా కాదు. ఇది చాలా అరుదైన సినిమా. అందుకే ఈ చిత్రంలో భాగస్వామ్యం కావాలని అనుకొన్నాను. మహానటి చిత్రంలో మా పాత్రలు చాలా కీలకమైనవి. సినిమాను నడిపించేది విజయ్ ఆంటోని (విజయ్), మధురవాణి (సమంత) క్యారెక్టర్లే. అందుకే నేను ఆ పాత్రను ఒప్పుకొన్నాను. సమంత లాంటి సీనియర్ హీరోయిన్‌తో నటించడం మంచి అనుభవం. ఆమెతో నటించే ఛాన్స్ రావడం గొప్ప అవకాశం.

    నా క్రేజ్ చూసి సినిమాకు రావడం

    నా క్రేజ్ చూసి సినిమాకు రావడం

    అర్జున్ రెడ్డి సినిమా తర్వాత నా క్రేజ్‌ను చూసి మహానటి చిత్రాన్ని చూసేందుకు వస్తే అంతకన్నా ఫూలిష్‌నెస్ ఏముండదు. మహానటి చిత్రం నా కెరీర్‌లో ప్రత్యేకమైనది. అది నా సినిమా కాదు. మహానటి సావిత్రిని చూసే సినిమాకు రావాలి. ఇక నా క్రేజ్ గురించి ఆలోచించుకొంటే.. నేను ఎవరినీ దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయను. నాకు నచ్చిన కథ, సినిమాలు చేస్తాను. అర్జున్ రెడ్డి తర్వాత నా సినిమా అంటే టాక్సీవాలా మాత్రమే.

     మహానటిలో నాది సపోర్టింగ్ రోల్

    మహానటిలో నాది సపోర్టింగ్ రోల్

    అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ ఆంటోని పాత్ర ప్యూర్‌గా సపోర్టింగ్ క్యారెక్టర్ మాత్రమే. మధురవాణి పాత్రకు సపోర్టింగ్ పాత్ర మాత్రమే. విజయ్ దేవరకొండను చూసి టికెట్ కొంటే నాకు అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. నటుడిగా నాకు లభించిన మంచి గౌరవంగా భావిస్తాను.

     జెమినీ గణేషన్ పాత్రకు అడిగారు..

    జెమినీ గణేషన్ పాత్రకు అడిగారు..

    మహానటి సినిమాలో ముఖ్యమైన జెమినీ గణేషన్ పాత్రకు నన్ను అడిగారు. దాంతో ముందు నేను భయపడ్డాను. ఆ సమయంలో రెండు సినిమాల్లో నటిస్తున్నాను. జెమినీ గణేషన్ పాత్ర చేయాలంటే ఒకే సమయంలో ఒక్క సినిమా చేస్తేనే దానికి న్యాయం చేకూరుతుంది. దర్శకుడు నాగ అశ్విన్ చెప్పిన తర్వాత సావిత్రి, జెమినీ గణేషన్ నటించిన పాత్రలు చూశాను. ఎలాగైనా ఆ సినిమా చేయాలి, దానిని ఒదులుకోవద్దు అని అనుకొన్నాను. ఆ తర్వాత దుల్కర్ చేస్తున్నాడని చెప్పడంతో చాలా రిలీఫ్‌గా ఫీలయ్యాను.

    అది బూతు పదమే

    అది బూతు పదమే

    అర్జున్ రెడ్డి చిత్రంలో బూతు పదాన్ని వాడటం కరెక్ట్. ఆ పాత్ర ద్వారా చెప్పించడం సమంజసమే. ఆ పదం బూతు అని నేనే చెబుతున్నా. బయట అలాంటి పరిస్థితి ఎదురైతే నేను అలానే బిహేవ్ చేస్తాను. నేను అలానే తిడుతాను. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించే తత్వం నాది కాదు. నెగిటివ్ క్యాంపెన్ చేయడం స్ట్రాటెజీలో భాగమే. కంటెంట్ లేకపోతే ఎలాంటి ప్రమోషన్ చేసినా లాభం ఉండదు.

     డియర్ కామ్రేడ్ ఫస్ట్‌లుక్

    డియర్ కామ్రేడ్ ఫస్ట్‌లుక్

    ప్రస్తుతం తాను టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, నోటా చిత్రాల్లో నటిస్తున్నట్టు విజయ్ దేవరకొండ తెలిపారు. మైత్రీ మూవీస్, బిగ్ బెన్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రానికి డియర్ కామేడ్ అనే టైటిల్‌ను ఖారారు చేశారు. పెళ్లి చూపులు నిర్మాతల్లో ఒకరైన యష్ రంగినేని ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని, మైత్రీ మూవీస్‌తో కలిసి ఈ సినిమాను రూపొందించినట్టు చెప్పారు. బుధవారం (మే9న) ఫస్ట్‌లుక్ విడుదల అవుతుందని విజయ్ పేర్కొన్నారు.

    English summary
    After Arjun Reddy huge success, Vijay Deverakonda's latest movie is Mahanati. He is playing Vijay Anthony role in Savithri Biopic. This movie is set release on May 9th. That day also be a birthday of Vijay. In this occassion, He speaks to Telugu Filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X