‘పవన్ కల్యాణ్‌ను అందుకే వదిలేశా.. కలిసి ఉండాలని ప్రయత్నించా కానీ..’

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటు రాజకీయాల్లోను, ఇటు సినిమా రంగంలోను తన సత్తాను చాటుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రయిక్ రేటును సాధించిన ఆయన ప్రస్తుతం ఓజీ సినిమాతో భారీ వసూళ్లను రాబడుతున్నారు. అయితే ఆయన చెప్పినట్టు.. విజయాలు, ఇతర అంశాలు ఏవైనా తనకు సులభంగా దక్కవని ఇటీవల కామెంట్ చేశారు. అయితే రాజకీయాల్లో రాణించి ఏపీకి డిప్యూటీ సీఎం కావడానికి ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే తన పార్టీలో ఉన్నవారే..ఆయన విజన్‌ను అర్ధం చేసుకోలేక కొందరు విమర్శలు సైతం గుప్పించారు. పార్టీ పరంగా ఆయన అనుసరించే సిద్దాంతాలను వ్యతిరేకించిన ఓ మేధావి తాజాగా తను పవన్ కల్యాణ్‌కు దూరం కావడంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన ఎవరు? ఎందుకు దూరమయ్యారనే విషయంలోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జేడీ లక్ష్మీనారాయణ గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో కీలక పదవులు అనుభవించడమే కాకుండా వైఎస్ జగన్ లాంటి అక్రమ ఆస్థుల కేసును దర్యాప్తు చేసే అధికారిగా సంచలన నిర్ణయం తీసుకొన్నారు. జేడీకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాపులారిటీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేనతో ఉన్న అనుబంధం, ఆ పార్టీని వీడటం వెనుక కారణాలను వెల్లడించారు.

JD Lakshminarayana about Pawan Kalyan
పవన్ కల్యాణ్‌తో నాకు సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఆయన జనసేన పార్టీ పెట్టక ముందే రెండు సార్లు ఆయనను కలిశాం. తాను పార్టీ పెడుతున్న విషయాన్ని నాతో చర్చించారు. నేను కూడా కొన్ని సలహాలు, సూచనలు చేశాను. ఆ సమయంలో వారు నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. తాను కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే అంశంపై ఇంట్రెస్ట్‌గా ఉన్నాను. అలా నేను జనసేన పార్టీలో చేరాను అని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.

అయితే జనసేన పార్టీలో చేరిన తర్వాత చాలా విషయాలపై చర్చ చేశాం. నాకు విశాఖపట్నం ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నా కోసం ప్రచారం చేశారు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. మాకు మంచి ఓట్లు కూడా నమోదు అయ్యాయి. అంతా బాగానే ఉందనిపించింది. మేము స్వల్పంగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాం. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటనల కారణంగా జనసేన పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అందుకు ప్రత్యేకంగా కారణాలు ఏమీ లేవు అని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

JD Lakshminarayana about Pawan Kalyan

నేను జనసేన పార్టీలో చేరినప్పుడు సినిమాలు నాకు ముఖ్యం కాదు. సినిమాలకు దూరంగా ఉంటానని చెప్పారు. కానీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన మళ్లీ సినిమాల్లో వెళ్లడం నాకు ఇష్టం లేదు. పార్టీ నడిపించాలంటే సినిమాల ద్వారా ఆదాయం సమకూర్చాలనే నిర్ణయం నాకు సరిగా అనిపించలేదు. అయితే నాకు మళ్లీ సినిమాల్లోకి వెళ్లడం వల్ల ఆయనకు పాలిటిక్స్‌పై సీరియస్‌నెస్ లేదనిపించింది. అందుకే నేను జనసేనను, పవన్ కల్యాణ్‌ను వదిలేశాను. నాకు కలిసి ఉండాలని ఉన్నా.. ఎందుకో ఆ సమయంలో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

అయితే ప్రస్తుతం రాజకీయాలకు జేడీ లక్ష్మీనారాయణ దూరంగా ఉంటూ వస్తున్నారు. సామాజిక సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ తన పార్టీని విజయం దిశగా నడిపిస్తూ.. ఏపీలో కీలక పదవులు చేపట్టి.. రాజకీయ వాతావరణాన్ని తనవైపుకు తిప్పుకొన్నారు. రానున్న రోజుల్లో పవన్ కల్యాణ్, జేడీ లక్ష్మీనారాయణ ఎలాంటి పురోగతిని తమ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాల్లో చవిచూస్తారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X