ప్రశాంత్ నీల్ KGF 2 పట్టించుకోవడం లేదా.. ఫోకస్ మొత్తం తెలుగు సినిమాలపైనే?
రాజమౌళి అనంతరం ఇప్పుడు బెస్ట్ పాన్ ఇండియా దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరని చెప్పవచ్చు. ఆయనతో వర్క్ చేయడానికి సౌత్ హీరోలు బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. KGF చాప్టర్ 1 తోనే తన సత్తా ఏమిటో చూపించిన ప్రశాంత్ నీల్ సెకండ్ చాప్టర్ తో కూడా అంతకుమించి అనేలా హిట్టు కొడతాడాని టీజర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమాకు సంబంధించిన మరొక న్యూస్ కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
అసలైతే సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా అయిపోయినట్లు చిత్ర యూనిట్ కొన్ని నెలల క్రితమే క్లారిటీ ఇచ్చింది. కరోనా అదుపులోకి వస్తే సినిమాను రిలీజ్ చేయాలని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.. KGF 2 సినిమాలో ఒక సీన్ ను మళ్ళీ రీ షూట్ చేయాలని అనుకుంటున్నారట. కానీ దర్శకుడు మాత్రం ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదట. రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చిన తరువాత ఆ విషయం గురించి ఆలోచించాలని అనుకుంటున్నాడట. దీంతో ఈ టాపిక్ అభిమానులను అసంతృప్తికి గురి చేస్తోందట.

పైగా ప్రభాస్ సలార్, అలాగే ఎన్టీఆర్ తో కొత్త సినిమాను లైన్ లో పెట్టడంపై కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. భవిష్యత్తులో కూడా అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో కూడా సినిమాలు చేయవచ్చని టాక్ వస్తోంది. ఇక మొత్తంగా ప్రశాంత్ నీల్ ఒకవైపు KGF 2ను పట్టించుకోవడం, అలాగే కన్నడ హీరోలతో సినిమాలు చేయకుండా వరుసగా టాలీవుడ్ హీరోలను లైన్ లో పెట్టడం వలన కన్నడలో హాట్ టాపిక్ గా మారుతోంది. మరి ఆ వాతావరణాన్ని దర్శకుడు ఎలా కూల్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











