twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్జున్ అరెస్ట్ అంటూ వార్తలు.. కోర్టు ఏం చెప్పిందంటే, ఇక ఊపిరి పీల్చుకోవచ్చు!

    |

    ఇండియాలో మీటూ ఉద్యమం సంచలనం రేపింది. తనుశ్రీ దత్త వ్యాఖ్యలతో నెమ్మదిగా ప్రారంభమైన మీటూ ఆ తరువాత ఉప్పెనలా ఎగసిపడింది. దీనితో చాలా మంది సినీ ప్రముఖల జాతకాలు బయటపడ్డాయి. నానా పాటేకర్, షాజిద్ ఖాన్, వికాస్ బహల్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక దక్షిణాదిలో మీటూ ఉద్యమ సెగ ప్రముఖ నటుడు అర్జున్ సార్జా కు కూడా తగిలింది. కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ అర్జున్ పై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

    తీవ్రమైన ఆరోపణలు

    తీవ్రమైన ఆరోపణలు

    శృతి హరిహరన్ అర్జున్ పై ఆరోపణలు చేస్తూ.. ఓ చిత్ర షూటింగ్ లో భాగంగా తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ శృతి హరిహరన్ పేర్కొంది. చివరకు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కూడా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది. రెస్టారెంట్ కు రమ్మని అసభ్యంగా మెసేజ్ లు పెట్టేవాడిని శృతి హరిహరన్ అర్జున్ పై ఆరోపణలు చేయడంతో సంచలనగా మారింది. ఈ వివాదంలో చాలా మంది సినీ ప్రముఖులు అర్జున్ కు మద్దత్తు తెలిపారు.

    ఎఫ్ఐఆర్ నమోదు

    ఎఫ్ఐఆర్ నమోదు

    శృతి హరిహరన్ తనకు మద్దత్తు తెలుపుతున్న వారితో కలసి బెంగుళూరులో అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక మహిళా కమిషన్ ఈ కేసుని సుమోటోగా తీసుకుని విచారిస్తోంది. అర్జున్ పోలీసుల ఎదురు విచారణకు హాజరు కావలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ కేసు విషయంలో అర్జున్ కూడా అంతే ధీటుగా స్పందించారు.

    ఆమె పిరికితనంతో పారిపోయింది, నేనలా కాదు.. చక్కెరలా ఉన్నానని!ఆమె పిరికితనంతో పారిపోయింది, నేనలా కాదు.. చక్కెరలా ఉన్నానని!

    హైకోర్టులో పిటిషన్

    హైకోర్టులో పిటిషన్

    తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని అర్జున్ బెంగుళూరు హైకోర్టుని ఆశ్రయించారు. పోలిసుల విచారణ ఎదుర్కొన్న సమయంలో అర్జున్ మాట్లాడుతూ తాను 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని తెలిపాడు. స్వతహాగా ఆంజనేయస్వామి భక్తుడిని అని తెలిపాడు. నటీమణులని వేధిస్తుంటే ఇన్నిరోజులు చిత్రపరిశ్రమలో కొనసాగగలిగేవాడినా అని ఆవేదన వ్యక్తం చేశారు.

    Recommended Video

    Cops Ask Arjun Sarja 50 Questions | Filmibeat Telugu
    అర్జున్‌కు అనుకూలంగా

    అర్జున్‌కు అనుకూలంగా

    అర్జున్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు అతడికి పెద్ద ఉపశమనం అని చెప్పొచ్చు. అర్జున్ దాఖలు చేసిన పిటిషన్‌పై బెంగుళూరు హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న తరువాత కొంత అర్జున్ కు అనుకూలంగా తీర్పు ఇస్తూ తదుపరి విచారణని డిసెంబర్ 11కు వాయిదా వేశారు. తదుపరి విచారణ జరిగేవరకు అర్జున్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇది కొంత అర్జున్ కు అనుకూలించే అంశమే. కానీ శృతి హరిహరన్ మాత్రం ఈ కేసు విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది.

    English summary
    Do not arrest Arjun Sarja till December 11: Karnataka HC. Arjun Sarja in his petition alleged that the case and complaint filed by Sruthi was an abuse of law.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X