»   » బిగ్‌బాస్ సెలబ్రిటీ అరెస్ట్.. భార్యకు మరొకరితో అఫైర్.. ఒకరి కిడ్నాప్, దాడి!

బిగ్‌బాస్ సెలబ్రిటీ అరెస్ట్.. భార్యకు మరొకరితో అఫైర్.. ఒకరి కిడ్నాప్, దాడి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
బిగ్ బాస్ సెలబ్రిటీ అరెస్టు, అక్రమ సంబంధం | Oneindia Telugu

కన్నడ బిగ్‌బాస్ సెలబ్రిటీ సునామీ కిట్టి కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. తనను కిడ్నాప్ చేశాడంటూ దాఖలైన ఫిర్యాదు మేరకు పోలీసులు కిట్టిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిగ్‌బాస్ రియాలిటీ షోతోపాటు, ఇండియన్, థకధింథ డ్యాన్సింగ్ స్టార్ షోల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులు. సునామీ కిట్టి అరెస్ట్‌తో కన్నడ పరిశ్రమలో సంచలనం రేపింది.

కిడ్నాప్ చేశారని..

కిడ్నాప్ చేశారని..

ఫిబ్రవరి 28న కిట్టి తనను కిడ్నాప్ చేశాడని బార్‌ సిబ్బంది గిరిష్ జాన భారతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కిట్టి తన స్నేహితులు యోగేంద్ర, అర్జున్‌తో కలిసి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని వెల్లడించారు.

దారుణంగా హింసించారు

దారుణంగా హింసించారు

కిట్టి తన స్నేహితులతో కలిసి తనను గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్లారు. అక్కడ తనను దారుణంగా హింసించారు. బార్‌కు వచ్చే తన భార్య దీప, కౌషిక్ వివరాలను తీసుకొన్నారు అని గిరీష్ వెల్లడించారు.

భార్యతో అఫైర్ ఉందనే

భార్యతో అఫైర్ ఉందనే

కౌషిక్ అనే వ్యక్తితో తన భార్య దీపకు అఫైర్ ఉందనే అనుమానంతో గిరీష్‌ను కిడ్నాప్ చేసినట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ వార్తలు ప్రస్తుతం కన్నడ మీడియాలో సంచలనం రేపుతున్నాయి.

 భార్య ప్రియుడిని కిడ్నాప్

భార్య ప్రియుడిని కిడ్నాప్

గిరీష్‌ను కిడ్నాప్ చేయడానికి ముందు తౌషిక్‌ను ఎత్తుకెళ్లాలనే కారణంతో కిట్టి, అతడి స్నేహితులు బార్‌కు వచ్చారు. అయితే ప్లాన్ మార్చి వివరాలు సేకరించేందుకు గిరీష్‌ను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత తన భార్య ప్రియుడు కౌషిక్‌ను కూడా కిడ్నాప్ చేసి ఓ గోడౌన్‌కు తరలించినట్టు వార్తలు వెలువడ్డాయి.

కన్నడ చిత్ర పరిశ్రమలోకి

కన్నడ చిత్ర పరిశ్రమలోకి

కన్నడ టెలివిజన్ రంగంలో సుపరిచితుడైన సునామీ కిట్టి వృత్తిరీత్యా కూరగాయాల వ్యాపారి. మైసూరులోని హెచ్‌డీ కోటే ప్రాంతానికి చెందిన వాడు. త్వరలోనే కన్నడ సినీ పరిశ్రమలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

అటవీశాఖ భూముల కబ్జా

అటవీశాఖ భూముల కబ్జా

సునామీ కిట్టిపై అటవీశాఖ భూములను అక్రమంగా కబ్జాలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. వాటిలో భవనాలు కట్టడానికి ప్రయత్నం చేయగా కొందరు అడ్డుకోవడంతో ఆ ప్రయత్నాలు ఆగినట్టు సమాచారం.

సునామీ కిట్టిపై పలు కేసులు

సునామీ కిట్టిపై పలు కేసులు

ఈ వ్యవహారంలో సునామీ కిట్టిపై ఐపీసీ సెక్షన్ 363, సెక్షన్ 25 (1ఏ) ఆయుధాల చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సునామీ కిట్టి అరెస్ట్ కన్నడ వినోద పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

English summary
Bigg Boss Kannada 3 contestant and winner of reality shows like Indian and Thaka Dhimi Tha Dancing Star, Tsunami Kitty has been arrested. The Jnana Bharathi police arrested him for abduction. It seems he also threatened people. Kitty in his alleged illegal activities was accompanied by his friends, Yogendra and Arjun. A bartender named Girish filed a police complaint where he said he was kidnapped on February 28.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu