For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  KGF 2 ట్రైలర్ లాంచ్.. ఈ సినిమా క్రేడిట్ నాకు దక్కడం కరెక్ట్ కాదు.. అతనికే రావాలి: యష్

  |

  కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న సినిమా KGF చాప్టర్ 1 కు కొనసాగింపుగా ఇంపుగా ఇప్పుడు చాప్టర్ 2 సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా సృష్టించిన సంచలనాల తో కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయి పెరిగి పోయింది. ఇక ఇప్పుడు చాప్టర్ 2తో అంతకు మించిన విజయాన్ని అందుకోబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఇటీవల బెంగళూరులో నిర్వహించిన కేజిఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్ లాంచ్ లో హీరో యష్ మాట్లాడిన విధానం అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా క్రెడిట్ తనకు తగ్గకూడదు అంటూ అతనికి మాత్రమే దక్కాలి అంటూ వివరణ ఇవ్వడం విశేషం. పూర్తి వివరాల్లోకి..

  బెంగుళూరులో ట్రైలర్ లాంచ్

  బెంగుళూరులో ట్రైలర్ లాంచ్

  KGF రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటించిన చాప్టర్ 2 ఏప్రిల్ 14 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు ఏ కన్నడ సినిమాను విడుదల చేయని రేంజ్ లో చాప్టర్ 2ను విడుదల చేయబోతున్నారు. ఇక దానికి ముందు, చిత్ర నిర్మాతలు బెంగళూరులో గ్రాండ్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

  పునీత్ రాజ్‌ కుమార్‌ కు నివాళులు

  పునీత్ రాజ్‌ కుమార్‌ కు నివాళులు

  ఈ సినిమాలో ట్రైలర్ లాంచ్ అనంతరం చిత్ర స్టార్ యష్ మీడియాతో పాటు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా దివంగత నటుడు పునీత్ రాజ్‌ కుమార్‌ కు చిత్ర నివాళులర్పించారు. చిత్ర పరిశ్రమ ఒక గొప్ప మహానటుడిని కోల్పోయామని కాకుండా మంచి మనసున్న వ్యక్తి కూడా కోల్పోయింది ఎమోషనల్ అయ్యాడు.

  దర్శకుడి నుండి లైట్ బాయ్ వరకు

  దర్శకుడి నుండి లైట్ బాయ్ వరకు

  ఈ చిత్రం గురించి యష్ మాట్లాడుతూ.. తమ చెమటను అలాగే రక్తాన్ని సినిమాకి అందించినందుకు దర్శకుడి నుండి లైట్ బాయ్ వరకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ ఎంతో అర్థవంతంగా మాట్లాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా వారి ప్రాణం పెట్టే పని చేశారు అంటూ ఈ సినిమా అందరికీ కూడా మంచి ఆనందాన్ని కలగించే విధంగా ఉంటుంది అని అన్నారు.

  క్రెడిట్ అతనికే..

  క్రెడిట్ అతనికే..

  అదేవిధంగా KGF చాప్టర్ 2 సినిమా ఒక కన్నడ చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తుందని ఇప్పటివరకు ఎవరూ చూపించినటువంటి సినిమాను ప్రజెంట్ చేయబోతున్నట్లు గా చెప్పాడు. ఇక ఈ సినిమా ఇంత బాగా రావడానికి నాకు క్రెడిట్ ఇవ్వడం సరైనది కాదు. ఎందుకంటే ఈ సినిమాకు అంతకుమించి చాలా కష్ట పడిన వారు ఎవరు అంటే అది కేవలం దర్శకుడు మాత్రమే అంటూ.. ఈ సినిమా పూర్తి క్రెడిట్ కూడా ప్రశాంత్ నీల్ కు దక్కాలి అనే హీరో యష్ గొప్పగా చెప్పాడు.

  Recommended Video

  KGF Chapter 2 : Kannada And Telugu Ruling Indian Box Office | RRR Movie | Filmibeat Telugu
   కన్నడలో మాత్రమే కాకుండా..

  కన్నడలో మాత్రమే కాకుండా..

  ఇక ఏప్రిల్ 14వ తేదీన విడుదల కాబోయే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్న కన్నడ సినిమాగా రికార్డు క్రియేట్ చేయనుంది. కేవలం కన్నడ భాషలో మాత్రమే కాకుండా బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రావు రమేష్, ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం అన్ని తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీలో భారీ స్థాయిలో విడుదల కానుంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

  English summary
  Kannada Hero yash speech in kgf 2 trailer launch event
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X