Don't Miss!
- News
లోకేష్ యాత్ర కొత్త "టర్న్" - చంద్రబాబు వ్యూహాం: రంగంలోకి బాలయ్య - నందమూరి ఫ్యామిలీ..!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
సర్జరీ వికటించి మరో నటి మృతి.. సినీ ఇండస్ట్రీలో విషాదం
రోజురోజుకు తమను తాము అందంగా చూపించుకోవాలి అనే తపన యువతలో పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా సౌందర్య చికిత్సలపై నేటి యువతరం ప్రత్యేక శ్రద్ధ చూపించడం ఆ వ్యాపారం చేస్తున్న వారికి కాసులు కురిపించేలా చేస్తోంది. ఒక్క భారత దేశంలో ప్రతి ఏటా సుమారు 460 కోట్ల రూపాయల వ్యాపారం ఒక్క కాస్మొటిక్ సర్జరీ వల్ల జరుగుతుంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా అలా అందాన్ని మరింత మైమరిపించేలా మార్చుకోవడం కోసం యత్నించిన ఒక నటి మృత్యువాత పడింది. ఆ వివరాలు

రకరకాల సర్జరీలు
సాధారణ యూత్ తమ అందం కోసం పరితపిస్తుంటే గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న వారు అయితే దాన్ని సంరక్షించుకోవడానికి లక్షలు ధారపోసి రకరకాల సర్జరీలు చేసుకోవడం సాధారణంగా మారిపోయింది. ఈ అయితే ఈ సర్జరీలు వికటించి కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకున్న దాఖలాలు ఉన్నా వాటిని ఆశ్రయించడం మానడం లేదు.

అందం కోసం
కొవ్వు తగ్గించుకోవడం, బరువు తగ్గడం లాంటి ప్రయత్నాలు చేసి ఆర్తి అగర్వాల్ లాంటి వారు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దాదాపు అదే కోవలో ఒక మరో అందాల భామ అందం కోసం ప్రాణం బలి చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. కాస్మటిక్ సర్జరీ విషయంలో ఆమెకు తేడా జరగడంతో ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.

ఫ్యాట్ తగ్గించుకోవడం కోసం
అది ఇది జరిగింది కన్నడ టీవీ పరిశ్రమలో. కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి చెందారు. కాస్మొటిక్ సర్జరీ చేతనా రాజ్ ప్రాణాలు బలి తీసుకుంది అని ప్రాథమిక సమాచారం. కన్నడ టీవీ ప్రేక్షకులకు చేతనా రాజ్ సుపరిచితురాలే, ఆమె పలు టీవీ షోస్, సీరియల్స్ చేస్తున్నారు. బెంగళూరులోని డాక్టర్ శెట్టి కాస్మొటిక్ హాస్పిటల్‌లో మే 16న చేతనా రాజ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఫ్యాట్ తగ్గించుకోవడం కోసం చేతనా రాజ్ కాస్మొటిక్ సర్జరీని ఆశ్రయించినట్లు చెబుతున్నారు.

వైద్యులను బెదిరించి
ఆ ప్రక్రియ మొదలుపెట్టాక సాయంత్రానికి ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో చేతనా రాజ్ ఇబ్బంది పడ్డారు. డాక్టర్ శెట్టి కాస్మొటిక్ హాస్పిటల్‌లో ఐసీయూ లేకపోవడంతో హుటాహుటిన మంజునాథ్ నగర్ లోని కడే హాస్పిటల్‌కు చేతనా రాజ్ ను తరలించారు. తమ ఆస్పత్రికి వచ్చేసరికి చేతనా రాజ్ మరణించినట్టు కడే హాస్పిటల్ వైద్యులు తెలిపారు. అంతే కాదు చేతనా రాజ్‌ను తీసుకొచ్చిన వైద్యుడు ఒకరు తమ వైద్యులను బెదిరించినట్టు కడే హాస్పిటల్ వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డాక్టర్ నిర్లక్ష్యమే
సోమవారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా చేతనా రాజ్ ఇంటి నుంచి బయటకు వచ్చి,. స్నేహితులతో కలిసి ఆసుపత్రికి వెళ్ళిందని తెలిసింది. ఈ క్రమంలో తమ కుమార్తె మరణానికి కాస్మొటిక్ సర్జరీ చేసిన డాక్టర్ నిర్లక్ష్యమే కారణం అని చేతనా రాజ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి చేతనా రాజ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు పోలీసులకు చేసినట్లు చెబుతున్నారు. ఇక ఆమె మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.