Don't Miss!
- News
'సజ్జల' మాట విని వారిద్దరూ ఏమయ్యారో చూడండి?
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : హార్దిక్ తెలివిగా ఆడాడు.. కెప్టెన్‌ను మెచ్చుకున్న మాజీ లెజెండ్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
వాటికి నువ్ అర్హుడివే.. ‘పొగరు’పై ప్రశాంత్ నీల్ కామెంట్స్
ప్రస్తుతం కన్నడ సినిమాలన్నీ కూడా తెలుగు తెరపై దండయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ధృవ సర్జా రష్మిక మందాన్న కాంబినేషన్‌లో వచ్చిన పొగరు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో డబ్ అయింది. అయితే ఇక్కడ మాస్ మసాల సినిమాలేమీ కొత్త కాదు. తెలుగు ప్రేక్షకులకు అలవాటైన మాస్ ఎలిమెంట్స్, కమర్షియల్ అంశాలతో తెరకెక్కించిన పొగరు ఇక్కడి ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు.
అయితే కన్నడలో మాత్రం పొగరు పర్వాలేదనిపించింది. కన్నడలో మంచి వసూళ్లను రాబడుతున్న ఈ మూవీకి ప్రశాంత్ నీల్ సాయం అందించాడు. తనవంతుగా ప్రమోట్ చేస్తూ.. పొగరుపై ప్రశంసల వర్షం కురిపించారు. పొగరు, హీరో హీరోయిన్లు, చిత్రయూనిట్ గురించి చెబుతూ ఓ ట్వీట్ వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ప్రశాంత్ నీల్ సినిమా గురించి చెప్పిన సంగతులేంటో ఓ సారి చూద్దాం.

మైల్ స్టోన్ లాంటి పొగరు సినిమాను చూడటం ఎంతో ఆనందంగా ఉంది.. దర్శకుడు నంద కిషోర్‌కు కంగ్రాట్స్.. రష్మిక మందాన్న, చిత్రయూనిట్ మొత్తానికి కూడా కంగ్రాట్స్. పని పట్ల నీకున్న అపరిమితమైన శ్రద్దాసక్తులు, ప్యాషన్ అన్నీ కూడా అద్భుతం.. ఇలాంటి సక్సెస్‌లు పొందడానికి నువ్ పూర్తిగా అర్హుడివి.. నీకు ఇలాంటివి ఇంకా రావాలి అంటూ ప్రశాంత్ నీల్ ట్వీట్ వేశాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ మూవీతో బిజీగా ఉన్నాడు.