Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ ఆ బంతిని వదిలేయాల్సింది.. ఇన్ని తప్పులు ఎప్పుడూ చేసుండకపోవచ్చు: సెహ్వాగ్
- News
పీఎం కిసాన్ వద్దా..? సగ మందికి కూడా రావడం లేదు: రాములమ్మ ఫైర్
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్‌ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Prashanth Neel తీవ్ర విషాదంలో కేజీఎఫ్2 డైరెక్టర్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి..
కన్నడ నటుడు, కమెడియన్ మోహన్ జునేజా ఆకస్మిక మరణంతో కన్నడ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలుచుకొంటూ సినీ వర్గాలు, అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియాలో శ్రద్దాంజలి ఘటించి.. సంతాపం తెలియజేస్తున్నారు. మోహన్ఓ జునేజా మరణం, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మోహన్ జునేజా వయసు 54 సంవత్సరాలు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం అంటే మే 7వ తేదీ రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా కేజీఎఫ్2 చిత్ర యూనిట్ నివాళులర్పించారు.

మోహన్ జునేజా మరణంపై ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో స్పందించారు. తన సోషల్ మీడియాలోని ఇన్స్‌టాగ్రామ్ స్టోరీలో మోహన్ జునేజా ఫోటో పెట్టి.. సార్.. మీ ఆత్మకు శాంతి కలుగాలి అంటూ చేతులెత్తి మొక్కినట్టు ఈమోజీ సింబల్ పెట్టారు.
ఇక హోంబల్ ఫిలింస్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. మోహన్ జునేజా మరణం చాలా బాధించింది. కన్నడ సినిమాలో ఆయన గొప్పనటుడు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకొంటున్నాం అని అన్నారు.
మోహన్ జునేజా కేజీఎఫ్‌లో కీలక పాత్ర పోషించారు. రాకీ గురించి జర్నలిస్టు అనంత నాగ్ చెప్పే సీన్‌లో కనిపిస్తారు. కన్నడ సినిమా రంగంలో ఇలాంటి ఎన్నో సినిమాల్లో నటించారు.