twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పునీత్ రాజ్‌ కుమార్‌ కళ్లతో రికార్డు.. మరో పది మందికి చూపు.. మొత్తం 14 మందికి.. ఎలాగో తెలుసా?

    |

    తన తండ్రి డాక్టర్ రాజ్ కుమార్ తన తల్లి పార్వతమ్మ రాజ్ కుమార్ లాగే పునీత్ రాజ్ కుమార్ కూడా నేత్రదానం చేసిన సంగతి తెలిసిందే. పునీత్ రాజ్‌కుమార్ మరణానంతరం తన రెండు కళ్లను పొందిన నారాయణ నేత్ర వైద్యుడు నలుగురు అంధులకు దృష్టిని ప్రసాదించారు. నారాయణ నేత్ర వైద్యులు ఇప్పుడు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు, ఈ ప్రయోగం ద్వారా ఏకంగా పది మందికి చూపునివ్వబోతున్నారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    సేవా కార్యక్రమాలతో

    సేవా కార్యక్రమాలతో

    రీల్ లైఫ్‌ హీరోగా రియల్ లైఫ్‌లో సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన పునీత్ మరణానికి ముందు తన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. పునీత్ నిర్ణయం మేరకు రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు నేత్రాలను దానం చేశారు. వాటి ద్వారా నలుగురికి చూపు లభించింది. ఇప్పుడు మరో పది మందికి చూపు వచ్చేలా డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు.

    పది మందికి చూపు ఇచ్చే

    పది మందికి చూపు ఇచ్చే

    పునీత్ కార్నియా ద్వారా నలుగురికి చూపు లభించగా ఆయన స్టెమ్ సెల్స్ ద్వారా ఐదు నుంచి పది మందికి చూపు ఇచ్చే ప్రయత్నాలకు బెంగళూరులోని నారాయణ నేత్రాలయ ఆసుపత్రి శ్రీకారం చుట్టింది. ఈ వివరాలను ఆస్పత్రి చీఫ్ డాక్టర్ భుజంగ శెట్టి తెలిపారు. పునీత్ స్టెమ్ సెల్స్ ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

    ల్యాబ్ లో ప్రయోగాలు

    ల్యాబ్ లో ప్రయోగాలు

    ఇప్పటికే ఐ ల్యాబ్ లో ప్రయోగాలు ప్రారంభం అయ్యానని, దీనికి రెండు వారాల సమయం పడుతుందని, ఆ తర్వాత అర్హులైన వ్యక్తులకు కంటిచూపు ప్రసాదిస్తామని మరో డాక్టర్ యతీశ్ తెలిపారు. ఈ మంచి పనికి డాక్టర్ రాజ్ కుమార్ ఐ బ్యాంక్ సహకారం తీసుకుంటున్నట్లు కూడా ఆయన తెలిపారు. దేశంలో ఇటువంటి ప్రయోగం చేయడం మొదటిసారి అని నారాయణ నేత్రాలయ వైద్యులు వెల్లడించారు.

     స్టెమ్ సెల్స్ వలన

    స్టెమ్ సెల్స్ వలన

    రాజ్ కుమార్ కళ్ళలోని తెల్లటి భాగంలో స్టెమ్ సెల్స్ వలన మరింత మందికి చూపు తెప్పించే అవకాశం ఉందని అంటున్నారు. అప్పు కళ్లు ఆరోగ్యంగా ఉన్నాయని, అంటున్నారు. కంటి ఆరోగ్యానికి ఈ స్టెమ్ సెల్స్ చాలా ముఖ్యమైనవి. కొంత మందికి బాణసంచా కాల్చడం, సున్నం, యాసిడ్ మొదలైనవి పడిన సమయంలో ఈ మూలకణాలు దెబ్బ తింటాయి.

    విశాల్ మాట ఇవ్వగా

    విశాల్ మాట ఇవ్వగా

    పునీత్ మరణం తర్వాత ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవడానికి రాజ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ముందుకు వస్తున్నారు. పునీత్ చదివిస్తున్న పద్దెనిమిది వందల మంది పిల్లలను తాను చదివిస్తానని హీరో విశాల్ మాట ఇవ్వగా ఆయన చేస్తున్న పనులకు గాను మరింత మంది హీరోలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారని అంటున్నారు.

    Recommended Video

    Pitta Kathalu Team Interview With Ramya Krishna
    పెద్ద విషయం కాదు కానీ

    పెద్ద విషయం కాదు కానీ

    ఒక వ్యక్తి దానం చేసినా ఎంతో మందికి కంటి చూపును ప్రసాదించినా అది పెద్ద విషయం కాదు కానీ ఎంతో మందికి నేత్రదానం చేసేందుకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలా చేసిన పునీత్ రాజ్ కుమార్ మాత్రం చిరకాలం ప్రజల మనస్సులో నిలిచిపోతున్నాయి.

    English summary
    Puneeth Raj kumar’s eyes to light up 10 more lives.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X