»   » టాలీవుడ్‌లో సీఎం భార్య రీఎంట్రీ.. ఆ సినిమా పేరేంటంటే..

టాలీవుడ్‌లో సీఎం భార్య రీఎంట్రీ.. ఆ సినిమా పేరేంటంటే..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  కర్ణాటక రాజకీయాలు ఓ వైపు హాట్‌హాట్‌గా నడుస్తుంటే.. మరో వైపు సినీ నటి రాధికా కుమారస్వామి గురించి గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. ఎందుకంటే కాబోయే కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి భార్య కావడమే. సినీ తార రాధికను కుమారస్వామి ప్రేమించి పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. ఓ పక్క కుమారస్వామి సీఎం పదవి చేపట్టబోతుంటే.. ఆమె నటించిన తెలుగు చిత్రం రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఆ చిత్ర వివరాలు మీ కోసం..

  Later Karnataka Elections Kumaraswamy Wife Became A Hot Topic
   ఎమ్మెల్యే గోపినాథ్ నిర్మాతగా

  ఎమ్మెల్యే గోపినాథ్ నిర్మాతగా

  పెళ్లికి ముందు రాధిక కుమారస్వామి 2002లో నీల మేఘశ్యామ అనే చిత్రంతో కన్నడ సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. హీరోయిన్‌గా పరిచయమైన తొలి చిత్రం మాత్రం 'భద్రాద్రి రాముడు". నందమూరి తారకరత్నతో 2004లో రూపొందిన ఈ చిత్రానికి ప్రస్తుత జూబ్లీహిల్స్ శాసన సభ్యుడు, సినీ నిర్మాత మాగంటి గోపినాథ్ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు.

  కుమారస్వామితో పెళ్లి

  కుమారస్వామితో పెళ్లి

  కన్నడ చిత్ర పరిశ్రమలో కుమారస్వామి నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో 2005లో రాధిక, కుమారస్వామిల పరిచయం జరిగింది. వారి పరిచయం ప్రేమగా మారడంతో పన్నెండేళ్ల క్రితం అంటే 2006లో ఆమె కుమారస్వామిని పెళ్లాడారు. వీరికి ఓ కూతురు ఉంది. ఆమె పేరు షమిక కే స్వామి.

  రాధికకు రెండో వివాహం

  రాధికకు రెండో వివాహం

  2005లో రాధికా - కుమారస్వామిలకు పరిచయమైంది. 2006లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత అంటే 2010లో అందరికీ వివాహం గురించి తెలిసింది. రాధిక, కుమారస్వామిల ఇద్దరిదీ రెండో వివాహమే. 2000లో ఆమె రతన్‌కుమార్‌ అనే వ్యక్తిని రాధిక పెళ్లాడారు. అప్పటికి ఆమె వయస్సు 14 ఏళ్లు. పెళ్లి జరిగిన రెండేళ్ల తర్వాత రతన్‌ గుండెపోటుతో మరణించారు. 1986లో అనితను కుమారస్వామి వివాహం చేసుకున్నారు. వీరికి నిఖిల్ గౌడ (జాగ్వర్ మూవీ హీరో) కుమారుడు ఉన్నారు .

   తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్‌తో

  తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్‌తో

  కుమారస్వామితో పెళ్లి తర్వాత రాధిక రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. కానీ మళ్లీ తెలుగు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన తెలుగు చిత్రం కాంట్రాక్ట్‌లో కీలక పాత్రను రాధిక పోషించారు. రాధికా కుమారస్వామి ఇందులో అర్జున్‌కు జోడిగా నటిస్తున్నారు. ఇందులో హీరో జేడీ చక్రవర్తి విలన్‌గా నటిస్తుండటం విశేషం. ప్రముఖ కన్నడ కథానాయిక సీనియర్ దర్శకులు కే విశ్వనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే కాంట్రాక్టు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.

  English summary
  HD Kumaraswamy going to swear as Chief Minister of Karnataka. His second wife, Radhika Kumaraswamy is looking to play important roles in the South Indian films. She got an offer in Arjun's film, Contract, in which J.D. Chakravarthy is also playing a lead role. She is just 32 years old and has a daughter.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more