For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kantara హీరోకు రష్మిక మందన్నా స్ట్రాంగ్ కౌంటర్.. కొనసాగుతున్న వివాదం!

  |

  కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతార దేశవ్యాప్తంగా విడుదలైన తర్వాత ఆ సినిమా హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. చూస్తుంటే ఈ వివాదం ఇంకా ముదురుతున్నట్లు కనిపిస్తోంది. కాంతార సినిమాను రష్మిక మందన్నా చూడలేదని చెప్పడం, పలు ఇంటర్వ్యూలో కిరిక్ పార్టీ మేకర్స్ పేర్లను నోటిద్వారా చెప్పకుండా చేతులతో సంజ్ఞలు చేయడం.. వాటికి రిషబ్ శెట్టి కౌంటర్లు వేయడం వంటివి జరిగాయి. ఇప్పుడు తాజాగా రిషబ్ శెట్టి కౌంటర్లకు శ్రీవల్లి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. హిందీ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది రష్మిక మందన్నా.

   కిరిక్ పార్టీ సినిమాతో..

  కిరిక్ పార్టీ సినిమాతో..

  కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మందన్నా సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కిరిక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా ఎంట్రీ ఇచ్చింది. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే అదే భాషల్లో అనేక సినిమాలు చేసింది.

   ఛలో సినిమా నుంచి మొదలుకొని..

  ఛలో సినిమా నుంచి మొదలుకొని..

  కిరిక్ పార్టీ సినిమా సమయంలోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించి నిశ్చితార్థం కూడా చేసుకుంది గ్లామరస్ బ్యూటి రష్మిక మందన్నా. అనంతరం తెలుగులో 'ఛలో' మూవీతో తెరంగేట్రం చేసిన తర్వాత రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుని షాక్ ఇచ్చింది ఈ బ్యూటి. ఇక ఛలో సినిమా నుంచి మొదలుకొని 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను సొంతం చేసుకోవడంతో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చినా రష్మిక‌కు స్టార్‌డమ్‌తో పాటు క్రేజ్ కూడా భారీ స్థాయిలో పెరిగింది.

  మరోసారి హిందీ చిత్రంతో..

  మరోసారి హిందీ చిత్రంతో..

  ఇక ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అందులో శ్రీవల్లిగా నటించి యూత్ ను ఫిదా చేసిందనే చెప్పవచ్చు. దీంతో ఆమెకు ఇటు బాలీవుడ్, అటు కోలీవుడ్ లో వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే ఆమె నటించిన హిందీ చిత్రం గుడ్ బై అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రకు జోడిగా రష్మిక నటించిన చిత్రం మిషన్ మజ్ను.

  జనవరి 19న విడుదల..

  జనవరి 19న విడుదల..

  శాంతను భగ్చీ దర్శకత్వం వహించిన మిషన్ మజ్ను సినిమా జనవరి 19న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తరచుగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇక ఇటీవల కన్నడలో రష్మికపై బ్యాన్ విధించారని, కాంతార చూడకపోవడంపై ట్రోలింగ్, కాంతార హీరో రిషబ్ శెట్టి కామెంట్స్ పై స్పందించింది ఈ బామ. అలాగే రిషబ్ శెట్టి వ్యాఖ్యలకు ఇన్ డైరెక్ట్ గా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

   ఎవరి కారణాలు వారికి..

  ఎవరి కారణాలు వారికి..

  "హీరోయిన్ అయింత మాత్రానా అందరూ ఇష్టపడతారనేది ఏం లేదు. ఎక్కడైనా కూడా ద్వేషం ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఉంటుంది. నేను ఒక పబ్లిక్ సెలబ్రిటీని. మనం వారితోనే ఉంటాం. వారితోనే మాట్లాడుతుంటాం. ఈ సినీ ఇండస్ట్రీలో కొందరికి నా ప్రవర్తన తీరు నచ్చకపోవచ్చు. నేను మాట్లాడే మాటలు, నా హావాభావాలు, చేతులతో చేసే సంజ్ఞలు ఇష్టపడకపోవచ్చు, నచ్చకపోవచ్చు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. కానీ కొందరికి మాత్రం నేను అంటే ప్రేమ ఉండే ఉంటుంది కదా. అలాంటి వారికి నేను కృతజ్ఞురాలిని" అని రష్మిక మందన్నా తెలిపింది.

   రష్మిక పేరు చెప్పని హీరో..

  రష్మిక పేరు చెప్పని హీరో..

  అయితే ఇది వరకు ఒక ఇంటర్వ్యూలో తొలిసారి హీరోయిన్ గా ఎలా అవకాశం వచ్చిందన్న ప్రశ్నకు కిరిక్ పార్టీ సినిమా డైరెక్టర్, నిర్మాణ సంస్థ పేరు చెప్పకుండా సో కాల్డ్ అంటూ చేతి వేళ్లతో సైగల ద్వారా చెప్పింది రష్మిక మందన్నా. తర్వాత అయితే కాంతార సినిమా ప్రమోషన్స్ సందర్భంగా రష్మిక మందన్నాపై కామెంట్స్ చేశాడు రిషబ్ శెట్టి. ఇష్టమైన హీరోయిన్లలో రష్మిక పేరును చెప్పకుండా చేతి వేళ్లతై సైగలు చేసే వాళ్లు నచ్చరు అని రష్మిక లానే చేసి చూపించాడు రిషబ్ శెట్టి. ఇదిలా ఉంటే కాంతార సినిమా చూల్లేదని రష్మిక చెప్పకపోవడంతో ఈ వివాదం ప్రారంభమై ఇంకా కొనసాగుతోంది.

  English summary
  National Crush Rashmika Mandanna Shocking Comments On Being Disliked Trolling By Rishab Shetty And Kannada Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X