twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా గుండె బద్దలైంది.. మానవత్వం ఎక్కడుంది, రేప్ చేసి హత్య.. రష్మిక మందన!

    |

    సమాజంలో హృదయ విదారకమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కర్ణాటకలోని రాయచూర్ లో ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. మొదట ఆమె సూసైడ్ చేసుకుందని అంతా భావించారు. కానీ పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత ఆమెని రేప్ చేసి చంపేశారంటూ సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటన ప్రస్తుతం దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా మధు పత్తార్ హత్య గురించి స్పందిస్తున్నారు. సింగర్ చిన్మయి, హీరోయిన్ రష్మిక ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో స్పందించారు.

    రేప్ చేసి హత్య

    రేప్ చేసి హత్య

    ఇటీవల కర్ణాటకలోని రాయచూర్ లో నవోదయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని అయిన మధు పత్తార్ కొన్ని రోజుల పాటు అదృశ్యమైంది. పోలీసులు ఆమె మరణించినట్లు కనుగొన్నారు. రాయచూర్ లో ఓ గుడివద్ద ఉరివేసుకుని కనిపించింది. కానీ ఆమె శరీరం కొంత భాగం కాలిపోయి కనిపించింది. దీనితో పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేశారు. పోలిసుల దర్యాప్తులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెని ఎవరో అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. బలవంతంగా సూసైడ్ నోట్ రాయించారని పోలీసులు తెలిపారు.

    నా గుండె బద్దలైంది

    నా గుండె బద్దలైంది

    హీరోయిన్ రష్మిక ఈ సంఘటన గురించి ట్విట్టర్ లో స్పందించారు. మానవత్వం ఎక్కడుంది.. నవోదయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని మధు పత్తర్ అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ సంఘటన విన్న తర్వాత నా హృదయం బద్దలైంది. ఇలాంటి సంఘటనలకు ఇంకెంత మంది బలి కావాలి. మధుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనలకు ముగింపు పలకాలి అని రష్మిక ట్వీట్ చేసింది.

    పోలీసులు వేగంగా

    పోలీసులు వేగంగా

    ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు వేగంగా స్పందించాలి అని సింగర్ చిన్మయి తెలిపారు. మధు కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఉండాల్సింది. మధు విషయంలో న్యాయం జరగాలంటూ ధర్నా చేస్తున్న ఆమె స్నేహితుల దృశ్యాలని చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంత దారుణమైన సంఘటన జరిగితే దీనిపై ఏ మీడియా సంస్థ అయినా వార్తలు ప్రచురిస్తోందా అని చిన్మయి ప్రశ్నించారు.

    లైంగిక వేధింపులపై

    లైంగిక వేధింపులపై

    సింగర్ చిన్మయి తరచుగా మహిళపై జరుగుతున్న వేధింపుల విషయంలో స్పందిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపులపై చిన్మయి ధైర్యంగా మాట్లాడుతున్నారు. ప్రముఖ రచయిత వైరముత్తు పై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రష్మిక కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తోంది.

    English summary
    Rashmika Mandanna Questions Humanity Following Raichur Rape Case. Engineering student in Karnataka's Raichur found hanging from a tree amid reports of rape and murder
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X