Darshan Arrest: దర్శన్ అరెస్ట్ వెనుక కారణం ఏమిటి? హత్య గురైన రేణుక స్వామి ఎవరు?
ఛాలెంజింగ్ స్టార్, కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ సంచలనం రేపింది. రేణుక స్వామి హత్య కేసులో ఆయనను మైసూర్‌లో అరెస్ట్ చేశారు. ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసింది. అయితే హత్య కేసులో ఆరోపణలు రావడం.. అలాగే వెంటనే కేసు నమోదు చేయడంతోపాటు అరెస్ట్ కూడా చకచక జరిగిపోయాయి. ఈ హత్య వెనుక పూర్వాపరాలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
హీరో దర్శన్ దాంపత్య జీవితం కొద్దికాలంగా వివాదాస్పదంగా మారింది. దర్శన్‌కు విజయ లక్ష్మీ అనే భార్య ఉంది. అయితే కొద్దికాలంగా నటి పవిత్ర గౌడతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. దాంతో విజయలక్ష్మీతో దాంపత్య జీవితం సమస్యల్లో పడింది. పవిత్ర గౌడ కూతురు బర్త్ డేకు దర్శన్ హాజరు కావడంతో వారి మధ్య అక్రమ సంబంధం వెలుగుులోకి వచ్చింది. వారిద్దరి వ్యవహారంపై గత కొద్దికాలంగా కన్నడ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి.

ఇక రేణుక స్వామి విషయానికి వస్తే.. దర్శన్‌కు వీరాభిమాని. అయితే తన అభిమాన హీరో తన భార్యకు అన్యాయం చేయడంపై రేణుక స్వామి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా దర్శన్, పవిత్ర తీరును తప్పుపట్టారు. పవిత్ర గౌడపై రేణుక స్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో దర్శన్ ఓ దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
అయితే పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే రేణుక స్వామి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. రేణుకు స్వామిని కామాక్షి పాల్య స్టేషన్ పరిధిలోని ఓ షెడ్‌లో హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని సున్నహల్లి బ్రిడ్డి వద్ద గుర్తించారు. ఈ ఘటనపై కామాక్షి పాల్య పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ హత్యతో దర్శన్‌కు సంబంధం ఉందని స్టార్ హీరోపై ఆరోపణలు వచ్చాయి. దాంతొ ఆయనను అరెస్ట్ చేశారు.

దర్శన్ అరెస్ట్ ఘటన కన్నడ పరిశ్రమనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమను కుదిపేసింది. భారీగా ఫాలోయింగ్ ఉన్న దర్శన్ ఫ్యాన్స్ ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కేసు నుంచి త్వరగా బయటపడుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











