రామ్ గోపాల్ వర్మ నుండి మరో చిత్రం ‘భైరవ గీత’
'ఆఫీసర్' సినిమాతో తెలుగులో భారీ ప్లాప్ నమోదు చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల 'వైరస్' అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మొదలు కాక ముందే వర్మ మరో సినిమా ప్రకటించారు. కన్నడ నటుడు ధనుంజయ హీరోగా 'భైరవగీత' అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు.
ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫేర్ వేడుకలో ధనుంజయ ఉత్తమ నటుడు (క్రిటిక్ కేటగిరీ) అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా 'భైరవగీత' సినిమాను వర్మ ప్రకటించారు. తెలుగులో ఈ చిత్రం 'భైరవగీతం' పేరుతో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమా లైన్ గురించి వర్మ వివరిస్తూ... ఇది ఓ ప్రేమకథ అన్నారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు ఎలా రెబల్‌గా మారాడన్నదే కథ, ఇందులో ధనుంజయ్ భైరవ అనే పాత్రలో కనిపిస్తారని తెలిపారు. ఈ సినిమా ద్వారా సిద్ధార్థ్ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

తన సొంత బేనర్లో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి భాస్కర్ రాశి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. 'భైరవగీత' చిత్రానికి సంబందించిన ఫస్ట్‌లుక్ జూన్ 21న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.


Click it and Unblock the Notifications











