5 సార్లు మృత్యువు అంచుల వరకు.. కాంతార చాప్టర్ 1 షూట్‌లో రిషబ్ శెట్టికి భయంకర అనుభవాలు!
దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న చిత్రం కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయరాం, గుల్షన్ దేవయ్య, రాకేష్ పూజారీ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి ఛాలువే గౌడ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫిని, కేఎం ప్రకాశ్, శోభిత్ శెట్టి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ బీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో రిషబ్ శెట్టి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన చెప్పిన షాకింగ్ విషయం ఏమిటంటే?
కాంతార పర్వ యూనిట్ చాలా కష్టపడి ప్రమోట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను చాలా విభిన్నంగా చేశారు. ఆసక్తికరంగా వీడియోలు, పోస్టర్లను, సినిమా కంటెంట్‌ను డిజైన్ చేసి ప్రజల వద్దకు ఈ సినిమాను తీసుకెళ్లారు. కానీ ఓ పోస్టర్ వల్ల వారి శ్రమ చెడుగా ప్రొజెక్ట్ అయింది. అందుకు నాకు చాలా బాధ వేసింది అని రిషబ్ శెట్టి పోస్టర్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు.

కాంతార చాప్టర్ 1 సినిమాను హోంబలే ఫిలింస్ ఖర్చుకు వెనుకాడకుండా.. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా నిర్మించింది. కుందాపూర్ ప్రాంతంలో దాదాపు 4 లక్షల మందికి ఫుడ్ పెట్టి హోంబలే ఫిల్మ్స్ నిర్వాహకులు బాగా చూసుకొన్నారు. ఆ ప్రాంతాన్ని మినీ ఫిల్మ్ సిటీగా మార్చారు అని రిషబ్ శెట్టి తెలిపారు.
ఎడతెరిపిలేని వర్క్ కారణంగా గత 3 నెలలుగా సరిగా నిద్రపోలేదు. ప్రతీ ఒక్కరు తమ సొంత సినిమాగా భావించి సపోర్ట్ చేశారు. వాస్తవం చెప్పాలంటే.. ఈ సినిమా షూటింగులో 4, 5 సార్లు మృత్యువు అంచుకు వెళ్లి వచ్చాను. చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని అయింది. దేవుడిపై ఉన్న నమ్మకమే, దైవబలమే నన్ను కాపాడింది అని రిషబ్ శెట్టి అన్నారు.
కాంతార చిత్ర కథ నా చిన్ననాటి అనుభవాల నుంచి పుట్టింది. నా బాల్యంలో నేను విన్న కథలు, జానపదాల్లోని విషయాలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించాను. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాను. చాలా మంది పరిశోధకులు, ప్రొఫెసర్లతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు తీసుకొన్నాను. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది అని రిషబ్ శెట్టి అన్నారు.
ఈ సినిమాను దేశవ్యాప్తంగా 7000 వేల స్క్రీన్లలో విడుదల చేస్తున్నాం. ఓవర్సీస్‌లో మెక్సికో, కొలంబియా దేశాల్లోను స్పానిష్ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. అరవింద్ కశ్యప్ విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. సినిమా చూస్తున్నంత సేపు కొత్త ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది. ఈ సినిమా అన్ని వర్గాలను ఆలరిస్తుంది అని రిషబ్ శెట్టి తెలిపారు.


Click it and Unblock the Notifications











