For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పునీత్ రాజ్ కుమార్ డాక్టర్ కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీ.. జరిగింది ఇదే అంటూ క్లారిటీ ఇచ్చిన డాక్టర్

  |

  కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29న గుండెపోటుతో హఠాత్తుగా మృతి చెందిన విషయం తెలిసిందే. మొదటి నుండి కూడా తన ఫిట్ నెస్ పై ఎంతో శ్రద్ధ కనబర్చే పునీత్ రాజ్ కుమార్, నిత్యా క్రమం తప్పకుండ వ్యయం చేస్తూ ఉంటారు. అయితే అక్టోబర్ 29న ఎప్పటిలానే జిమ్ కి వెళ్లిన పునీత్ కి హఠాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో తన ఫ్యామిలీ డాక్టర్ రమణరావు దగ్గరకు వెళ్లారు. అనంతరం విక్రమ్ హాస్పిటల్ కి ట్రీట్ మెంట్ కోసం వెళ్లిన పునీత్ ని అక్కడి డాక్టర్లు కాపాడడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఇక ఆయన మరణం విషయం తెల్సిన కన్నడ చిత్ర పరిశ్రమ నటులు, ప్రేక్షకాభిమానులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనయ్యారు.

  పోలీస్ బందోబస్తు ఏర్పాటు

  పోలీస్ బందోబస్తు ఏర్పాటు

  కాగా పునీత్ మరణానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం అంటూ పలువురు ఆయన ఫ్యాన్స్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేయడంతో డాక్టర్ రమణారావు ఇంటి వద్ద ఎటువటిని గొడవలు జరుగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసారు.

  ఐతే పునీత్ కి హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే తమ క్లినిక్ కి ఆయన వచ్చారని చెప్పిన రమణారావు, అప్పటికే ఆయన ఒంటి నిండా పూర్తి చెమటలు పట్టి ఉన్నాయని, తనకి స్ట్రోక్ అనే అనుమానం రావడంతో వెంటనే మీరు విక్రమ్ ఆసుపత్రికి వెళ్లి యాంజియోగ్రామ్ చేయినుంచోండి అని సూచించానని, అది మాత్రమే కాక, అంబులెన్స్ లో వెళితే మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున ఆయన కార్ లోనే వెంటనే తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేసాం అని అన్నారు.

  30 ఏళ్లకు పైగా

  30 ఏళ్లకు పైగా

  అయితే కొద్దిసేపటి అనంతరం విక్రమ్ హాస్పిటల్ కి వెళ్లిన పునీత్ ని పరీక్షించిన అక్కడి వైద్యులు ఎంతో ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన మనకి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసారు. దాదాపుగా 30 ఏళ్లకు పైగా రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ డాక్టర్ అయిన తనకు వారందరి ఫ్యామిలీ గురించి తెలుసని, ప్రత్యేకంగా పునీత్ కి అనారోగ్యం లేనప్పటికీ ఆరోజున మాత్రం ఆయన సడన్ హార్ట్ అటాక్ తో మరణించారు తప్ప తమ నిర్లక్ష్యం ఏమి లేదని అన్నారు.

   వరుసగా బాక్సాఫీస్ హిట్స్

  వరుసగా బాక్సాఫీస్ హిట్స్

  కన్నడ సూపర్ స్టార్ కంఠీర రాజ్ కుమార్ మూడవ కుమారుడైన పునీత్ చిన్నతనంలోనే బాలనటుడిగా అనేక సినిమాల్లో నటించారు. అలానే అప్పట్లో జాతీయ నటుడిగా అవార్డు కూడా అందుకున్న పునీత్, ఆపైన అప్పు సినిమా ద్వారా శాండల్ వుడ్ కి హీరోగా పరిచయం అయ్యారు. ఆ విధంగా హీరోగా ఫస్ట్ సినిమా తోనే సూపర్ హిట్ కొట్టిన పునీత్ ఆ తరువాత వరుసగా తన టాలెంట్ తో అనేక సినిమా ఛాన్స్ లు అందుకున్నారు. అలానే కెరీర్ పరంగా వరుసగా 10 సూపర్ డూపర్ హిట్స్ కైవశం చేసుకున్న పునీత్ రాజ్ కుమార్ కి అక్కడి యువతలో విశేషమైన ఆదరణ ఉంది. కన్నడ పవర్ స్టార్ గా పేరొందిన పునీత్ అకాల మరణం ఆయన అభిమానులని ఇంకా కృంగదీస్తోంది.

   టాలీవుడ్ నటులతో మంచి అనుబంధం

  టాలీవుడ్ నటులతో మంచి అనుబంధం

  పునీత్ రాజ్ కుమార్ కి మన తెలుగు చిత్ర పరిశ్రమలోని నటులతో కూడా మంచి అనుబంధం ఉంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన దూకుడు సినిమాని అక్కడ పవర్ పేరుతో రీమేక్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు పునీత్. ఆ సినిమా ఆడియో రిలీజ్ వేడుకకి మహేష్ బాబు ప్రత్యేక అథితిగా విచ్చేసి పునీత్ పై ప్రశంసలు కురిపించారు. అలానే ఎన్టీఆర్, బాలయ్య వంటి వారితో రాజ్ కుమార్ కుటంబానికి బాగా సాన్నిహిత్యం ఉండడంతో పాటు బాలయ్య నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి లో శివరాజ్ కుమార్ ఒక చిన్న రోల్ చేసారు.

  Recommended Video

  Puneeth Rajkumar Biography.. Appu అజరామరం.. తండ్రిలాగే కళ్ళు దానం ! || Filmibeat Telugu
   ఎన్టీఆర్ తో స్నేహం..

  ఎన్టీఆర్ తో స్నేహం..

  ఇక రాజ్ కుమార్ నుండి పునీత్ వరకు మెగా ఫ్యామిలీ హీరోలతో కూడా మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో పునీత్ తో పాటు ఆయన సోదరుడు శివ రాజ్ కుమార్ కి మంచి రిలేషన్ ఉంది. ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏకంగా పునీత్ నటించిన చక్రవ్యూహ మూవీలో గెలియా గెలియా పేరుతో ఒక సాంగ్ ని పాడారు. అప్పట్లో ఆ సాంగ్ పెద్ద సంచలనం అయింది. ఇక పునీత్ మరణ విషయం తెలియగానే ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి వారు ఆయన కడసారి చూపుకి వెళ్లి నివాళులు అర్పించారు.

  English summary
  Special security for puneeth Rajkumar personal family doctor,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X