ఏకంగా 5000 కిలోల కేక్.. భారీ కటౌట్.. హీరో యశ్ క్రేజ్ అంటే ఇదీ మరి!

Recommended Video

#HappyBirthdayYash : Reason Behind Rocking Star Yash Huge Craze || #KGFChapter2

ఓ హీరో క్రేజ్ అంటే ఎలా ఉంటుందో యశ్ పుట్టినరోజు వేడుక చూస్తే అర్థమవుతుంది. అతితక్కువ కాలంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన ఈ యువ హీరో జనవరి 8 వ తేదీన 34వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్బంగా ఆయనను సర్‌ప్రైజ్ చేస్తూ అశేష అభిమాన వర్గం బర్త్ డే విషెష్ తెలిపింది. ఆ వివరాలు చూద్దామా..

ఘనంగా బర్త్ డే.. బెంగళూరులో

ఘనంగా బర్త్ డే.. బెంగళూరులో

బెంగళూరు నగరంలో యశ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. నయందహళ్లి లోని నంది లిక్స్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ బర్త్ డే వేడుకకు 20 వేలకు పైగా ఆయన ఫ్యాన్స్ హాజరయ్యారు. భారీ కటౌట్స్, యశ్ పోస్టర్లతో గ్రౌండ్ కళకళలాడింది. ఈ మేరకు యశ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు ఫ్యాన్స్.

స్పెషల్ కేక్.. ఏకంగా 5000 కిలోలు

స్పెషల్ కేక్.. ఏకంగా 5000 కిలోలు

యశ్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన కోసం స్పెషల్‌గా 5000 కిలోల కేక్ రెడీ చేయించారు ఫ్యాన్స్. బేకరీ వర్కర్స్, అభిమానులు అంతా కలిసి 50 గంటలకు పైగా కష్టపడి ఈ కేక్‌ను తయారు చేశారట. ఈ బర్త్ డే వేడుకలో కర్ణాటక వ్యాప్తంగా ఉన్న యశ్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. అభిమానులను వేదిక వద్దకు తరలించడానికి షటిల్ బస్సులను కూడా ఏర్పాటు చేయడం విశేషం.

 సత్కారం..

సత్కారం..


ఈ భారీ కేక్ కటింగ్ తరవాత దానికి అనాధలకు పంచి పెట్టారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో యశ్ దంపతులను గజమాలతో సత్కరించారు అభిమానులు. గ్రౌండ్‌లో 216 అడుగుల భారీ యశ్ పోస్టర్ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. మొత్తానికి ఈ బర్త్ డే వేడుక ఓ కన్నుల పండుగగా సాగింది.

భావోద్వేగానికి గురైన యశ్

భావోద్వేగానికి గురైన యశ్


కార్యక్రమాలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన యశ్ ఒకదశలో భావోద్వేగానికి గురయ్యారు. తనకు పుట్టినరోజు జరుపుకునే అలవాటే లేదని, అభిమానులే తనకు అలవాటు చేశారని అన్నారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో లేక తన అదృష్టమో ఇంతమంది అభిమానాన్ని దక్కించుకున్నానని, ఈ అభిమానం వెలకట్టలేనిదని తెలుపుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు యశ్.

‘కెజిఎఫ్ 2’ సెకండ్ పోస్టర్

‘కెజిఎఫ్ 2’ సెకండ్ పోస్టర్


ఇక యశ్ పుట్టినరోజు సందర్బంగా ‘కెజిఎఫ్ 2' సెకండ్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. కేజిఎఫ్ లోని బానిసలను సైనికులుగా మార్చుకొని తన సొంత రాజ్యాన్ని నిర్మించుకోవడానికి వెళుతున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X