Don't Miss!
- Lifestyle
గుడిలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? దాని వెనక ఉన్న అర్థమేంటంటే..
- News
Lovers: రాత్రి ఫ్రెండ్స్ కు లోకేషన్ పంపించిన గర్ల్ ఫ్రెండ్ ను గ్యాంగ్ రేప్ చేపించిన ప్రియుడు, మ్యాటర్ !
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్‌కు నో ఛాన్స్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న రోహిత్ శర్మ!
- Finance
Layoffs: మీటింగ్ అంటూ పిలిచి.. ఉద్యోగులను పీకేసిన బడా కంపెనీ.. ఏడుస్తున్న 3000 మంది..!!
- Technology
అమెజాన్ ప్రైమ్ & డిస్నీ హాట్ స్టార్ రెండూ ఉచితంగా అందించే Airtel ప్లాన్లు!
- Automobiles
ప్రపంచంలో మొట్ట మొదటి ఆవు పేడతో నడిచే ట్రాక్టర్.. ఎలా ఉందో చూసెయ్యండి
- Travel
హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్లో పాల్గొని కాశీ అందాలను ఆస్వాదించండి!
KGF 2 Trailer: 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్.. సొంత భాషలో కంటే అక్కడే ఎక్కువ..!
పాన్ ఇండియా అనే పదానికి సౌత్ నుంచి స్టార్ హీరోలు సరికొత్త అర్థాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బాహుబలి సినిమా అనంతరం కేజిఎఫ్ చాప్టర్ 1 తో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన హీరో యష్ ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా చాప్టర్ 2ను కూడా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నాడు. తప్పకుండా KGF చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తుంది అని చెప్పవచ్చు. అయితే రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా ముందుగానే బాక్సాఫీస్ కు హెచ్చరిక చేసినట్లుగా అర్థమైంది. ఇక ఈ సినిమా ట్రైలర్ పై సొంత భాషలో కంటే హిందీలోనే ఎక్కువ స్థాయిలో వ్యూవ్స్ అందుకుంది. అలాగే 24 గంటల్లో మొత్తం ఎన్ని వ్యూవ్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే.
Recommended Video


కరోనా వలన..
మొత్తానికి సినిమా ట్రైలర్ అయితే ఊహించని విధంగా రెస్పాన్స్ అందుకుంది. ఇది కన్నడ సినిమా అయినప్పటికీ మిగతా ఇండస్ట్రీలోనే ప్రేక్షకులు కూడా ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ట్రైలర్ ద్వారానే ఒక క్లారిటీ వచ్చేసింది. అసలైతే ఈ సినిమా గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అనుకోని విధంగా కరోనా పరిస్థితుల ప్రభావం వలన వాయిదా పడుతూ వచ్చింది.

తెలుగులో కూడా..
బాహుబలి తో క్రియేట్ అయిన మార్కెట్ను హీరో యష్ జాగ్రత్తగా ఉపయోగించుకున్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన ప్రమోషన్ కూడా సినిమాకు ఎంతగానో హెల్ప్ అయ్యింది. కేవలం షాప్ లోనే కాకుండా కేజిఎఫ్ 1 సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి వసూళ్లను అందుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు చాప్టర్ 2 భారీ స్థాయిలో ధర పలకడం విశేషం. మొత్తానికి ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే సినిమా పై పెట్టిన పెట్టుబడి చాలా వరకు వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

సౌత్ లో నెంబర్ 1 గా..
ఇక KGF చాప్టర్ 2 ట్రైలర్ ఆదివారం రోజు గ్రాండ్ గా విడుదల చేసిన చిత్ర యూనిట్ సభ్యులు మంచి రెస్పాన్స్ అందుకున్నారు. తెలుగులో రామ్ చరణ్ తేజ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక సౌత్ లో మిగతా భాషల్లో ప్రముఖ స్టార్స్ విడుదల చేయించడం జరిగింది. అయితే తెలుగులో సినిమా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే సౌత్ లో అన్ని భాషల్లో కంటే ఎక్కువగా 19.38 మిలియన్ వ్యూవ్స్ అందుకోవడం విశేషం.

హిందీలో అత్యధికంగా
ఇక కన్నడ భాషలో KGF చాప్టర్ 2 ట్రైలర్ 24 గంటల్లో 18.32 మిలియన్ల వ్యూవ్స్ రాబట్టింది. ఇక తమిళంలో 11.87 మిలియన్ల వ్యూవ్స్ అందుకోగా మలయాళంలో 7.90 మిలియన్ల వ్యూవ్స్ ను సాధించింది. ఇక హిందీలో ఈ ట్రైలర్ 49.10 మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి.

ఆల్ టైమ్ ఇండియన్ రికార్డ్
ఈ సినిమాకు అన్ని భాషల కంటే హిందీ లోనే ఎక్కువ స్థాయిలో క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఈ సినిమా ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. ఇక మిగతా భాషల్లో కూడా అంతకు మించి అనేలా కలెక్షన్స్ అందుకోవచ్చు అని తెలుస్తోంది. ఫైనల్ గా అన్ని భాషల్లో ట్రైలర్ 24 గంటల్లో 106.7మిలియన్ల వ్యూవ్స్ ను అందుకొని 2.28 మిలియన్ల లైక్స్ సాధించింది. ఇది ఆల్ టైమ్ ఇండియన్ రికార్డ్ గా నమోదైంది.