»   » అదరగొట్టిన భావన: పెళ్లి తర్వాత ఇదే తొలి ప్రదర్శన!

అదరగొట్టిన భావన: పెళ్లి తర్వాత ఇదే తొలి ప్రదర్శన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో మహాత్మ, ఒంటరి తదితర చిత్రాల్లో నటించిన మలయాళ బ్యూటీ భావన కన్నడ నిర్మాత నవీన్‌ను ఇటీవల పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె తొలి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇటీవల మలయాళంలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలోఆమె హిందీ, మలయాళం పాటలకు డాన్స్ చేసి అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

భావన చివరగా కన్నడ మూవీ 'టగరు'లో నటించారు. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలై సూపర్ హిట్ అయింది. పెళ్లి తర్వాత కూడా భావన సినిమాల్లో కొనసాగుతున్నారు.

Actor Bhavana first stage appearance post wedding

ప్రస్తుతం ఆమె నటిస్తున్న రెండు కన్నడ చిత్రాలు ఇన్స్ స్పెక్టర్ విక్రమ్, మంజిన హాని చిత్రీకరణ దశలో ఉన్నాయి. కన్నడ నిర్మాతను పెళ్లాడిన నేపథ్యంలో ఆమె ఈ ఇండస్ట్రీలోనే కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

భావన నటించిన మలయాళ మూవీ 'ఆడమ్ జాన్' గతేడాది సెప్టెంబర్లో విడుదలైంది. గతేడాది జరిగిన కొన్ని పరిణామాలు భావన జీవితాన్ని కుదిపేశాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఓ మలయాళ స్టార్ అరెస్టు కూడా అరెస్టయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమకు ఆమె అంటీముట్టనట్లే ఉంటోందని టాక్.

Read more about: bhavana భావన
English summary
Malayalam actress Bhavana made her first stage appearance at a recent award ceremony after her wedding with Kannada producer Naveen. Bhavana danced to Hindi and Malayalam numbers and her graceful dance moves left the audiences asking for more.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X