బహిరంగ ప్రదేశంలో మైనర్లకు మర్మాంగం ప్రదర్శన.. యువ నటుడు అరెస్ట్

మలయాళంలో ప్రముఖ నటుడు శ్రీజిత్ రవిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశంలో ఇద్దరు మైనర్లకు తన మర్మాయవాన్ని చూపించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఈ ఘటన త్రిచూర్ జిల్లాలో జూలై 4వ తేదీన జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోస్కో) చట్టం సెక్షన్ 11 కింద ఈ కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు.

ప్రముఖ నటుడు టీజీ రవి కుమారుడైన శ్రీజిత్ కారులో ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరు మైనర్లు అక్కడికి వచ్చి ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు. అప్పుడు ఆయన కారులో నుంచి దిగి ఆ ఇద్దరికి తన అంగాన్ని చూపించారు అని పోలీసుల తెలిపారు. తమ దర్యాప్తులో శ్రీజిత్ అనుచిత ప్రవర్తన నిజమేనని తేలింది. సాక్ష్యాల ఆధారంగా కేసు నమోదు చేశాం. శ్రీజిత్ కూడా తను చేసిన పనిని ఒప్పకొన్నాడు. ఆయన సైక్రియాటిస్ట్ వద్ద ట్రీట్‌మెంట్ తీసుకొంటున్నాడు అని పోలీసులు వెల్లడించారు.

Actor Sreejith Ravi arrested on POCSO Act in Thrissur district

అశ్లీల పనులకు పాల్పడి గతంలో కూడా నటుడు శ్రీజిత్ అరెస్ట్ అయ్యారు. పాలక్కడ్ ప్రాంతంలో 14 మంది స్కూలు అమ్మాయిలకు తన అంగాన్ని చూపించి వివాదంతోపాటు కేసులో ఇరుక్కుపోయారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన కొంతకాలం మీడియాకు, సినిమా రంగానికి దూరంగా ఉన్నారు. ఆ కేసులో శ్రీజిత్‌తో కుమ్మక్కయ్యారంటూ బాధిత కుటుంబాలు పోలీసులపై ఆరోపణలు చేశారు.

ఇక శ్రీజిత్ విషయానికి వస్తే.. మయూఖం అనే సినిమా ద్వారా 2005లో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అదే సంవత్సరం ఛతుపొట్టు అనే సినిమా ద్వారా పాపులారిటిని సొంతం చేసుకొన్నాడు. అలాగే మిషన్ 90 డేస్, పున్యలన్ అగర్ బత్తీస్, పున్యాలన్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర చిత్రాల్లో నటించారు. వెట్టై, కుమ్కి, మధా యానై కూట్టం, కథాకళి, అసురవధ అనే తమిళ చిత్రాల్లో కూడా నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X